ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు -
* గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో బిడ్డ పుడుతుంది. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల తల్లీ,బిడ్డల మరణాలకు దారి తీస్తాయి.
* పాలిచ్చే తల్లులు సంపూర్ణ ఆహారం తీసుకుంటే శిశువుకు కావలసినంతగా పాలు ఇవ్వగలరు.
గర్భవతిగా వున్నపుడు రోజు తీసుకోవలసిన ఆహారం:
1) ఐదు నెల నుంచి తప్పకుండ ఆహారంలో క్యాలరీస్ ఉండేలా చూసుకోవాలి.
2) గర్బవతికి రోజుకి 300 క్యాలరీస్ శక్తి అవసరం అవుతుంది
3)అదనంగా 15 గ్రాముల మాంసకృత్తులు
4)10 గ్రాముల కొవ్వుపదార్దాలు ఉండేలా చూసుకోవాలి.
గర్బిణీలు కాల్షియం వున్న ఆహారం తప్పకుండ తీసుకోవాలి. దీనివల్ల బిడ్డకి ఎముకలు, దంతాలు దృడం గా రూపొందుతాయి అలాగే తల్లికి పాలు కూడా సమృద్దిగా వుంటాయి. ఐరన్ కూడా తప్పకుండా తీసుకోవాలి. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది.
గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి :
* రోజుకు మూడు కన్నా ఎక్కువ సార్లు భోజనం చెయ్యాలి.
* మొలకెత్తినధాన్యాలు,ముడిధాన్యాలు ఆహారం తీసుకొవాలి.
* పాలు, మాంసము, కోడిగుడ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
* ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి.
* ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభభించి తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి.
* టీ, కాఫీ ఈ సమయంలో తీసుకోకపోవడమే మంచిది ఇవి శరీరానికి కావలసినంత ఐరన్ అందకుండా చేస్తాయి .
ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభభించి తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి.
* టీ, కాఫీ ఈ సమయంలో తీసుకోకపోవడమే మంచిది ఇవి శరీరానికి కావలసినంత ఐరన్ అందకుండా చేస్తాయి.