విశ్వం కన్ను విప్పని నాడు వేదం వెలిసిన ధరణి ఇది అని ఒక మహా కవి అన్నాడు.వేదం నుండి అనునాదం. పుట్టిందనియుగ్ అనే పదం నుండి పుట్టింది యోగా అని యోగం అంటే జ్ఞానం అని సంపూర్ణ వికాసానికి దేహదారుద్యం  కోసం .మానసికంగా బలం గా ఉండడానికి  ఆరోగ్యం గా ఉండేందుకు శరీరం ఎటువైపైనా వొంపు సొంపులు యోగాతో సాధ్యమని ముఖకవళిక లో ఒకరక మైన గ్లౌ ఉంటుందని యోగసాధకులు అంటున్నారు.  

శారీరక ధారుడ్యం,నాజూకుగా ఉంచుతుంది. అలాగే మొహం లో కళ ఉట్టిపడుతుంది.వేకువజామున చేసే యోగాసాధనానికి మెరుగైన ఫలితాలు ఉన్నాయని దీర్ఘకాలిక సమస్యలకు యోగా లో చక్కని ఫలితాలు ఉన్నాయని  నిపుణులువిశ్లేషిస్తున్నారు. యోగం అంటే అదృష్టం అని అంటారు.యోగం అంటే జ్ఞానం అని కొందరు అంటారు.యోగ సాధనం అంటే జ్ఞానా న్నిపొందడం అని కొందరు అంటారు. యోగం అంటే ఒక యజ్ఞం లాంటిది దానిని సాధన చేయాలని అంటారు. నిపుణులు. క్రమ పద్దతిలో చేసే యోగం వల్ల వ్యక్తి శారీరకంగా మానసికంగా అన్నిటికి సిద్ధం అవుతారు.మానసికంగా శారీరకంగా దృడంగా ఉంచేది యోగానే అని కొన్ని దీర్గ కాలిక అనారోగ్యాలకు ముఖ్యంగా శరీరంలోని పంచేంద్రియాలను అదుపులో ఉంచేది యోగాసాధానమే.

అందుకే యోగా ను భారతీయులు పతంజలి యోగశాస్త్రం ప్రాచుర్యం లో ఉన్నప్పటికీ.యోగా ద్వారా శారీరకంగా ద్రుదత్వాన్ని కలిగిన వారు ఒక్కోసారి జిమ్నాస్ట్స్ లో రాణించారు అంటే యోగా వల్ల శరీరంలో శక్తి,శరీరాన్ని ఒడుపుగాకదిలిస్తూ చేసే వ్యాయామం వల్ల మనసు శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా నేటి యువతరం ఎదుర్కునే సమస్య లకు యోగా చక్కటి పరిష్కారం చూపుతుందని అంటున్నారు యోగసాధకులు.  మనపోట్ట తగ్గాలంటే-ముఖం అందంగా కాంతివంతంగా పెంచుకోవాలంటే చాలా లాభాదాయక మైనది హలాసనం.

హలాసనం వల్ల వచ్చే లాభాలు...

హలాసనం ప్రతి రోజూ వేయడం ద్వారా హలసనం లో తల నుండి పోట్టవరకూ రకరకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.ఈ ఆసనం వేయడం ద్వారా శరీరం లోని ప్రతి భాగం పటిష్టంగా ఉంటుంది.శరీరాన్ని చాలా మృదువుగా బక్క పలుచగా    ఆరోగ్యంగా ఉందెందుకు సహకరిస్తుంది. హలాసనం వేయడం వల్ల ఎవరికీ లాభం  ఎవరైతే శరీర వ్యాయామం సరిగా చేయడం లో రోజంతా కూర్చుని పనిచేస్తారో.వారికి   చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

హలాసనం తో మరిన్ని లాభాలు చూద్దాం...

బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు పొట్టలో కొవ్వు పేరుకుపోతుందో వారు హలాసనం సాదన చేయండి.పొట్టలో పేరుకున్న అదనపు కొవ్వు త్వరలో తగ్గిపోవాలంటే హలాసం వేయండి.ఈ ఆసనం వేసాక కొన్ని సెకండ్లు తరువాత కొవ్వు పోయి లాభం కలుగుతుంది.

నడుము నొప్పి దూరం...

ఆఫీసు లేదా ఇంటిలో అదేపనిగా 8 గంటల నుండి 1౦ గంటల వరకు కూర్చుని పని చేస్తారో దీనికారణంగా వెన్నుపూస నడుమునొప్పి వస్తూ ఉంటుంది. మీకోసం హలాసనం కన్నా పెద్దదైన ఆసనం లేదు.హలాసనాన్ని సాధన చేయడం ద్వారా వెన్నునోప్పికి శాస్వతంగా విముక్తి పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

పంచేంద్రియాలు బలోపేతం...

ఆసనాన్ని క్రమ పద్దతిలో అభ్యసిస్తే పంచేంద్రియాలు బలంగా ఉండడం అవసరం.దీనివల్ల భోజనం చాలా చక్కగా అరుగుతుంది. భోజనం ద్వారా లభించే పోషక తత్వాలు శరీరం లో చాలాసులభంగా కలిసి పోతాయి.

పోట్టసమస్యలు దూరం...

గ్యాస్ ఎసిడిటి కొన్నిరకాల రాసాయానాల వచ్చే సమస్యలు.వారికి హలాసనం ఒక వరదానం అనే చెప్పాలి.హలాసనం వల్ల పొట్టలోని మాంసకండరాలు లాగడం.దీనివల్ల మరింత బలోపేతం అవుతుంది.పోట్ట వల్ల వచ్చే సమస్యలు దూరమౌతాయి.

ముఖం లో గ్లౌ పెరుగుతుంది...

హలాసనం వేసే సమయం లో రక్త ప్రవాహం ముఖం వైపు ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా ముఖం గ్లౌ మరింత పెరుగుతుంది.చర్మం తైట్ గా ఉంటుంది ముఖంపై ముడతలు మచ్చలు పోతాయి సహజమైన గ్లౌ వస్తుంది.