మనం రోజువారీ తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు ఎంతో ముఖ్యమైనవి. అయితే చాలామంది ప్రస్తుతం పట్టణాల్లో నివశిస్తున్నవారు అందుబాటులో లేవనే కారణంతో ఆకుకూరలు సరిగా తీసుకోవడం లేదు. కొందరు ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని ఆకుకూర మొక్కలు పెంచుకుని అప్పుడప్పుడు వాటిని తింటూ ఉంటారు. అవి ఎంతో ఆరోగ్యకరమే కాకుండా రసాయనాలు లేనివి కాబట్టి పలితాలు కూడా బాగా ఇస్తాయి. కానీ అసలు ఆకుకూరలు తిననివారు చాలామంది ఉంటారు.  

అసలు ఆకుకూరలు ఎందుకు తీసుకోవాలి?? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? వంటివి వివరంగా తెలిస్తే వాటిని ఆహారంలో తప్పకుండా తినడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. నిజానికి ఆకుకూరల ప్రాధాన్యత చిన్నప్పటి నుండి పాఠాలలో చదువుకుని తెలుసుకుంటూనే ఉన్నాం, విటమిన్స్ మొదలైన అంశాలలో మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకుంటుంటాం కానీ ఆరోగ్యం గురించి మాట్లాడుకునే సమయంలో మళ్ళీ వాటిని వివరంగా చర్చించుకోవాలి. లేకపోతే మన మొండి బుర్రలు ఆరోగ్యం గురించి భయంతో ఉండవు. 


ఆరోగ్యానికి ఆకుకూరలు రోజు తినాలి వీటిలో కూరగాయల కంటే రెట్టింపు పోషక విలువలు, మాంసకృత్తులు ఉంటాయి.


చాలామంది పాలకూర, టమాట కలిపి వండుకునే విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ రెండింటిని అప్పుడప్పుడు సందేహం లేకుండా వండుకుని తినచ్చు. 


 ఆకు కూరలను మొక్కల నుండి కోసిన తరువాత ఒకటి రెండు రోజులు నిలువ ఉంచుకోవచ్చేమో కానీ వాటిని చిన్నగా తరిగి నిలువ ఉంచకూడదు. అలా నిలువ ఉంచితే వాటిలో ఉండే పోషక విలువలు పోతాయి.  


చాలామంది క్యాల్షియం తక్కువ ఉందని, ఐరన్ తక్కువ ఉందని టాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా టాబ్లెట్లు ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి.  అందుకే వీటిని ఆకుకూరల నుండి పొందవచ్చు. 


ఆకు కూరలతో చాలామంది పొడికూరలు చేస్తుంటారు. ఆకుకూరలు ఫ్రై చేసి చేసే ఈ పొడికూరలలో పోషకాలు ఏమి ఉండవు. ఫ్రై చేయడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు నశిస్తాయి. అలాగే ఆకుకూరలతో చింతపండు ఎక్కువ జతచేయకూడదు  


తోటకూరను పెరుగు కలిపి నూనె లేకుండా వండుకోవచ్చు, అలాగే గోంగూరను  పాలు కలిపి వండుకోవచ్చు  అయితే నూనె లేకుండా వండాలి. ఇలా చేస్తే  రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యం కూడా. 


పప్పులను కూరగాయలతో లేదా ఆకుకూరలతో కలిపి వండుకోవాలి. దీనివల్ల రుచి మాత్రమే కాదు రెండింటి వల్ల పోషకాలు సమతుల్యంగా ఉంటాయి. 


ఆకు కూరలలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మద్యాహ్న సమయంలో తినాలి. ఆకుకూరలను పప్పులతో కలిపి వండినప్పుడు వాటిని  సాయంత్రం(లేదా రాత్రి) సమయంలో  తింటే గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. ఆకుకూరలు అన్నింటిలో "ఎ" విటమిన్ పుష్కలంగా ఉంటుంది. 


ఎన్నో చోట్ల విరివిగా పెరిగే చెట్లు మునగచెట్లు.  వీటికి ప్రత్యేక నీటి వసతి, సంరక్షణ అవసరం లేదు. వాటికవే పెరుగుతాయి. వీటి నుండి లభించే మునగాకును ప్రతిరోజు వంటలలో వాడవచ్చు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో అధికమొత్తంలో ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి ఐరన్ లోపం ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు. 


ఆకు కూరలలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని విరివిగా వాడితే మహిళలకు  జట్టు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా తోటకూర, మునగాకు, కరివేపాకు బాగా వాడాలి. 


ఆకుకూరలు బాగా వాడితే బాలింతలకు మంచిది. వీటివల్ల బాలింతలకు పాలు బాగాపడతాయి.


ఆకుకూరలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం టాబ్లెట్లు వాడితే అనర్థాలు కలుగుతాయి. అదే  సహజంగా లభించే క్యాల్షియం ద్వారా మన శరీరానికి ఎలాంటి అనర్థముండదు. కిడ్నీలో రాళ్లురావు. 


 మనకు అవసరమైన ఐరన్ కూడా  పండ్లలో కంటే ఆకు కూరలలోనే ఎక్కువగా ఉంటుంది.


పాలకూర, శనగపిండి, నిమ్మరసం, పచ్చిమిర్చి, అల్లం అన్ని కలిపి నూనె లేకుండా వెయించి బజ్జీల్లాగా తినవచ్చు.


గోధుమలు, పాలిష్ చేయని బియ్యం వంటి వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకుంట పూర్తి స్థాయిలో కాల్షియం అందుతుంది.

ఒకసారి తీసుకున్న పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు సుమారు 300 మిల్లీల కాల్షియాన్ని అందిస్తాయి. 


క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదలైన వాలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది.


కాల్షియం శరీరంలో వచ్చే వ్యాధి కారక క్రిములను నాశనం చేస్తుంది. కాబట్టి క్యాల్షియాన్ని శరీరానికి సరిపడా అందివ్వాలి.


                                     ◆నిశ్శబ్ద.