ద్రాక్ష ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనది. దీని రుచి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి. ఎరుపు, నలుపు, ఆకుపచ్చ రంగులలో లభిస్తుంది. వీటిలో ఎర్ర ద్రాక్ష కాస్త ప్రత్యేకం. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. ఎర్ర ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే...
రోగనిరోధక వ్యవస్థ..
ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలతో పాటు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.
కంటి ఆరోగ్యం..
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎర్ర ద్రాక్ష మంచి ఎంపిక. ఎర్ర ద్రాక్ష ఆక్సీకరణ ఒత్తిడిని, కళ్ల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్ర ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటిశుక్లం రాకుండా చేస్తుంది.
బీపీ పై నియంత్రణ..
ఎర్ర ద్రాక్ష తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు గుండెను వ్యాధుల నుండి రక్షించడానికి పని చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మూత్రపిండాల ఆరోగ్యం..
ఎర్ర ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ..
ఎర్ర ద్రాక్షలో ఉండే పొటాషియం, ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఎర్ర ద్రాక్షను ఆహారంలో చేర్చుకోవాలి.
కొలెస్ట్రాల్..
ఎర్ర ద్రాక్ష కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఆహారంలో ఎర్ర ద్రాక్షను చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది జ్ఞాపకశక్తిని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
*నిశ్శబ్ద.