ప్రపంచంలో ఏ మూల చూసినా.. ఎవ్వరి నోట విన్నా కరోనా ప్రస్తావననే. ఈ మహమ్మారి గురించిన భయందోళనలే. లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న ఈ వైరస్ ను ఎదుర్కోవాలంటే మనలో రోగనిరోధక శక్తి పెంచుకోవడమే ఏకైక మార్గం. కంటికి కనిపించకుండానే చాలామంది ఊపిరి తీస్తున్న ఈ సూక్ష్మక్రిమిని అంతమొందించాలంటే రోగనిరోధక శక్తిని పెంచే సూక్ష్మపోషకాలు ఎన్నో ఉన్న వీటిని తీసుకోవల్సిందే..

బజారుకు కూరగాయల కోసం వెళ్ళితే  తప్పకుండా చాలామంది తీసుకునేవి నాలుగు రకాల ఆకుకూరలు. వెజ్ అయినా... నాజ్ వెజ్ అయినా ఈ నాలుగు ఉండాల్సిందే. మరి ఆ నాలుగు ఎంటో తెలుసా.. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మెంతికూర.
పప్పులో, సాంబర్ లో కరివేపాకు లేకపోతే రుచి సహించదు. వంకాయ అయినా, ఆలు అయినా మెంతికూర వేస్తేనే రుచి.  బిర్యానీ వండిన తర్వాత కాస్త పుదీనా వేయకపోతే ప్లెవరే రాదు. చాట్ అయినా...కట్లెట్ అయినా సన్నగా తరిగిన కొత్తమీర అలా అలా చల్లితేనే టెస్ట్ అదిరిపోతది. మరి ఈ నాలుగు కేవలం రుచికోసమేనా.. కాదు ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఎంతో అవసరం అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి వీటిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుంటే ఈ సారి తప్పక మీ వెజిటబుల్ బ్యాగ్ లో వీటికి మరింత చోటిస్తారు.

కరివేపాకు..
కూరలో కరివేపాకులా.. సాంబర్ లో కరివేపాకులా తీసిపారేయకండి అన్న మాట మనం చాలా సార్లే వింటాం. నిజానికి కూరలోనూ.. సాంబర్ లోనూ.. పప్పులోనూ వేసిన కరివేపాకులోని పోషకాల గురించి తెలుసుకుంటే అసలు తీసిపారేయరు.

కరివేపాకులో తాజా సువాసన, కమ్మని రుచి ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ఆ వంటలకు ఎక్కువ రుచి, వాసన ఉంటుంది. సాధారణంగా పెరటిలో ఉండే చెట్లల్లో కరివేపాకు తప్పక ఉంటుంది. మన దేశంలోనే కాకుండా చైనా, ఆస్ట్రేలియా, నైజీరియాల్లో ఎక్కువగా పెరుగుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ , వివిధ రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ డయాబెటిక్ , యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలతో పాటు, హిపటో ప్రొటెక్టివ్ లక్షణాలు అధికంగా ఉంటాయి.ఇది జీర్ణ, కాలేయ సమస్యలను నివారించడానికి దివ్యంగా పనిచేస్తుంది.
శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, అథిక కొవ్వును కరిగిస్తుంది.  బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు ఎక్కువగా తీసుకోవాలి. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ తాగడం వల్ల కొవ్వు కరిగించుకోవడంతో పాటు, బరువు తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యూరిన్ , బ్లాడర్ సమస్యలను నివారిస్తాయి.  కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి చేర్చి తాగడం వల్ల యూరినరీ సమస్యలు చాలా త్వరగా తగ్గుతాయి.
రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉండేందుకు కరివేపాకు ఉపయోగపడుతుంది. రక్త హీనతను తగ్గిస్తుంది.  ఇందులో అధికమోతాదులో ఉండే ఐరన్ శరీరంలోని రక్తకణాలకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. 

చిన్నవయసులోనే డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. దీనికి సరైన పరిష్కారం కరివేపాకు ఎక్కువగా తీసుకోవడం. కరివేపాకు ఎక్కువగా తినేవారిలో త్వరగా వృద్దాప్య లక్షణాలు కనిపించవు. కరివేపాకులో ఉండే యాంటీహైపర్ గ్లిసమిక్ రక్త నాళాల్లో గ్లోకోజ్ ను కంట్రోల్ చేస్తుంది.
సీజన్ మారినప్పుడల్లా అనారోగ్య సమస్యలకు గురయ్యేవారు తమ ఆహారంలో కరివేపాకు ఎక్కువగా చేర్చుకుంటే సీజనల్ గా వచ్చే సమస్యలు దరిచేరవు.
కరివేపాకులో పుష్కలంగా లభించే విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. కరివేపాకును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కళ్ళ సంబంధించిన జబ్బులను నివారించుకోవచ్చు.చర్మ సంరక్షణకు కరివేపాకు, వేపాకులు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి ప్రతిరోజూ రెండుపూటలా మజ్జిగతో కలిపి తాగాలి.

కరివేపాకు పేస్ట్ కు కొద్దిగా పసుపు చేర్చి చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్స్ ను తగ్గిస్తుంది. జుట్టు సమస్యలకు కరివేపాకు మంచి రెమిడీగా పనిచేస్తుంది. జుట్టు తర్వగా తెల్లబడటం, రాలిపోవడం, బట్టతల సమస్యలకు కరివేపాకు మంచి ఔషధం.
మరి ఇన్ని ఉపయోగాలున్న కరివేపాకును తీసి పారేస్తారా.. నమిలి మింగేస్తారా మీరే తెల్చుకోండి

పుదీనా
పుదీనాలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుంటే ప్రతిరోజూ తప్పక మీ డైట్ లో చేర్చుకుంటారు. అలర్జీని, ఉబ్బసాన్ని దూరంచేసే ఔషధలక్షణాలు ఇందులో ఉన్నాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. పూదీనా టీ, పూదీనా పచ్చడి ఇలా తరచూ పుదీనా తీసుకుంటే ఫలితం కనిపిస్తుందట.

పుదీనాలో ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి లు.. కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యాలను దూరం చేస్తాయి. అంతేకాదు ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అలర్జీని దూరం చేస్తాయి.  శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తాయి. పుదీనా టీ తాగడం వల్ల నోటిలోని హానికర బాక్టీరియాలను నశిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. వర్షాకాలంలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతునొప్పి తగ్గుతాయి. ముఖం పై నల్లమచ్చలు, మొటిమలకు పుదీనా రసం దివ్యౌషధం. 

కొత్తిమీర
అన్ని రకాల వంటల్లో కొత్తిమీర వాడుతాం. గార్నిష్ కు ఉపయోగిస్తాము. ఇందులో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు, విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో ఇతర ఏ ఆకుకూరల్లో లేని విధంగా విటమిన్ సి, విటమిన్ బి, భాస్వరం, కాల్షియం, ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ ఉంటాయి. కొత్తిమీరలో ఉండే  యాంటీ-ఆక్సిడేంట్స్  శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. కొత్తమీరలో అధికంగా ఉండే విటమిన్ కె  ఎముకలు బలంగా ఉండటానికి దోహదం చేస్తుంది. 

కొత్తిమీర వాసన మనసును ఆహ్లాద పరుస్తుంది. ఇందుకు కారణం ఇందులోని 'ఎసేన్షియాల్ ఆయిల్స్'. వీటి వల్ల కొత్తిమీర వాసనతో తలనొప్పి, మానసిక అలసటను టెన్సన్స్'ను తగ్గిస్తుంది.

మెంతికూర
అతి విలువైన పోషకాలు ఉండే మెంతికూరను ఎక్కువగా నాన్ వెజ్ లో వాడతారు. కొద్దిపాటి చేదు రుచితో ఉండే మెంతి టమాటాతో కలిపి పప్పు చేసినా ఎంతో రుచిగా ఉంటుంది. మెంతి పరోటాలు మరింత రుచిగా ఉంటాయి. ఎండపెట్టిన మెంతిని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. మెంతికూరలో అత్యధికంగా ఐరన్ వుంటుంది.  రక్తహీనతతో బాధపడేవారికి మెంతులు, మెంతికూర మేలు చేస్తాయి.

తాజా మెంతికూర ఆకును జ్యూస్ షుగర్ వ్యాధితో బాధపడేవారికి బాగా పనిచేస్తుంది. శరీరానికివసరమైన పీచు పదార్ధాలు,  విటమిన్ కె, ప్రొటీన్లు, నికోటినిక్ యాసిడ్ కూడా వుంటాయి. మెంతిని ఏ రూపంలో వాడినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతులు, తాజా మెంతి,ఎండిన మెంతి ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.