వృ ద్దాప్యం...

శరీర కణాల వృద్ది కణాలు అంతరించిపోవడం మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్ ఏర్పడుతుంది. జన్యువులలో మార్పు సంభవించినప్పుడు. ఇలా జరుగుతుందని సైంటిస్ట్లు కనుగొన్నారు. శరీర కణాలు వృద్ది చెందడం అంతరించిపోవడం మధ్య సమతౌల్యతను కాపాడే జన్యువులలో మార్పు మార్పు రావడం సాధారణంగా వయస్సు పై బడుతున్న కొద్దీ జరగడానికి అవకాసం ఉంది. ఉదాహరణకు 25 సంవత్సరాల యువకుని కంటే 75 సంవత్సరాల యువకుని కంటే 75 సంవత్సరాల వ్రుద్దునిలో క్యాన్సర్ రావడానికి 1౦ ౦ శాతం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీర్ఘకాలం పాటు జీవించే వారికి జన్యువులలో ఇలాంటి మార్పులు జరిగె అవకాసం ఎక్కువుంటుంది. అలా అని వృద్ధులందరికీ ఇలా మార్పులు జరిగి క్యాన్సర్ వస్తుందని చెప్పటానికి వీలు లేదు.  క్యాన్సర్ ఏ వయస్సులో ఐనా రావచ్చు. ఆఖరికి పిల్లలకు కూడా వచ్చే అవకాసం ఉంది. 

కుటుంబ చరిత్ర...

ఎక్కువ రకాల క్యాన్సర్స్ జన్యువుల లో అనుకుని మార్పులు జరగడం. మూలంగా రావచ్చని చెప్పుకున్నాము. ఇలాంటి మార్పులు కుటుంబ పరంగా క్యాన్సర్ చరిత్ర కలవారికి వారసత్వంగా వచ్చే అవకాసం కొంత ఉంది. అలా అని కుటుంబ సభ్యుల లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉంటె వారి పిల్లలకు కూడా క్యాన్సరు తప్పకుండా వస్తుందని కాదు. నిజం చెప్పాలంటే 8౦ నుంచి 9౦ శాతం క్యాన్సరు కేసులు ఏ క్యాన్సరు చరిత్ర లేనివారికి వస్తున్నాయి. కాక పోతే కుటుంబ పరంగా క్యాన్సరు చరిత్ర కలవారికి క్యాన్సరు రావడానికి కొంత ఎక్కువ అవకాసం ఉంది. ఉదాహరణకు 5% బ్రెస్ట్ క్యాన్సర్లు ఆ కుటుంబ చరిత్ర కలవారికి వస్తోంది. 

పొగతాగడం...

పొగ తాగడం మూలంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్, గొంతు, క్యాన్సర్, నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్,మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ, జీర్నాశయ క్యాన్సర్, క్లోమం, గర్భాశయ క్యాన్సర్. మొదలైన అవయవాలకు క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఏటా 1, 8౦, ౦౦౦ మందికి పైగా పోగాతాగాటం వల్ల చనిపోతున్నారని అక్కడి ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తున్నాయి. ఒక్క పొగ తాగే వారు మాత్రమే కాదు ఆ పక్కన ఉండే వారికీ వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సార్లలో ఎదో ఒకటి రావడానికి అవకాసం ఉంది. పోగాతాగడం అనేది మనం మార్చుకోగలిగిన జీవన శైలి. తద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. పోగాతాగడం తో పాటు మద్యం సేవించే అలవాటు కూడా ఉన్నవారికి క్యాన్సర్ రావడానికి మరిన్ని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పోషకాహార లోపం- స్థూలకాయం...

రెండు రకాల సమస్యలు కల వారికి కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి అవకాసాలు ఉన్నాయని పరిశోధకులు చేపుతున్నారు. ఉదా.. కొవ్వు పదార్ధాలు అతిగా తీసుకునే వారికి పెదా పేగులు, ర్భాశయం, ప్రోస్టేట్ క్యాన్సర్, రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థూల కాయం తో బాధ పడే వారు సరిపడా లేని వారికి పెద్ద ప్రేవులు, అన్న వాహిక కిడ్నీ, గర్భాశాయాలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహారంలో పళ్ళు ఫలాలు కాయ కూరలు, సరిపడా ఉండే టట్లు చూసుకోవడం రోజుకి 3౦ నిమిషాల చొప్పున 5 రోజులు చురుకుగా నడవడం. వంటి కనీస వ్యాయామం చేయడం ద్వారా స్తూల కాయం రాకుండా చూసుకోవడం ఒకవేళ స్తూల కాయం తో బాధ పడుతుంటే దానిని తగ్గించుకోవడం లాంటి చర్యల ద్వారా కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు ను నివారించ వచ్చనేది నిపుణుల సూచన. 

రేడియేషన్, సూర్యరస్మి...

అనువిద్యుత్ ప్రాజెక్ట్ ల నుండి గాని లేదా ఆణు ఆయుధ ప్రయోగాలు జరప బడ్డ చుట్టుపక్కల ప్రాంతాలాలో నివసించే వారికి ఆణు ధార్మికత సోకే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ల్యుకేమియా గా పిలవబడే బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, రావడానికి ఎక్కువ అవకాశాలుఉంటాయి. లేదా కొన్ని గనులలో పనిచేసే వారికి అక్కడి మట్టి, రాళ్ళలో ఉండే రంగు,రుచి వాసన లేనిరాడాన్ అనబడే రేడియో యాక్టివ్ గ్యాస్ సోకి ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎముకలు విరిగినప్పుడు లేక ఇతరత్రా అంతర్గత అవయవాల చిత్రాలను చూడడానికి ఎక్స్ రేలు తీసే టెక్నీషియన్లకు క్యాన్సర్ ను నయం చేయడానికి వాడే రేడియేషన్ తెరఫిలో పెద్ద యంత్రాల నుంచి వచ్చే రేడియేషన్ మూలంగా ఆయా మిషన్ల టెక్నీషియన్లకు క్యాన్సర్ వచ్చే ప్రామాదం ఉంది. అయితే ఎక్స్ రే ఫోటోలకు వాడే రేడియేషన్ చాలా స్వల్పంగా మాత్రమే రేడియేషన్ తెరఫిలో వాడే రేడియేషన్ కొంచం అధికంగానే ఉంటుంది. మనలాంటి ఉష్ణ దేశాలాలో కంటే శీతల దేశాలలో నివసించే ప్రజలకు ఎండలో ముఖ్యంగా మిట్ట మాధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు గడిపితే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 

రాసాయానాలు...

వృత్తి రీత్యా కొన్ని రకాల పనులు చేసేవారు. ఉదా-- భవనాలకు రంగులు వేసే పెయింటర్లు నిర్మాణ రంగ కార్మికులు ఆస్బెస్టాస్ కెమికల్ పరిశ్రమలో పని చేసేవారికి వాళ్ళు పని చేసే రాసాయనాల మూలంగా క్యాన్సర్ ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది. 

కొన్ని రకాల వైరస్ లు...హ్యూమన్ పాపిలోమా వైరస్...

హెపటైటిస్ -బి వైరస్ మూలంగా లివర్ క్యాన్సర్ పాపిలోమా వైరస్ మూలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్,సెర్వైకల్ క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధికి కారణ మైన హెచ్ ఐ వి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్,మూలంగా కపోసి సర్కోమా అనబడే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెలికో బ్యాక్టార్ పైలోరి, అనబడే బ్యాక్టీరియా మూలంగా జీర్ణాశయం లో పుళ్ళు ఏర్పడడం మాత్రమే కాదు జీర్నాశయ క్యాన్సర్ వచ్చే అవకాసం ఉంది. 

కొన్ని రకాల హార్మోన్లు...

మెన్సెస్ నెలసరి ఆగిపోతున్న దశలో స్త్రీలకు ఎముకలు పెళుసుగా ఉండడం, యోని పోడి బారాడం. వంట్లో సెగలు పొగలు లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి స్త్రీలకు డాక్టర్లు ఈస్ట్రో జన్ గాని,ప్రోజేస్ట్రోన్, గాని లేక లేదా రెండు హార్మోన్లు కలగలిసి సూచిస్తారు. ఇలాంటి హార్మోన్ తెరఫీ మూలంగా ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ కింద బ్రెస్ట్ క్యాన్సర్ ,గర్భసంచి క్యాన్సర్, గుండె పోటు, పక్షవాతం, రక్తపు గడ్డలు, కట్టడం లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

క్యాన్సర్ నిర్ధారణ...

క్యాన్సర్ ఏ అవయవానికి సోకింది, అది ఏ దశలో ఉంది. అన్నది తెలుసుకున్నాక డాక్టర్స్ రోగికి చికిత్స చేసే విషయాన్ని ఈ కింద అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. 

ఆరోగి వయస్సు.
ఆ వ్యక్తి శరీర దారుడ్యం.
క్యాన్సర్ ఏ సైజు లో ఉంది.
క్యాన్సర్ ఏ దశలో ఉంది .
క్యాన్సర్ ఎంత వేగంగా వృద్ధి చెందుతుంది.

ఇతర అంశాలు క్యాన్సర్ ఏ దశలో ఉందొ తెలుసుకోడానికి కింద పేర్కొన్న పరీక్షలను జరిపిస్తారు.

ఎక్స్ రే పరీక్ష.
అల్ట్రా సౌండ్ స్కాన్.
సిటి స్కాన్ .
న్యూక్లియర్ స్కాన్ .
ఎం ఆరై స్కాన్.
పెట్ స్కాన్

ఈ పరీక్షల వల్ల క్యాన్సర్ శరీరంలో ఏ భాగాన్ ఉందొ గడ్డ ఏ సైజులో ఉంది. క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాల లోకి లేదా ఇతర భాగాలాలోకి వ్యాపించిందా లేదా అన్న విషయాలు తెలుస్తాయి.

ముఖ్యంగా ల్యాబోరేట రీ లలో చేసే రక్త పరీక్ష,మూత్ర పరీక్ష, కళ్లి పరీక్ష ఇతర ద్రవాల పరీక్షలు క్యంసర్ కు సంబందించిన ఇతర సమస్యలు ఏ మైనా ఉంటె తెలుస్తాయి.

 క్యాన్సర్ ముదరడం- వివిధ దశలు...

రోగికి క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యాక డాక్టర్స్ మొదట ఆ క్యాన్సర్ ఏ దశలో ఉందొ అన్నది తెలుసుకోడానికి ప్రాయాత్నిస్తారు. అంటే ఎంతగా ముదిరి పోయింది? అన్నది క్యాన్సర్ ముదిరి పోవడాన్ని డాక్టర్స్ మూడు విధాలుగా తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియను టి ఎన్ ఎం పద్ధతి అంటారు. 

టి ---అంటే ట్యూమర్ గడ్డ (గడ్డ సైజ్ )
ఎన్ --- అంటే లింఫ్ గ్రంధులు సంఖ్య సైజు.
ఎం -- మేటాసిస్ అంటే క్యాన్సర్ కణాలు రక్త ప్రావాహం ద్వారా లేక లింఫ్ వ్యవాస్త ద్వారా మిగతా శరీరం లో ఎంత మేరకు వ్యాపించాయి అన్నది తెలుసుకోవడం కీలకంగా భావిస్తారు వైద్యులు
.

ఈ మూడిటినీ వివిధ పరీక్షల ద్వారా పరిసీలించాక క్యాన్సర్ ఏ దశలో ఉందొ అంచనాకి వస్తారు. క్యాన్సర్ ముదర డానికి సంబందించిన వివిధ దశలు వరసగా ఈ కింది విధంగా ఉంటాయి.

సాధారణదశ...క్యాన్సర్ ప్రారంభానికి ముందు దశ. 

మొదటిదశ ...స్టేజి1 -ఏదైనా ఒక అవయవం లో క్యాన్సర్ ప్రారంభం అయి ఉంటుంది.
రెండవదశ ...స్టేజి 2- క్యాన్సర్ గడ్డ పెద్దది గా ఉంటుంది. లింఫ్ గ్రంధులకు సోకవచ్చు,సోకక పోవచ్చు.
మూడవదశ...స్టేజి3-వరూధి చెందిన క్యాన్సర్ లింఫ్ గ్రంధులకు సోకుతుంది.
నాల్గవదశ ...స్టేజి4 -క్యాన్సర్ ప్రారంభ మైన అవయవం నుంచి క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించడం ఇది పూర్తిగా ముదిరి పోయిన దశ.

క్యాన్సర్ లో రకాలు..వాటిపేర్లు...

క్యాన్సర్ ఏ శరీరానికి వస్తే దానిని అశరీర భాగపు క్యాన్సర్ గా పిలుస్తారు ఉదా..ఎముకలకు వస్తే బోన్ క్యాన్సర్. ఊపిరి తిత్తులకు వస్తే లంగ్ క్యాన్సర్ వక్షోజాలకు వస్తే బ్రస్ట్ క్యాన్సర్, చర్మానికి వస్తే స్కిన్ క్యాన్సర్, అని అంటూ ఉంటారు. 

క్యాన్సర్ లో రకాలు...

కార్సినోమా...

చర్మం మీద,అంతర్గత అవయవాల లోపలి పొరలు లేక బయటి పొరల మీద, ఏర్పడే క్యాన్సర్,కార్సినోమా గా చెపుతారు.

సా ర్కోమా...

ముకలు,కొవ్వు ,కండరాలు, రక్తనాళాలు, లేదా ఆయా అవయవాలని పట్టి ఉండే కణజాలానికి వచ్చే క్యాన్సర్ ను సార్కోమా విభాగానికి చెందినదిగా వర్గీకరించారు.

ల్యుకేమియా...

రక్త కణాలను తయారు చేసే ఎముక మజ్జ లో ప్రారంభమైన అసంఖ్యాకం గా అసాదారణ రక్త కణాలని ఉత్పత్తి చేస్తూ రక్త ప్రావాహాం లోకి ప్రవేసించే క్యాన్సర్ ను ల్యుకేమియగా పిలుస్తారు.

లింఫోమా మైలోమా ...

లింఫోమా మైలోమా రోగ నిరోధక వ్యవస్త లో ప్రారంభమయ్యే క్యాన్సర్ కణాలను లింఫోమా మైలోమాగా పిలుస్తారు.

క్యాన్సర్ చికిత్స లు -పద్దతులు...

న్సర్ కు చికిత్స ఆ క్యాన్సర్ ఏ టైపు కు చెందినది క్యాన్సర్ ఎంతగా ముదిరింది క్యాన్సర్ ఏ స్టేజి లో ఉంది. అం శాల ప్రాతిపదికన చికిత్స ఉంటుంది. సాధారణంగా క్యాన్సర్ సోకిన భాగాన్ని సర్జరీ చేసి తొలగించడం ద్వారా చికిత్స చేస్తారు సర్జరీ తరువాత రోగి కొంత కాలం పాటు నొప్పిని భరించక తప్పదు. అయితే ఈ  నొప్పిని మందుల ద్వారా నియంత్రించ వచ్చు. అంతే కాక సర్జరీ తరువాత రోగి కొంతకాలం తీవ్రమైన నీరసం,అలసట కు గురి అవుతారు. 

రేడియేషన్ తెరఫి..కీమోతేరఫీ రేడియో తెరఫీ...

దీనిని రేడియో తెరఫి అని కూడా అంటారు. ఈ పద్దతిలో క్యాన్సర్ సోకిన భాగానికి హై ఎనేర్జీ రేస్ పంపించడం ద్వారా ఆ భాగంలో ఉన్న క్యాన్సర్ కణాలను నిర్మూలించడం జరుగుతుంది. ఇందులో రెండు రకాల పద్దతులు అమలు చేస్తారు. మెషిన్ ద్వారా బయటి నుంచి క్యాన్సర్ గడ్డ వద్దకు రేడియేషన్ ను ను పంపడం ఒక పద్ధతి. రెండో పద్దతిలో రేడియో యాక్టివ్ పదార్ధం కలిగి ఉన్న సూదులు, వైరులు గింజలు, లేదా ట్యూబ్ లు శరీరం లోపలి క్యాన్సర్ గడ్డ వద్దకు లేదా గడ్డ లోపలి కి పపడం ఉంటుంది. వివిదరాకాల పద్దతుల అమలు చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించడం జరుగుతుంది. రేడియేషన్ ట్రీట్మెంట్ మూలంగా నొప్పి ఉండదు. వాటి మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తాత్కాలికం మాత్రమే వాటిని కంట్రోల్ చేయవచ్చు.  ఈ ట్రీట్మెంట్ జరిగిన తరువాత వారాలలో రోగి తీవ్రమైన అలసటకు గురిఅవుతారు. అలాగే ఆ వ్యక్తిలో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవచ్చు. బయటి నుంచి ఇచ్చే రేడియేషన్ చికిత్స జరిగిన ప్రాంతంలో తాత్కాలికంగా వెంట్రుకలు రాలిపోవచ్చు అక్కడి చరర్మం కమిలి పొడిగా అయి దురద ఉంటుంది ఇది సాధారణం అని వైద్యులు పేర్కొన్నారు. 

కీమోతేరఫీ...

కీమోతేరఫీ పద్దతిలో మందుల ద్వారా శరీరం లోపలి క్యాన్సర్ కణాలను నసింపచేసే ప్రయత్నం ఉంటుంది.ఈ పద్ధతి మూలంగా క్యాన్సర్ సోకని సాధారణ ఆరోగ్యకర కణాలు కూడా నశించే అవకాశం ఉంది ముఖ్యంగా వేగంగా విభజన చెందే కణాలు నశిస్తాయి. ముఖ్యంగా వాడే మందులను బట్టి వాటి డోస్ ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఆధారపడి ఉంటాయి. అలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లో జుట్టు రాలడం. తాత్కాలికంగా అలసట ఆకలి తగ్గిపోవడం, తెమలడం వాంతులు, నీళ్ళ విరేచనాలు నోట్లోను పెదాల మీద పుళ్ళు ఏర్పడడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. తెమలడం, వాంతులు లాంటి వాటిని కొన్ని మందులు వాడడం ద్వారా నివారించవచ్చు. కీమోతేరఫి పూర్తి కాగానే సాధారణ కణాలు నశించడం ఆగిపోతుంది. 

హార్మోన్ తెరఫీ...

కొన్ని క్యాన్సర్ లలో కణాలు వృద్ది చెందడానికి రోగి శరీరంలోని హార్మోన్ లను ఉపయోగించుకోవడం. జరుగుతుంది. ఇలాంటి క్యాన్సర్ లకు హార్మోన్ తెరఫీ ని వాడతారు. ఈ తెరఫీ లో క్యాన్సర్ కణాలు వృధీ చెందడానికి అవి ఉపయోగించుకుంటున్న శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తిని మందుల ద్వారా ఆపుచేయటం. లేదా ఆ హార్మోన్లు పని చేసే విధానాన్ని మార్పు చేయటమో చేసి క్యాన్సర్ కణాల వృద్ధికి అడ్డుకట్ట వేస్తారు. లేకపోతే క్యాన్సర్ కణాలు ఉపయోగించుకుంటున్న హార్మోన్లు తయారు చేసే శరీర భాగాన్ని సర్జరీ ద్వారా తొలగిస్తారు. ఉదా..బ్రెస్ట్ క్యాన్సర్ కు ఉన్నప్పుడు రోగి శరీరంలోని అందాశాయాల్ని తొలగిస్తారు. హార్మోన్ తెరఫి మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు అలసట శరీరంలో నీరు నిలువకావడం బరువు పెరగడం. వంట్లో సెగలు పొగలు తెమలటం, వాంతులు, ఆకలి తగ్గడం కొన్ని కేసులలో రక్తం గడ్డలు కట్టడం మొదలైనవి కనబడతాయి. మెనోపాజ్ చేరుకుంటున్న స్త్రీలలో ఎముకలు పెళుసుగా అవుతాయి. ఇస్తున్న హార్మోన్ తెరఫి టైప్ ను బట్టి సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉంటాయా లేక శాస్వతంగా ఉండి పోవచ్చ అనేది ఆధారపడి ఉంటుంది. 

బాయోలాజికల్ తేరాఫీ...

బయో లాజికల్ తెరఫీ లో క్యాన్సర్ వ్యాధితో పోరాడటానికి గాని లేకపోతే క్యాన్సర్ చికిత్స మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తాకిడిని తగ్గించుకోడానికి డైరెక్ట్ గానో శరీరంలోని వ్యాదినిరోడక వ్యవస్థ ను ఉపయోగించుకుంటుంది.బయోలాజికల్ తెరఫీ లో మళ్ళీ వివిదరకాలు ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వాస్తాయి ఆయా తెరఫీ రకాలను బట్టి ఉంటుంది. ఈ తెరఫివల్ల ఫ్లూ జ్వరం లో వచ్చే లక్షణాల లాంటివి. సైడ్ ఎఫెక్ట్స్ గా ఉంటాయి. ఉదా.. శరీరం లోపలినుంచి చలి జ్వరం, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, తెమలడం, వాంతులు, నీళ్ళ విరేచనాలు, మొదలైనవి. రోగి చర్మం తేలికగా కమిలిపోయి. రక్త స్రావం కావాచ్చు. చర్మం వాయడం, దద్దుర్లు లాంటివి, ఉండవచ్చు. సమస్యలు తీవ్రంగానే ఉండే అవకాసం ఉంది గాని చికిత్స ని ఆపగానే పోతాయి.