ఇటీవలి కాలంలో చాలామందిలో స్చిజోఫ్రీనియా గురించి విటున్నాము నాగ్ నాధ్  గారు  ఆశలు ఇది ఏరకమైన అనారోగ్యం కిందకు వస్తుంది ? ఇది ఒకరకమైన మానసిక వైకల్యంగా చెప్పొచ్చు.. ప్రపంచ జనాభాలో ఎంతమంది  స్చిజోఫ్రీనియాతో బాధపడుతున్నారు ? ప్రపంచ జనాభాలో 11 % మంది  ప్రజలు వివిద రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.  అమెరికాలో 3.5 మిలియన్ ప్రజలు  స్చిజోఫ్రీనియాతో బాధపడుతున్నారని మానసిక వైద్యులు నాగ్ నాథ్ అన్నారు. స్చిజోఫ్రీనియా  సమాస్య ఉన్నవాళ్లు  ఎలా ప్రవర్తిస్తుంటారు? ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య కాదు  కొన్ని ఏళ్లుగా ఉండి  ఉండవచ్చు అన్నారు నాగ్ నాధ్. వీళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారని , ఆలోచనలు సవ్యంగా ఉండవని, అందరిలా కాకుండా సమాజానికి విరుద్ధంగా  ప్రవార్థిస్తూ ఉంటారు.  దీనిని  ఏరకమైన డిజార్డర్ గా పేర్కొంటారు ? దీనిని సైకోటిక్ డిజార్డర్ గా  చెప్తారు . ఇలాంటి సైకోటిక్ డిజార్డర్ తో బాధపడేవాళ్లను ఎలా గుర్తించాలి ? వీళ్ళు మామూలుగానే ఉంటారని అయితే సైవోటిక్ డిజార్డర్ తో ఉన్నవారు  ఆ సమయంలో వాస్తవాలను గుర్తించరని నాగ్ నాధ్ చెప్పుకొచ్చారు.

అసలు స్చిజోఫ్రీనియా ను గుర్తించవచ్చ? అసలు  ఏ ఏ వయస్సుల వారిని ఈ సమస్య . వేధిస్తుంది ? దీనిని గుర్తించడం సులభమే అని అన్నారు . 16  నుంచి 25  సంవత్సరాల  మధ్య వయస్సు ఉన్నవారు  దీని బారిన పడుతున్నారని అన్నారు. స్చిజోఫ్రీనియా  వారసత్వంగా వస్తుందా ? కుటుంబంలో ఎవరికైనా ఉండవచ్చు . అప్పుడే దీనిని గుర్తిస్తే  సమస్య నుంచి బయటపడచ్చు. అసలు స్చిజోఫ్రీనియా  ఎవరికీ ఎక్కువగా వస్తుంది అంటే స్త్రీలలోనా,  పురుషులలోనా ? స్త్రీలకంటే పురుషులలో 1 5 % అని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారని  అన్నారు మానసిక నిపుణులు  నాగ్ నాధ్ . చిన్నపిల్లల్లో స్చిజోఫ్రీనియా  వస్తుందా ? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అంచనా ప్రకారం  40,000   మంది పిల్లలో ఒకరికి మాత్రమే వస్తుందని, ఈసమస్య 13  సంవత్త్సరాల ముందు రావచ్చని, ఇంకా పూర్తి పరిశోధన అంశాలు రావాల్సి ఉందన్నారు  నాగ్ నాధ్  గారు.  అసలు స్చిజఫ్రీనియా ఎన్నిరకాలు ఉండచ్చు ? ఇందులో ఐదు రకాల  స్చిజోఫ్రీనియా ఉందని అంతార్జాతీయ  మానసిక విభాగం చేసిన అధ్యయనంలో పేర్కొన్నారు . వీటిలక్షణాలను బట్టి వేరు వేరు గా విభజిం చారని నాగ్ నాధ్   పేర్కొన్నారు .

అవి వివరిస్తారా ? 1) పరో నోయిడ్  స్చిజోఫ్రీనియా  2) డిసోర్గనైజ్డ్ స్చిజోఫ్రీనియా  3) కాటాటోనిక్ స్చిజోఫ్రీనియా  4) అండిఫరియేట్డ్  స్చిజోఫ్రీనియా  5) రెసిడ్యూయల్  స్చిజోఫ్రీనియా గా వైద్యులు  నిర్ధారించారని  ఆయన అన్నారు . ఇందులో మొదటి దశకగా  చెప్పబడే  పారనోయిడ్  స్చిజోఫ్రీనియా  గురించి దాని లక్షణాలు చెపుతారా ? వీళ్ళు చాలా సహజంగా ఉంటారు .వీళ్ళ ప్రవార్తన ఎప్పుడు భ్రమలో ఉంటారు, హలొ సినేషన్స్  ఉంటాయి . ఇలానే వాళ్ళు ఏ ఏ రంగాల వాళ్ళు ఉంటారు ? సామాన్యులు , నుంచి ప్రముఖులు , ముఖ్యంగా రాజకీయ నాయకులు  ఉంటారు,  నటీనటులు కూడా ఉండచ్చు, వీళ్లు అపర మేధావులు, పలుకుబడి కలిగి ఉంటారు, ఉపాధ్యాయులు కూడా ఈకోవకే చెందుతారు. అటు సామజిక అవగాహన ఇటు విషయం పరిజ్ఞ్యానంలోను  తమను మించినవారు లేరని తాము సమాజంలో అత్యత ప్రభావవంతంగా  పని చేస్తారని  ఇటీవలి  పరిణామాలు నిరూపిస్తున్నాయని అందుకు ఉదాహరణగా మదన పల్లి ఘటన ఈ కోవలోకి చెందిందని అన్నారు . డిసోర్గనైజ్డ్  స్చిజోఫ్రీనియా లో వాళ్ళ ప్రవర్తన మాటలు ఒకదానికొకటి సంబంధం ఉండదని , అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదని అర్ధం చేసుకోడం కష్టమే అని అన్నారు. అయితే అన్ని తమకు తెలుసుఅని  భావోద్వేగాలను నియంత్రించుకోలేరని సందర్బోచితంగా  వ్యవహరించరని.. రోజువారీ కార్యక్రమాలలో  చాలా పోషక విలువలు ఉన్న ఆహరం తీసుకుంటారని భిన్నమైన ఆలోచనలతో  తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని నాగ్ నాధ్  వివరించారు. కేటా టానిక్  స్చిజాఫ్నేరియా లో చెప్పిందే చెప్పడం వీళ్ళ లక్షణమని అన్నారు. అన్ని చోట్లకు వెళ్తుంటారు,  నేను అన్నిటికీ చాలా అతీతుడిని , అనుకుంటూ ఉంటారు.. నేను పూజిస్తే చాలు అందరు  నాశనం అయిపోతారు, నాకు అతీతమైన శక్తులు  ఉన్నాయని భ్రమలో ఉంటారు . వారి పై   వారికీ శ్రద్ధ ఉండదు . రోజు వారీ కార్యక్రమాలు  పూర్తి చేయరు . అవసరం లేని పనులమీద తిరుగుతూ ఉంటారు .

అన్డి ఫరెంటియేటెడ్ స్చిజోఫ్రీనియాలో మూడు రకాల లక్షణాలు  ఉంటాయి . భ్రమ , భ్రాంతిలో జీవిస్తూ ఉంటారు. అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడడం వీళ్ళ  క్వాలిఫికేషన్ , ఆలోచనలు అస్తవ్యస్తం , స్థిరమైన జీవితం ఉండదు, తమని అందరు మోసం చేస్తన్నారని , అందరు తప్పు చేస్తూ,  నన్ను మాత్రమే తప్పు చేస్తున్నావని నిందిస్తారని అనుకుంటారు . కొన్ని సందర్భాల్లో వీరికి  మొండి తనం ఎక్కువే అని ,నేను ఎవరు చెప్పినా వినను నాకు అన్నీ తెలుసు అనుకుంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ వితండ వాదానికి దిగుతారు , ఇంక పరాకాష్టగా ఆత్మాహత్యకు సైతం వెనకడుగువేయరు ,లేదా వాడిని చంపేస్తాను ,నరికేస్తాను అన్న ఉద్రేకంతో ఊగిపోతూ ఉంటారని నాగ్ నాధ్  విశ్లేషించారు . ఇకచివరిది 5 వది  రెసిడ్యుల్ వీరు గతం గురించి జరిగిన సంఘటనలను పదేపదే గుర్తు చేసుకోవడం అదే పనిగా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేస్తారని తనను ఇంట్లో అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన కలిగినప్పుడు ఈ రకంగా ప్రవర్తిస్తారు అని అందులో భాగంగానే అన్నం తినకుండా ఉండడం, అలగడం, అరవడం చేస్తుంటారని నాగ్  నాధ్  అన్నారు. పైన పేర్కొన్న కొన్ని అంశాలను చూసినప్పుడు మదన పల్లి ఘటన అందరూ ఈ రకమైన మానసిక సమస్యతోనే బాధపడుతున్నారని తేల్చి చెప్పారు.