వేసవి కాలంలో అందరూ ఎం ఇష్టంగా తినే ఖర్భుజాను స్వీట్ మెలోన్ లేదా రాక్ మెలోన్ అని అంటారు. హిందీ, మరాఠీ, తెలుగులో దీనిని 'ఖర్బూజా' అని పిలుస్తారు, తమిళంలో దీనిని 'ములం పజం' అని పిలుస్తారు. బెంగాలీలు దీనిని 'ఖర్ముజ్' అని పిలుస్తారు, గుజరాతీలు దీనిని షకర్టెట్టి అని పిలుస్తారు. ప్రాంతాలు, పేర్లు ఎన్ని మారినా ఈ ఖర్భూజా మాత్రం మ్యాజిక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో దొరికే అన్ని పండ్లలోకి ఇది చాలా అద్బుతమైనది అని అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఈ ఖర్భూజా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..
ఖర్భూజాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మన రోగనిరోధక కణాలైన తెల్ల రక్త కణాలను (WBC) బిల్డ్ చేస్తుంది. తద్వారా మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది . ఇవి సాధారణంగా మూసుకుపోయిన రంధ్రాల్లో పెరిగిమొటిమలుగా కనిపించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కూడా సహాయపడుతుంది.
మెరిసే చర్మం కోసం, ఖర్భూజా, పుదీనా కాంబినేషన్ గా జ్యూస్ ప్రయత్నించవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది చక్కెర లేకుండా ఈ జ్యుస్ తీసుకుంటే కేలరీలు బెడద ఉండదు.
బరువు తగ్గించే ఆహారం తీసుకునే వారు ఎప్పుడూ రుచినిచ్చే పదార్థాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఖర్భూజా బెస్ట్ ఆప్షన్. ఇది నోటికి, కడుపుకు కూడా తృప్తిని ఇస్తుంది. దీనివల్ల బరువు పెరగరు. కేవలం ఇదొక్కటే కాకుండా దీనితో పాటు ఇతర పండ్లను భాగం చేసుకుని ఫ్రూట్ సలాడ్ తీసుకోవచ్చు.
ఖర్భూజాలో ఉండే విటమిన్ సి క్యాన్సర్‌ను నిరోధించడంలో, క్యాన్సర్ తో పోరాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. తరచుగా నోటి పుండ్లు మరియు నమలడంలో ఇబ్బంది ఉన్నవారు క్యాన్సర్ రోగులు ఖచ్చితంగా ఖర్భుజా తీసుకోవాలి.
ఖర్భూజా పండులో కొవ్వులు ఉండవు. ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మంటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణంగా ధమనులను ఆరోగ్యంగా ఉంచి గుండెను కాపాడుతుంది. శరీరానికి సరిపడామెగ్నీషియం ఉందులో లభిస్తుంది. ఇది హృదయ స్పందనను సక్రమంగా ఉంచుతుంది.
ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నిర్వహించడానికి పని చేస్తుంది.
ఎక్కువ శాతం నీటితో నిండిన పండ్లలో ఖర్భూజా ఒకటి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. జీర్ణశయానికి చాలా మంచిది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, నిర్విషీకరణకు సహాయపడుతుంది. చాలామందిలో తరచుగా వచ్చే ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) తగ్గించండంలో సహాయపడుతుంది.
అసిడిటీ సమస్య ఉన్నవారికి ఖర్భూజా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఖర్భూజా కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఖర్భూజా తీసుకుంటే చాలా సేపటి వరకు ఆకలిని నియంత్రించుకోవచ్చు.
◆నిశ్శబ్ద.