క్యాన్సర్ పేరు వినగానే భయపడాల్సిన అవసరం లేదు. అయితే శరీరంలో చాలాకాలంగా కొనసాగుతున్న కొన్ని అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా, వాటికి కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సాధారణ సమస్యలుగా భావించే కొన్ని లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.

నోటిలో తగ్గకుండా ఉండే పుండ్లు, రొమ్ములో కనిపించే మార్పులు, జీర్ణవ్యవస్థలో సమస్యలు, కారణం లేకుండా బరువు తగ్గడం, శరీరంలో అసాధారణ మార్పులు వంటి వాటిని ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఏ వయసులో ఎలాంటి జాగ్రత్తలు అవసరం?

అంతేకాదు, క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు ఏమిటి? రోబోటిక్ సర్జరీ, ఆంకో-రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, మైక్రోసర్జరీ, బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ వంటి విధానాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.

సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు, శరీరం ఇచ్చే అసాధారణ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది.

గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అసాధారణ లక్షణం కొనసాగితే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి.మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)