బిల్వపత్రి లేదా మారేడు ఆకులు దేవుడి పూజకు విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పరమేశ్వరుడి పూజకు మారేడు దళాలు ఎంతో ముఖ్యం.  ఎటువంటి ఆడంబరాలు లేకపోయినా బిల్వదళం అర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని అంటారు. అయితే బిల్వదళం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిది.  వేసవికాలంలో ప్రతిరోజూ ఉదయమే బిల్వదళం ఖాళీ కడుపుతో తింటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలుంటాయని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అసలు బిల్వదళంలో ఉండే పోషకాలేంటి? దీన్ని వేసవిలో రోజూ ఉదయమే తీసుకుంటే కలిగే లాభాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

పోషకాలు..

బిల్వదళాలలో కాల్షియం,  ఫైబర్ వంటి పోషకాలు,  విటమిన్లు A, C, B1,  B6 పుష్కలంగా ఉంటాయి.


ప్రయోజనాలు..

బిల్వపత్రం వేసవిలో ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే  ఉదర సంబంధ సమస్యలు ఏమున్నా అన్నీ సెట్ అవుతాయి.  గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.  మరీ ముఖ్యంగా  ఖాళీ కడుపుతో తీసుకుంటే ఫైల్స్ సమస్య ఉన్నవారికి చాలామంచిది.

మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బిల్వదళాలను తీసుకుంటే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు  గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి. అలాగే అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

బిల్వపత్రి ఆకుల స్వభావం చల్లగా ఉంటుంది. వీటిని తీసుకుంటే శరీరం రోజంతా చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో వీటిని తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.


ఖాళీ కడుపుతో  బిల్వ పత్రి ఆకులు తీసుకుంటే నోటిలో  పుండ్లు సమస్య తగ్గుతుంది.  

డయాబెటిక్ పేషెంట్లు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో  బిల్వ పత్రి ఆకులను తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్,  ఇతర పోషకాలు మధుమేహ రోగులకు చాలా మంచివి.  అలాగే ఖాళీ కడుపుతో బిల్వ పత్రి  తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

                                         *నిశ్శబ్ద.