అసలే ఎండాకాలం ఆపైన ఉడక పోత ఇంకేముంది మీ శరీరంలో ఏమాత్రం నీరు,ఉప్పుశాతం తగ్గిన వెంటనే వ్యక్తి లో నీరసం,అలసట వస్తుంది.ఎండ తాపానికి ఎంతటి ఆరోగ్య వంతుడైనాసరే అతని ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల అనారోగ్యానికి సంబంధించి న సమస్యలు వస్తాయి.అందుకే ఎండాకాలం లో ఎక్కువశాతం ఎంతవీలైతే అంత ఎక్కువ నీరు తాగడం మంచిది.వాతావరణం లో ఒక్క సారిగా అదిక చలినుండి , వాతావరణం లో అధిక ఎండ తీవ్రత వేడిమి పెరిగి పోతుంది.ఈ కారణం గానే కొంతమేర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి దీనికి కారణం వేడిమి,వేడి గాలుల వల్ల ఎవరి ఆరోగ్యమైన అనారోగ్యానికి గురి కావాల్సిందే. ఎండాకాలం లో మనల్ని వేదించే కటిన మైన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి.మీరు ఎండ బారిన పడ్డప్పుడు మీరు ఎండను తట్టుకోవడం కష్టం. అది మీఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాలాలో మరణించడం కూడా సంభవించ వచ్చు.
ఎండ వేడిమి ఎవరికీ ప్రమాదం ?...
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు.
* ఊబకాయం ఉన్న వాళ్ళు
* హై బిపి సమస్య ఉన్న వాళ్ళు.
* వృద్ధులు,సామాన్యులు యుక్త వయస్కులు,యువతీ యువకులు.
* ముఖ్యంగా ఎండలో పని చేసే కార్మికులు.
ఎండ వల్ల వచ్చే సాధారణ సమస్యలు...
వేడి వల్ల శరీరంలో చమట పొక్కులు వస్తూ ఉంటాయి. ఇవి చర్మం పై దీర్ఘకాలం పాటు ఎండలో ఉండడం వల్ల చమట పొక్కులు మంట కారణం అవుతుంది. వేడిమి వల్ల చమట పట్టడం వల్ల శరీరంలో మార్పులు రావడం సహజం.శరీరం పై ఎర్రటి పొక్కులు ,మంట దురద వంటి సాధారణ సమస్యలు ఉంటాయి.
ఎండాకాలం వడదెబ్బ...
శరీరం లో చల్ల బడే తత్వం తక్కువగా ఉండడం వల్ల. కొన్ని నిమిషాల లోనే శరీరపు ఉష్ణోగ్రతలు పెరిగి పోతాయి.అది ఒక్కోసారి తీవ్ర అస్వస్తత కు గురి అవుతారు. శరీరంలో బిపి,షుగర్ లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల. ఒక్కోసారి కోమా లేదా భ్రమ, గుండె సమస్యలు డీ హై డ్రెషన్ వచ్చి మరణించే అవకాశం ఉంది.
ఎండవేడిమి వల్ల అలసట...
ఈ పరిస్థితిలో అధికంగా చమట పట్టడం వల్ల శరీరం లో ఉప్పు నీటి శాతం తాగ్గిపోతుంది. ఈ కారణంగా త్వరగా అలిసి పోతారు. అలిసి పోయి నప్పుడు కళ్ళు తిరగడం,దాహం శరీరంలో వేడి పెరగడం తల నొప్పి వంటివి ఉంటాయి.
ఎండ వేడిమి కి కండరాలు పట్టుకు పోతాయి ...
ఎండ వేడిమి కారణం గా శరీరంలో ఉప్పు నీటి శాత్హం తగ్గిపోతుంది.దీనికారణంగా భరించలేని ఒళ్ళు నొప్పులు క్రామ్ప్స్ అని అంటారు. ఒక్కసారిగా పిక్క పాటయి వేయడం తీవ్రమైన నొప్పి తో గిల గిల లాదిపోతారు.ముఖ్యంగా పొట్ట,చెయ్యి, వీపు వెనుక ప్రాంతం లో తీవ్రమైన నొప్పి తో బాధ పడతారు.ఒక్కోసారి ఎడమ చేయి లేదా కుడి చేయి భుజాలు, మెడనరాలు సైతం తీవ్ర మైన నొప్పి ఉంటుంది.
ఎండవేడిమికి కళ్ళు తిరగడం...
దీర్ఘ కాలం పాటు ఎండలో ఉండడం వల్ల చాలా సార్లు వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోతాడు. దీనికి కారణం శరీరం లో నీటి శాతం తగ్గడం.వల్ల కూడా కావచ్చు.ఎండ వేడిమి వల్ల కళ్ళు తిరగడానికి కారణం ,తలనొప్పి, లేదా తల తిరగదానికి కారణం లో బిపి,లేదా లో షుగర్ కూడా కావచ్చు అన్న విషయం గమనించాలి.