Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 4


    అందుకే సురయా సలీమ్ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసింది. అక్కడికి మరికొందరు స్నేహితురాళ్ళను పిలిచింది. వారిలో మసూద్ ఒకతి. ఆమె సురయాకు ప్రాణస్నేహితురాలు మసూద్ కు తనపేరు స్త్రీ వాచకంగా ఉండడం ఇష్టం ఉండేదికాదు. అందువల్లనే ఆమె తన ముఖంలోను, శరీరంలోను ఆడదనం అగుపించకుండా జాగ్రత్త పడుతుంది. ఆరోజుల్లో కాలేజీలోని ఆడపిల్లలు తమ పేర్లలోని స్త్రీ వాచకం తుంచి పారేయడం ఫ్యాషన్ గా భావించేవారు.
    మసూద్ స్థితి సురయాలాంటిదే. ఒక ప్రొఫెసరువారు తన విరహమున దివికే తెంచనున్నారని ప్రకటించింది. ఆ ప్రొఫెసరు భార్య, పాపం కొద్దినెలల క్రితమే చనిపోయింది. వారు క్లాసులోకి వచ్చి తల్లిపోయిన పిల్లల పోషణకు సంబంధించిన చిట్కాలు అడిగేవారు. మసూద్ మాటిమాటికి లేచి ఏవేవో ఉపాయాలు చెప్పేది. ప్రొఫెసర్ అక్కడక్కడా మిగిలిన నల్లవెంట్రుకలను సరిచేసుకొని, జారిపోతున్న ప్యాంటు పైకి లాక్కుంటూ కృతజ్ఞతలు అప్పగించేవారు.
    'మసూద్ బీబీ చాలా తెలివైంది. ఈ కళ మీరూ నేర్చుకోవాలి. ఎందుకంటారా? వీటన్నింటి ప్రతిగా మీకు రానున్న వరుడు ఒకే ఒక ప్రతిఫలం అప్పగిస్తాడు - సంతానం.'
    అది విని సిగ్గూ కోపం కలిసిన భావం గల నవ్వులు ప్రతిధ్వనిస్తాయి. ప్రొఫెసర్ గారు కూడా తన పాచిపండ్లు బయటపెట్టి హె హె హే అని నవ్వుతారు.
    'జారీగారు నీకు ప్రతిఫలం ప్రసాదించాలనుకుంటున్నారు.' సలీమ్ మసూద్ ను ఉడికించేది.
    మసూద్ ముఖం జేవురించేది, ఆమెలో సిగ్గుల నిగ్గులు కనిపించేవి.
    మరొకతి రానా, ఆమెకు సురయాలాగే కీర్తిజ్వరం తగులుకుంది. ఆమె చాయ సురయాలా అమావాస్య రాత్రి కాకున్నా సంధ్యా సమయపు మసక చీకటి లాంటిది. కొత్త కొత్త మేకప్ పద్ధతులు అవలంభించి ఉడిగిన సంజలాంటి చాయకు తెచ్చుకుంది. సురయాకు, ఈమెకు ఒక తేడా ఉంది. సురయా మంది వెంట తిరిగి వ్యాసాలు రాయించుకుంటుంది. రానా చుట్టూ అబ్బాయిలు ముసిరి, తాము రాసిన వ్యాసాలు ఆమెపేర ప్రకటించుకోవలసిందని ప్రార్థిస్తారు. 'నేను సూర్యుణ్ణి, యూనివర్శిటీలోని ప్రతి పిల్లాడూ పొద్దుతిరుగుడు పూవు' అంటుంది రానా.
    తరచుగా ఆమె, సురయా యూనివర్శిటీకి వెళ్ళేవారు - ఊరికే - విహారార్థం. రానా ఏదో ఒక గేలరీ దగ్గర సురయాను నిలిపేసేది. - ఎందుకో తెలుసా? తనతోపాటు కాలం నిలిచిపోయిందని చూపడానికి. అప్పుడు ఏం జరిగిందంటే క్లాసులు వదలి వస్తున్న పిల్లలు ఏదో ఒక నెపంతో అక్కడే తిరుగుతుండేవారు. అలాంటి సమయంలో ఈమె ఎలా ప్రవర్తిస్తుందనుకున్నారు? చుట్టూ ఎక్కడా నరవాసన లేనట్లు సురయా మెడలో చేతులేసి రేలింగ్ మీదినుంచి తొంగిచూస్తుంది-కిలకిలా నవ్వుతుంది.
    మొన్ననే మూన్ లైట్ ఎంజాయ్ చేయడానికి హోష్ రుబా వెళ్ళానే. వాళ్ళేడూ హమీద్ మళ్ళీ కారు తెచ్చాడే! నువ్వెందుకు రాలేదే! ఎంత బావుందనుకున్నావే - ఓహ్! అబ్బా నాకు భయమేస్తుందబ్బా! అన్నానే! ఇంటికి వెళ్ళిపోతానన్నానే! నాన్నకు తెలిస్తేనా చెప్పందుకుంటాడన్నానే! చూశావా మా అక్క ఇవాళ బలవంతంగా గోరింటాకు పెట్టింది. నేను వద్దన్నా విన్నది కాదే-యూనివర్శిటీ పిల్లలు ముదనష్టపాళ్లు వెక్కిరిస్తారో ఏమోనబ్బా! సిగ్గు వేస్తుంది.
    వీళ్లు కాక జమాల్ మరో పిల్ల పులిని వేటాడాలంటే తుపాకి ఒక్కటే చాలదు. దడుచుకుని అరచే మేకపిల్ల కావాలి. అదికాక యూనివర్శిటీ పిల్లలు అంతా కదిలే మరల్లాంటి వాళ్ళు. వాళ్ళతో నెగ్గడం అజీమ్ అక్కకు మాత్రమే వచ్చు. కాని సలీమ్, సురయాలకు వాళ్ళ ఆయువు పట్టు తెలుసు.
    జమాల్ ఫస్టియర్ లో చదివేది. తోటి అమ్మాయిలను చిన్నమ్మల్లా ఆదరించేది. అయినా సురయా మూడు నాలుగుసార్లు కలుసుకున్న తరువాత భుజం మీద చేయివేసి కాలేజీ తోటలోకి తీసికెళ్ళింది. ఆమె రూపాన్ని పొగడిన తీరు చూచి క్లాసు పిల్లలంతా అచ్చెరువొందారు. వాళ్ళు మెట్లెక్కుతూ దిగుతూ చూసే సురయా జమాల్ జడ అందుకొని వీపుమీద డప్పు వాయిస్తుండేది. సురయా తన టిఫిన్ డబ్బాలో గాజర్ హల్వా తెచ్చేది. జమాల్ భవిష్యత్తును గురించి లెక్చరర్లకు సైతం నిరాశ కలిగింది. అయినా సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆమెనే పిలవాల్సి వచ్చేది.
    అయితే ఈ పిల్లలు కాక పార్టీకి యూనివర్శిటీలో పేరున్న మగపిల్లల్ని కూడా ఆహ్వానించారు. నగరంలోని నవ కవులు, రచయితలూ కూడారు. వాళ్లు సురయా నుంచి జమాల్ దాకా అందరినీ స్తుతిస్తున్నారు.
    బాబూ! రజాఆలమ్ రాలేదా! రజాఆలమ్...షాహిద్ వస్తూనే వాగుడు సాగించాడు. అతడు నేరుగా బార్ నుంచి వస్తున్నాడని కాదు, అమ్మాయిలను చూస్తే అతని గుండె గంతేస్తుంది - నోరు అదుపు తప్పుతుంది.    
    'హయ్యో! మరిచిపోయాను' సూర్యా పశ్చాత్తాపం నటించింది. అది షాహిద్ జ్ఞాపకం చేస్తున్నందుకు, కాకుంటే ఆ కథలు రాసేవాడి ముఖం అంటేనే ఆవిడకు గిట్టదు. రజాఆలమ్ బట్టతలా, ఎండిన ముఖం చూచి వాళ్ళంతా 'ఎండురొయ్య' అనేవారు.
    "చిత్రమే మీరు రజా ఆలమ్ ను మరవడం. సరేగాని ఈ విషయం అతనిముందు ఎత్తకండి."
    "అవును మరిచాను ఏం అతడేమన్నా నా ఫ్రెండా? ఆ ఎండురొయ్యను చూస్తేనే నాకు భయం."
    "అతడు పొరపాటున మిమ్మల్ని రసగుల్లా అనుకున్నాడేమో!" వికార్ అంటే అందరూ నవ్వవలసివచ్చింది.
    "దాన్ని గురించి రజాఆలమ్ గుండెను అడగండి."
    "పోనీండి ఇప్పుడెందుకది." సురయా గుండెమీదికి ఒక కొండ దొర్లి వచ్చింది - అలా వచ్చిన కొండ సముద్రపు అడుగునకు కొట్టుకుపోయింది.
    ఫ్రూట్ సాలడ్ చేస్తూ చేస్తూ ఆమె చేతులు పోయాయి. అందరి మధ్యన కూర్చుని గంటగా పళ్ళపొట్టు వలుస్తూంది. సమయం వస్తే చక్కని వంట చేయగలనని నిరూపించడానికి ఆ పని. అంతకు గంట ముందే సేరు పాయసానికి చక్కెరెంతని సలీమ్ ను అడిగింది. అప్పుడు ఆమె జమాల్ కథ వినిపించింది. అదేమంటే - ఓసారి జమాల్ పులగం వండాల్సివస్తే అందులో మిరపకాయలు వేసింది!
    "మీరు నన్ను హేళన చేస్తున్నారు. అసలు విషయం ఏమిటి చెప్పరాదూ." షాహిద్ చట్టిముక్కు ఉబికించి అడిగింది.
    "చెప్పేదేమిటి మీ ఆడపిల్లల జాతి చాలా కఠినమైంది. అబ్బాయిలం ఇక్కడున్నాం - మమ్ము గురించి ఆలోచించండీ."
    "రజాఆలమ్ మాట మాట్లాడండి," జమాల్ ఎంతో ఆసక్తిగా షాహిద్ ను చూచింది. సురయా ఆమెకు తన చీర కట్టించింది. సాధారణ మేకప్ చేసింది, ఆమె సింగారింపు చూచి తన గుండె చప్పుళ్ళను జమాల్ అర్థం చేసుకుందనీ గ్రహించాడు.
    "అదికాదు ముందు మా మాట వినండి" అన్నాడు జమాల్ ను ఉద్దేశించి.
    "అవును ఇవాళ షాహిద్ కు మంచి ఛాన్సు దొరికింది" అని సురయా అందరినీ నవ్వించింది.
    "అయినా పిచ్చి రజాఆలమ్ - పాపం" వికార్ మళ్ళీ జ్ఞాపకం చేశాడు.
    'నాముందు వాడి మాట తేవద్దు - వాడు గాడిద.'
    'అది వాడి కర్మ' షాహిద్ అందరితో కలిసి నవ్వక సిగరెట్టూ వెలిగించాడు. తనకు రజాఆలమ్ ఎందుకు జ్ఞాపకం వచ్చినట్టు? అనవసరంగా సురయాను ఎందుకు ఏడిపిస్తున్నట్లు అనే ఆలోచనలో పడిపోయాడు. మంచిదే కానీ పాపం ఇంత కష్టపడ్డందుకు బహుమానం లభించాలిగా!
    బట్టతల అలంకారాన్ని గురించి జమాల్ జోక్ బాగా పేలింది. ఎంత ప్రయత్నించినా సురయా నవ్వలేకపోయింది. అందుకు కారణాలు జమాల్ ఆమెను తేపతేప అక్కా అని పిలుస్తుంది. రెండు రజాఆలమ్ 'కితాబు'ను గురించి మాటిమాటికి రెట్టించడం ఎందుకు? అతనిదేమన్నా నిజంగా బట్టతలా? అదృష్టవంతుల్లా ముఖం కాస్త విశాలం అంతే.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS