శ్రమకు తగిన ఫలితం దక్కాల్సిందే

 

 

స్వల్ప స్నాయు వసావసేక మలినం నిర్మాంసమప్యస్థి గోః

శ్వా లబ్వ్ధా పరితోషమేతి న తు తత్తస్య క్షుధా శాంతయే ।

సింహో జంబుకమంకమాగతమపి త్యక్వ్తా నిహంతి ద్విపం

సర్వః కృచ్ఛ్రగతో-పి వాంఞ్చతి జనః సత్వ్తానురూపం ఫలమ్‌॥

కుక్క తన స్థాయికి తగినట్లుగానే... చిన్నపాటి ఎముక దొరికినా కూడా, అందులో మిగిలిన మాంసాన్ని నాకుతూ తృప్తిపడుతుంది. అయినా పాపం దాని ఆకలి తీరదయ్యే! కానీ సింహం అలా కాదు. తన ఎదురుగుండా నక్కలు, కుక్కలు తిరుగుతున్నా కూడా వాటిని వదలి ఏనుగు కోసం వేటాడుతుంది. మనుషులూ అంతే! ఎంతటి కష్టసమయంలో అయినా తమ శక్తికి తగిన ఫలితాన్ని ఆశిస్తారే కానీ, తక్కువ ఫలితంతో తృప్తి చెందరు.


More Good Word Of The Day