అప్పుడే పరాక్రమం బయటపడేది

 

సంత్యన్యే-పి బృహస్పతి ప్రభృతయః సంభావితాః పంచషాః

తాన్ప్రత్యేష విశేష విక్రమ రుచీ రాహుర్న వైరాయతే ।

ద్వావేవ గ్రసతే దివాకర నిశా ప్రాణేశ్వరౌ భాస్కరౌ

భ్రాతః పర్వణి పశ్య దానవపతిః శీర్షావశేషాకృతిః ॥

ఒక వ్యక్తి ఎంత పరాక్రమవంతుడైనా కావచ్చుగాక! కానీ తనకి సమానమైనవారిని లేదా తనకు మించినవారిని ఎదుర్కొన్నప్పుడే... అతనిలోని పరాక్రమం శోభిస్తుంది. బృహస్పతి ప్రభృతులు ఎందరున్నా, వారి జోలికి పోని రాహువు సూర్యచంద్రులని పట్టి ఉంచినప్పుడే కదా అతని శౌర్యం తెలిసివచ్చేది!


More Good Word Of The Day