గుడిలో గంట ఎందుకు మోగిస్తారు..

భగవంతుని వైపు మనసును కేంద్రీకరించడంలో గుడికి వెళ్లడం చాలా ప్రధానమైన విషయం. ఇంట్లో అయినా, గుడిలో అయినా దైవ దర్శన, ఆరాధన చాలా మంచి ప్రశాంతతను ఇస్తుంది. గుడికి వెళ్తే చాలామంది చేసే పని గంట కొట్టడం. గంట కొట్టి దేవుడికి దండం పెట్టుకోవడం అనేది చాలా అలవాటైన చర్య. అసలు గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, దైవిక కారణాలు ఏమిటి? గంట కొట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..
దైవిక కారణం..
గుడిలో గంట కొట్టడం అనేది దైవిక పరంగా చాలా మంచి చర్య. దేవుడికి ఎదురుగా నిలబడి గంట కొట్టడం అంటే దేవుడిని పిలవడం అని అర్థం అంట. "స్వామి ఇదిగో నేను వచ్చాను, నీ ఆశీర్వాదం కావాలి, నిన్ను దర్శించుకోవడానికి వచ్చాను?" అని ఇట్లా మనసులో ఉన్నది ఆయనకు చెప్పుకుంటే.. ఆ భగవంతుడు వచ్చి భక్తుల ప్రార్థనలు స్వీకరించి ఆశీర్వాదం ఇస్తాడట.
శాస్త్రీయ కారణాలు..
గంట కొట్టడం ద్వారా వచ్చే శబ్దం చాలా శక్తివంతమైనది. ఇది ప్రతికూల శక్తిని తొలగించి వాతావరణాన్ని చాలా స్వచ్చంగా మారుస్తుంది. గంట శబ్దం కంపనాలు గుడి పరిసర ప్రాంతాలలో పాజిటివ్ శక్తిని ప్రసరింపచేస్తుంది. అంతేకాదు.. గంట కొట్టినప్పుడు ఆ శబ్దం మనిషిలో నాడులను ఉత్తేజపరుస్తాయి.
ఆధ్యాత్మిక కోణం..
ఆలయంలో గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం మనస్సును ఏకాగ్రతగా ఉంచుతుంది. భగవంతుడి మీద భక్తి పెంచుతుంది. గంట శబ్దం లోని ధ్వని తరంగాలు మన మెదడులోని రెండు భాగాలను సక్రియం చేయడంలో సహాయపడతాయి.
ఆలయంలో గంట మోగించడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. అది ఆధ్యాత్మిక, మానసిక కారణం కూడా.
*రూపశ్రీ.



