వారం అంటే ఏమిటి? ఎలా పుట్టింది?

Week means?

 

ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని - అంటూ ఏడు వారాలున్నాయి కదా! ఇంతకీ అసలు వారం ఎలా పుట్టిందో.. దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో తెలుసుకుందాం.

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. అక్షరేఖమీద (axis) 360 డిగ్రీల్లో ప్రయాణిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరిగేసరికి 24 గంటల కాలం పడుతుంది. అంటే ఒక సూర్యోదయం నుండి మరో సూర్యోదయం వరకూ 24 గంటల కాలం ఒకరోజు అన్నమాట. అలా ఏడురోజులు గడిచేసరికి భూమి ఒక డిగ్రీ ముందుకు జరుగుతుందన్నమాట. అదే వారం అయింది.

భూమి తన అక్షరేఖ మీద (Axis) తన పథంలో ప్రయాణిస్తూ 24 గంటలు పూర్తయ్యేసరికి ఒకరోజు అవుతుంది.అప్పటికి ఒక డిగ్రీ మాత్రమే ముందుకు వెళ్తుంది. ఏడాది పూర్తయ్యేసరికి 360 డిగ్రీలు తిరుగుతుంది. ఈవిధంగా భూమి ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుని ప్రభావం ఒక్కో రోజు ఒక్కోలా భూమ్మీద పడుతుంది. అలా ఏడురోజులు అంటే వారం పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటికొస్తుంది. ఏడు రోజులకు ఒక ఆవృత్తి అవుతుంది అన్నమాట. ఆది, సోమ, మంగళ – ఇలా వారాలను నిర్దేశించారు కదా.. అదంతా వారంలోని ఆయా రోజులపై సూర్యుని ప్రభావాన్ని అనుసరించే వారాలకు ఆయా గ్రహాల పేర్లు స్థిరపడ్డాయి. ఆయా వారాలపై బట్టి సూర్యుడు, ఇతర గ్రహాల బలం ఆధారపడి ఉంటుంది. ఒక రోజులో అంటే 24 గంటల సమయంలో కొన్ని సందర్భాల్లో మూడు తిథులు, నక్షత్రాలు, యోగము, కరణములు రావచ్చు. అయినా వారం మాత్రం సూర్యోదయం నుండి మళ్ళీ సూర్యోదయం అయ్యేవరకు ఒక్కటే.

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆయా గ్రహాల ప్రభావం పడుతుంది. అందుకే ఏడు వారాలకు ఒక్కో గ్రహ నామం ఇచ్చారు. ఇలా వారానికి గ్రహాల పేర్లు ఎందుకు వున్నాయి, వారానికి గ్రహానికి సంబంధం ఏమిటి అనే సందేహం కలగడం సహజం. ఆదివారాన్ని రవివారం అని కూడా అంటారు. రవి అంటే సూర్యుడు. ఆదివారానికి, సూర్యునికి, బుధవారానికి బుధగ్రహానికి, శనివారానికి శని గ్రహానికి ఏమిటి సంబంధం? వారం తిరిగేసరికి మళ్ళీ ఆయా గ్రహాల ప్రభావం ఉంటుందా? ఎందుకిలా? ఇది ఒకే క్రమంలో ఎందుకుంటుంది? ఏడు రోజులకు ఒకసారి ఇలా ఎందుకు మారుతుంది? ఇలాగే ఎందుకు మారుతుంది? దీనికి ఏమైనా ఆధారం ఉందా? ఆయా వారాలమీదా ఆయా గ్రహాల బలం పనిచేస్తుంది అనేది వాస్తవమా లేక ఊహాజనితమా?

ఈ అంశాన్ని ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించిన మన వేదపండితులు ఎంతో బాగా వివరించి చెప్పారు.

భాగవతంలో సూర్యుని రథ చక్రాన్ని త్రినాభి షణ్ణేమి ద్వాదశార అంటూ వర్ణించారు.

త్రినాభి అంటే చతుర్మాసముల మూడు సంఖ్యను సూచిస్తుంది. (4 + 4 + 4)

షణ్ణేమి అంటే చక్రం చుట్టూ ఉండే ఆరు పట్టీలు. ఇవి ఆరు ఋతువులను సూచిస్తాయి.

ద్వాదశార అంటే కుంభాన్ని చక్రానికి జతచేసే లేదా కలిపే 12 పట్టీలు. వీటిని ఆకులు అని కూడా అంటారు. ఇవి పన్నెండు నెలలను సూచిస్తాయి.

ఈ రథాలను లాగే సప్త అశ్వాలు ఏడు వారాలను సూచిస్తాయి.

ఆయా వారాలకు ఆయా గ్రహాలూ అధిపతులు. తక్కిన గ్రహాల ప్రభావమూ ఉంటుంది. ప్రతిసారీ ఏడు రోజులు పూర్తయ్యేసరికి ఆయా గ్రహాల పేరుతో ఉన్న వారాలు పునరావృతం అవుతాయి. భూమి క్రమం తప్పకుండా ఒకే పద్ధతిలో, నిర్దుష్టంగా తిరుగుతుంది కనుక అదంతా ఒక చక్రం మాదిరిగా మళ్ళీ మళ్ళీ ఆవృతం అవుతుంది.భూమి గనుక క్రమం తప్పినా, వేగం తగ్గినా, పెరిగినా, కొద్దిసేపు అసలే ఆగినా అంతా అల్లకల్లోలం అవుతుంది. మన మహర్షుల జ్ఞానదృష్టి మహాద్భుతం. ఏ సాంకేతిక పరికరాలూ లేని కాలంలోనే అంతరిక్షంలోకి తొంగిచూశారు. శతాభ్దాల క్రితం చెప్పిన సంగతులను ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు సాంకేతిక విజ్ఞానంతో ధృవపరిచి ఆధారాలతో సహా కళ్ళముందు ఉంచుతున్నారు.

వారాలను సూచించే ఏడు గుర్రాలకు పేర్లు, అర్ధాలు కింది విధంగా ఉన్నాయి.

గుర్రం పేరు  -    అర్ధం

అమృత సంభవ   -   శాశ్వతం, విష నాశకరం

బాష్ప సంభవ   -   బాష్పం, కన్నీరు

వహ్ని సంభవ  -   వహ్ని, అగ్ని

వేద సంభవ   -   జ్ఞానం, సత్యం

అండ సంభవ   -   వృషణం, వీర్యం

గర్భ సంభవ  -    గర్భం, ఉదరం, భ్రూణం

సామ సంభవ  -    సాధు, తాల్మి, సహనం, మందం

 

weeks and planets, earth and other planets, earth planet and sun, earth axis, earth runs 1 degree in 24 hours


More Enduku-Emiti