సంపదలు ఉన్నప్పుడే మంచిపనులు

 

సిరిగలనాడు మైమఱచి చిక్కిననాడు దలంచి పుణ్యముల్‌
పొరిఁబొరి సేయనైతినని పొక్కినగల్గునె గాలిచిచ్చుపై
గెరలినవేళదప్పికొని కీడ్పడువేళ జలంబుగోరి త
త్తరమునద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ!

 

సంపదలు కలిగిననాడు వాటిని అనుభవించడంలో మైమరచిపోయి ఉంటాము. తీరా ఆ సంపదలు కాస్తా క్షీణించి దారిద్ర్యంలోకి జారుకున్నప్పుడు- అయ్యో డబ్బున్నప్పుడు ఏవన్నా మంచి పనులు చేస్తే బాగుండేదే అని పశ్చాత్తాప పడతాము. కానీ ఏం ఉపయోగం!  ఇల్లు తగలబడిపోయే సమయంలో, ఆ మంటలను ఆర్పేందుకు అప్పటికప్పుడు బావి తవ్వాలనుకోవడం ఎంతటి మూర్ఖత్వమో... సంపదలు చేజారిపోయాక, ఆ సంపదలు ఉన్నప్పుడు పుణ్యకార్యాలు చేస్తే బాగుండేదే అని యోచించడమూ అంతే మూర్ఖత్వం.

 

 

-నిర్జర


More Good Word Of The Day