వాళ్లకి బుద్ధి చెప్పడం అసాధ్యం

 

సారాసారము లెఱుగని బేరజులకు బుద్ధిజెప్పబెద్దలవశమా?

నీరెంత పోసి పెంచినగూరగునా నేలవేము?గువ్వలచెన్నా!నేలవేము అనే మొక్క ఉంటుంది. వేపకన్నా చేదుగా ఉండటం దాని లక్షణం. అందుకనే నేలవేముని ఔషధులలో వాడతారే కానీ పొరపాటున కూడా వంటకి ఉపయోగించరు. అలాంటి నేలవేముకి ఎంత నీరు పోస్తే మాత్రం ఏంటి ఉపయోగం! దానిలోని చేదుతగ్గి కూరగా మారిపోదు కదా. అలాగే మంచీ చెడూ, సారమూ సత్తువా గ్రహించే విచక్షణ లేని ధూర్తులకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించడం వ్యర్థం.


More Good Word Of The Day