తిరుమల క్షేత్రంలో తొలిపూజ ఎవరికి ?
" తిరుమల క్షేత్రంలో తొలిపూజ ఎవరికి ? " అనే ప్రశ్నకి తిరుమల గురించి తెలిసిన వాళ్ళు , ఎప్పటికి తిరుమలకి వెళ్ళే వాళ్ళు , నిరంతరంగా వరాహస్వామిని పూజించే వాళ్ళు గబుక్కున చెప్పేస్తారు...ఇంకెవరు మన వరాహస్వామి అని ! కాని దేవుళ్ళ మీద నమ్మకం ఉన్న ప్రతివాళ్ళు కూడా " వరాహస్వామి " అని చెప్పాలని అయన గురించి తెలుసుకోవాలని www.teluguone.com/devotional మనకు అందిస్తుంది.
తిరుమల క్షేత్రంలో తొలి దర్శనం, తొలి పూజ, తొలి నైవేద్యం అన్నీ వరాహస్వామివారికే అందుతాయి. ఈ ఆచారం ఈనాటిది కాదు. శతాబ్దాలుగా ఈ ఆచారమే కొనసాగుతోంది. భక్తులు వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అందుకే తిరుమల పుణ్య తీర్థాన్ని ''ఆది వరాహ క్షేత్రం'' అని కూడా అంటారు.
హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలోకి విసిరివేస్తాడు. ఆ భూమాతను రక్షించడానికి విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తాడు. అప్పటికీ పశ్చాత్తాపం లేకుండా హిరణ్యాక్షుడు హేళన చేయగా, విష్ణుమూర్తి కోపం తెచ్చుకోకుండా ఆవేశ పడకుండా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి పట్టుకొని సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాడు. ఇదీ వరాహస్వామి కథ. వరాహస్వామి కథ చాలా పెద్దది. వివరంగా మనం www.teluguone.com/devotional ల్లో తెలుసుకుంటూ ఉందాం !
ఇక వైకుంఠం వదిలి వచ్చిన శ్రీనివాసునికి భూలోకంలో స్థలాన్ని ప్రసాదించింది కూడా వరాహస్వామివారే నని ఈ కారణంగానే తిరుమల దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరుని కంటే ముందుగా వరాహస్వామి దర్శనం అవుతుందని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు.