శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..?

 

information on history of indian women hinduism young womens goes to the temple every Friday

 

శుక్రవారం పూట ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..? దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, కన్యలు సంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వంటి ధరించాలి. నుదుట కుంకుమ రంగుతో కూడిన బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకుని దీపమెలిగించడం కూడదు. ఇలా చేస్తే మీకు కలగాల్సిన శుభ ఫలితాలు ఇతరులకు చేరుతుందని పురోహితులు చెబుతున్నారు.

 

information on history of indian women hinduism young womens goes to the temple every Friday

 

ఇక శుక్రవారం ఉదాహరణకు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తున్నారంటే.. గరిక మాలతో తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతిశుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి. ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.


More Enduku-Emiti