కమనీయం రమణీయం

కల్యాణోత్సవం

Srivari Kalyanotsavam at Tirumala

 

తిరుమలలో ధ్రువబేరం మూలవిరాట్టుకు బదులుగా ఉత్సవమూర్తి మలయప్ప స్వామివారికి కల్యాణోత్సవం చేస్తారు. ఉత్సవబేరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి ఒక పురోహితుడు వేదమంత్రాలు చదువుతూ కల్యాణం జరుపుతుండగా, మరో అర్చకుడు వధూవరుల తరపున ఆచారాలు నిర్వర్తిస్తుంటాడు. కల్యాణోత్సవం సరిగ్గా ఉదయం 11.30కు మొదలై, మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుంది.

వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ కల్యాణోత్సవం పంచముఖి పూజతో మొదలవుతుంది. కల్యాణోత్సవం టికెట్లు కొనుక్కున్న దంపతులను ఈ ఉత్సవం చూసేందుకు అనుమతిస్తారు. మొదట శ్రీదేవి, భూదేవిలకు, మలయప్ప స్వామికి మధ్య తెర ఉంటుంది. అర్చకులు హోమాలు నిర్వహించిన తర్వాత అడ్డుగా ఉన్న తెరను తొలగిస్తారు. వేదమంత్రాలు, మాంగల్య ధారణ, తలంబ్రాలు - అన్నీ మామూలు వివాహాల్లో ఎలా ఉంటాయో, అలాగే స్వామివారి కల్యాణోత్సవంలోనూ ఉంటాయి.

తిరుమలలో స్వామివారి కల్యాణోత్సవం తిలకించాలని ఉవ్విళ్ళూరే భక్తులు ఎందరో. పూర్వం ఒక టికెట్టుపై ఇద్దరినీ అనుమతించేవారు. నానాటికీ రద్దీ పెరుగుతున్న తరుణంలో ఒక టికెట్టుపై ఒక్కరినే అనుమతిస్తున్నారు. కల్యాణోత్సవం గంటపాటు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఉండదు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవం, పుష్పయాగం మొదలైన విశేషదినాల్లో కల్యాణోత్సవం నిర్వహించరు.

కల్యాణోత్సవం దర్శించుకున్న భక్తులకు రెండు గ్రాముల వెండి నాణెం, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ, వస్త్ర బహుమానం (ఒక ఉత్తరీయం లేదా జాకెట్ ముక్క), పవిత్రమైన స్వామివారి అక్షతలు ఇస్తారు. అక్కడినుండి స్వామివారి దర్శనానికి పంపిస్తారు.

 

Srivari Kalyanotsavam at Tirumala, Utsava Murti Malayappa Swami, Srivari Kalyanotsavam Tiket, Kalyanotsav Darshan, Kalyanotsav Vastra Bahumanam


More Venkateswara Swamy