కుంభరాశి - ధనిష్ట 3,4 (గూ.గే)

శతభిషం 1,2,3,4 (గో,సా,సి,సు) - పూ.భా. 1,2,3 (సే,సో,దా)

ఆదాయం: 14     వ్యయం:  14   రాజపూజ్యం:  6  అవమానం:  1

        ఈ రాశి వారికి గురువు వత్సరాది 12-09-2017 భాద్రపద ఒ||  సప్తమి మంగళవారము వరకు 8వ స్థానమున తదుపరి వత్సరాంతము 9వ  స్థానమున ఉండును శనివత్సరాది 20-06-2017 వరకు 11వ స్థానమున తదుపరి 26-10-2017 వరకు 10వ స్థానమున వక్ర గతుడై ఉండును. తదనంతరము వత్సరాంతము 11వ స్థానమున ఉండును. రాహు కేతువులు వత్సరాది 17-08-2017 వరకు రాహువు 7వ స్థానమున కేతువు జన్మస్థానమున ఉండును. తదుపరి వత్సరాంము రాహువు 6వ స్థానమున కేతువు 12వ స్థానమున ఉండును.

        సెప్టెంబరు తరువాత విదేశీ యాన ప్రయాత్నములు ఫలించును. ఆరోగ్య విషయంలో మామ్రు తగు శ్రద్ధ తీసుకోవాలి. ఈ విధమైన పరిస్థితిని పరిశీలించి చూడగా ఈ సంవత్సరము శ్రావణమాసం నుండి విశేషమైనటువంటి ఫలితములు కలుగగలవు. మీ జీవితానికి ఒక స్థిరమైన దిశ, దశ ఏర్పడే అవకాశం గలదు. భవిష్యత్తుకై శాశ్వత స్ధిర నివాసంగాని, శాశ్వత పథకాలుగాని రూపొందించుకుంటారు. ఉద్యోగంలో మీరు కోరుకున్న స్థాయి, గౌరవం లభిస్తాయి. సంతానం యొక్క విద్యా విషయమై స్థిరమైన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చే విధంగా ఉంటుంది. ద్వితీయ సంతానం ఆరోగ్య విషయంలోగాని, విద్యా విషయంలోగాని స్వల్పమైన చికాకు ఏర్పడవచ్చును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న విధి నిర్వహణతో బాటు అదనపు బాధ్యత కూడా నిర్వర్తించ వలసి వస్తుంది. ధనము మాత్రం అంచనాలకు మించి ఖర్చుఅయ్యె అవకాశములు గలవు. స్థిరాస్థులు కొనుగోలు చేయునపుడు సంబంధించిన కాగితాలు పునః పరిశీలించివలసినది నూతన వ్యాపారములలో ప్రవేశించుట, అనూహ్యంగా ధనము చేతికందుతుంది. గతంలో ఋణంగా ఇచ్చిన ధనం మిశ్రమ ఫలంగా చేతికందుతుంది. శతృవులు మిత్రులుగా మారే అవకాశం గలదు.

మీ స్నేహాన్ని మీ ఆశ్రమాన్ని కోరే అవసరం మీ ప్రత్యర్ధులకు వస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. జనాకర్షణ, ఆత్మాభిమానం పెరుగుతుంది. నూతన వాహన లాభం, ఎంతటి కార్యాన్నయినా సమర్ధవంతంగా నిర్వహించగలరనే పేరు వస్తుంది. వ్యాపారస్థులకు మే వరకు అనుకూలంగా ఉన్నది. తరువాత మనస్సు, శరీరం సహకరించక పోవడం, సహనం తగ్గుట తదితర సమస్యలు ఉత్పన్నం కావచ్చును. అనవసర వృధా ఖర్చులు పెరిగే అవకాశం గలదు. భూములు కొనుగోలు చేయుటయందు ఫలితాన్ని సాధిస్తారు. గత అనుభవాలు భవిష్యత్తుకు పాఠంలా ఉపయోగించుకుంటారు. ప్రయోగాత్మక వ్యాపారాలు గాని ఇతర విషయాలు గాని అన్నిటికి స్వస్తి పలికి శాశ్వతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడంలో శ్రద్ధ చూపిస్తారు. పరుగెత్తి పాలు త్రాగడం కన్నా నిలబడి నీరు త్రాగడం మేలని నిర్ణయించుకుంటారు. ఈ రాశి ఉద్యోగస్థులకు అనుకూలంగా ఉంది. మీకు అందవలసిన ప్రయోజనాల కొరకు లేదా స్థాన చలనం కొరకు విశేషకృషి చేయండి. సంవత్సరాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నము కావచ్చునను. వత్సరారంభంలో ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం గలదు. ఉద్యోగ క్రమబద్దీకరణ కూడా జరుగును. విద్యార్థులు వత్సరారంభంలో చక్కని ఫలితాలు పొందుతారు. మేధస్సు, గ్రహణ శక్తి వృద్ధి నొందుతాయి.

పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అయితే భవిష్యత్తు కొరకు చేయవలసిన ఉపాయాలు ఇప్పుడే ఆరంభించుట మంచిది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మేల్కొపు అనేక అవకాశాలు గలవు. కుటుంబంలో మీ స్థాయి మీ విలువ పెరుగుతుంది. తోటి వారు మీ అవసరాన్ని గుర్తిస్తారు. ఖనిజ వ్యాపారాలు చేసేవారికి అనుకూల సమయం ప్రభుత్వ పరంగా పొందవలసిన అనుమతులు పొందటానికి ఇప్పుడే బీజం వేసి ఉంచండి. దరఖాస్తు పెట్టుకోవడం, పైరవీలు చేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి మాటవినిన మేలు జరుగును. కుటుంబంలో అన్యోన్య సహకారం లభించును.  సంతాన ప్రాప్తి గలదు.  ప్రతిష్టాత్మకమైన వారితో పరిచయం ఏర్పడగలదు. స్వర్ణ, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఋణబాధ తీర్చడానికి విశేషకృషి చేస్తారు. సఫలమవుతారు. రాజకీయంగా అనుకూలంగా ఉన్నది. మే లోపు ఎన్నికలలో విజయం సాధించే అవకాశం గలదు. ప్రత్యర్థిపై పట్టుసాధించడానికి మీరు వేసే ప్రతి అడుగు మీకు అనుకూలమవుతుంది. సమాజానికి కీడు చేసే పనులు చేయడానికి మిమ్ములను ప్రోత్సహిస్తారు జాగ్రత్త. ఏదైనా సాధించాలని  పట్టుదలతో ఉంటారు, సాధిస్తారు.

స్థిరాస్తులకు విలువ పెరుగుతుంది. సమాజంలో నిజమైన సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటారు. స్త్రీ విభేదాలు అకారణ కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమములో మీ వంతు సేవ చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఒకింత గర్వాన్ని ఇస్తుంది. స్వతంత్ర వివాహాలు పెద్దల అంగీకారంతో జరుగుతాయి. ఉద్యోగంలో గతంలో ఉన్న అనేక సమస్యలనుండి బయటపడతారు. పొత్తి కడుపు లేదా ఉదర సంబంధిత సమస్యలు బాధించవచ్చును. ఔషధ సేవనం తప్పక పోవచ్చును. కోర్టు వ్యవహారాలు పరిష్కారమౌతాయి. చోరభయం కలదు. జాగ్రత్త ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. విదేశాలకు వెళ్ళవలసి రావచ్చును. కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత హృదయ సంబంధిత బాధలు, వాటికి గతిన ఔషధ సేవనం తప్పకపోవచ్చును. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఫలిస్తుంది. ఎంత నియంత్రణగా ఉండాలని ప్రయత్నించినా ఒక రకమైన నిందారోపణలు ఎదురుకొంటారు. విదేశాలలో స్థిరనివాస యోగ్యత ఏర్పడుతుంది. వివాహప్రాప్తి, మీ వాక్‌చాతుర్యంచే కొందరి జీవితంలో చాలా మార్పులు తీసుకువస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి జనాకర్షణ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఒకరి జీవితానికి పూర్తిగా సహకారం అందించాలని ప్రయత్నిస్తారు. సఫలమౌతారు.

ప్రభుత్వ గౌరవం, రాజలాంఛనములు అనుభవిస్తారు.  తన సొమ్ము అయిననూ దాచుకొని అనుభవించవలయును. అగ్ని సంబంధమైన ప్రమాదములు రాకుండా జాగ్రత్త పడాలి. విద్యుత్తుకు దూరంగా ఉండడం చేయాలి. రాజభయం, దేహకాంతి తగ్గుట, గతంలో మీ మాటకు ప్రస్తుత మాటకు వ్యత్యాసం ఉంటుట, తరచూ విమర్శలకు లోనగుట, మొండి ధైర్యం ఏర్పడుట, కోపం, ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం. శని వలన వత్సరారంభంలో పుత్ర సుఖం, మానసిక నిర్మలత్వము, అభీప్సితార్థ సిద్ధి, ద్రవ్యప్రాప్తి, స్త్రీ సౌఖ్యము మొదలగు ఫలితము ఉన్ననూ, వత్సరాంతంలో ఏలినాటి శని ఆరంభం చేత ఒకింత భయం, వృధా ధనవ్యయం, కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకొనలేకపోవుట, మర్యాదహాని, అజీర్తి, గృహశాంతి లోపించుట ఫలితము కనపడచున్నది. పుత్రులు సరిగా  ఆదరించకపోవడం, సమాజంలో సంపాదించిన గౌరవాన్ని  ఇంటివారు గుర్తించలేకపోవడం, చిత్త చాంచల్యం, వాగ రోగమును, స్త్రీ మూలక భయం, ప్రయాణమందు విఘ్నములు, శారీరక శ్రమ, వ్యవహార చిక్కులు, శతృ, ఋణ, రోగములు. తీర్థయాత్ర ఫలము దక్కును. తల్లి ఆరోగ్యము జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాజనీతి, ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో సఫలమవుతారు. ఆశలు వదలుకున్న కొన్నపనులు అనూహ్యంగా సఫలమౌతాయి.

        విదేశీ ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగా లాభించవచ్చును. విదేశాలలో ఉన్న మీ స్నేహితులు శ్రేయోభిలాషుల వల్ల ధనసహాయము లభించవచ్చును. అతి ప్రయాసపైన స్థిరాస్థిని వృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తారు. ఈ సం||ము మీలో  ప్రధాన లోపము ప్రతి పనిని వాయిదా వేయటము, భక్తి మార్గ పయనము. బంగారు ఆభరణములలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలు రావడము. షేర్‌ మార్కెట్‌ రంగములో ప్రయాణించుట, మీలో కార్యసామర్థ్యము ఉన్న దానిని గుర్తించి ఉపయోగించుకోలేకపోవుట ఒక సమస్యగా మారుతుంది. అనాలోచితంగా కొంత ధనాన్ని సద్వినియోగించలేకపోవడం, ప్రభుత్వ పరంగా అందవలసిన ప్రయోజనాలు వాయిదాల రూపంలో అందుట, నిర్ణయం తీసుకోవడంలో ఒకరి సహాయం అవసరము, వృత్తి ఉద్యోగములో ఉన్నతి. సంవత్సర పూర్వార్ధంలో లభించును. విదేశీ అవకాశాలు లభించును. సంతానప్రాప్తి, వివాహ ప్రాప్తి,.ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు గురు,శని, రాహు, కేతు, జప దానాదులు చేసిన మంచిది. శ్రీ సుదర్శనస్తోత్రము, శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రము, గణపతి స్తోత్రం దుర్వార్చన మొదలగునవి తమ తమ వంశాచార అనుసారముగా చేసిన మేలు జరుగును.     సంవత్సర ద్వితీయార్థం నుండి మీ వ్యక్తిత్వానికి గౌరవం పెరుగుతుంది. ప్రేమచే  అందరి మనస్సు ఆకర్షిస్తారు. వివాహ ప్రాప్తి గలదు. సంతానప్రాప్తి గలదు. అన్యోన్య దాంపత్య జీవితం లభిస్తుంది. ఆర్థికంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.

విదేశాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉన్నది. స్థిరాస్థి వృద్ధి చేసుకుంటారు. అయిష్టంగా కొందరిని ఆదరించవలసిన స్థితి ఏర్పడవచ్చును. ఊహలలో విహరించడం మాని జీవితానికి ఏది అవసరమో ఏది ఆచరణ యోగ్యమో, ఏది సాధ్యము అది ఆలోచించి విజ్ఞతతో నిర్ణయించుకోవాలి. అసాధ్యమైన విషయాలపై ఆసక్తి పెంచుకోవడం అవివేకమని తెలుసుకోవాలి. ఆరోగ్యంపట్ల అశ్రద్ధ పనికిరాదు. మీరు కోరుకున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇష్టమైన ప్రదేశానికి స్థానచలనం, హోదా, పరపతి ఇవి అన్నీ పెరుగుతాయి. కన్యాదాన ప్రాప్తి కలదు. ఉద్యోగం క్రమబద్దీకరింపబడే అవకాశం గలదు. నూతన వాహనప్రాప్తి, అత్యుత్సాహంతో ప్రతిపనిలోనూ మీరు పాలు పంచుకోవడం అనర్ధానికి దారితీయవచ్చును. పెద్దల సంస్మరణార్ధం ఒక మంచి పని చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో సఖ్యత అనుకూలత ఏర్పడుతుంది. నూతన విద్యా ప్రవేశాలు. అతి మంచితనాన్ని తమ అసమర్థతగా లోకం భావించడాన్ని చూసి ఆవేదన పడతారు. మారడానికి ప్రయత్నం చేస్తారు. వాహనాలు నడుపునపుడు జాగ్రత్త అవసరం. అగ్ని, జల సంబంధిత ప్రమాదములు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు చివరలో అనుకూలంగా ఉన్నది. గట్టి ప్రయత్నం ఆత్మస్ధైర్యముతో ముందుకు వెళ్ళండి. గతంలో చేసిన కొన్ని పొరపాట్లకు పశ్చాత్తాపపడతారు. జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ విషయంలో అనాలోచిత నిర్ణయం అనర్ధానికి దారి తీయవచ్చు. ధనం చేతికందుతుంది.సంతాన సౌఖ్యము, వారి అభివృద్ధిని చూసి ఆనందిస్తారు.  స్త్రీ, సౌఖ్యము మానసిక నిర్మలత్వము ఏర్పడుతుంది అభీప్సితార్థ సిద్ధి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో చిత్త చాంచల్యము, స్త్రీ జన విరోధము, ప్రయాణాలలో వస్తునష్టము, అకాల భోజనము వాహన ముద్రాధికారములు లభించును. పేరు ప్రతిష్టలు లభించును. భూ వసతి కలుగును. ఈ విధంగా ఈ రాశివారికి శుభఫలితాలు సంవత్సరం మధ్యకాలము నుండి అనుభవిస్తారు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు గురు,శని, రాహు, కేతు, జప దానాదులు చేసిన మంచిది. శ్రీ సుదర్శనస్తోత్రము, శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రము, గణపతి స్తోత్రం దుర్వార్చన మొదలగునవి చేసిన మేలు జరుగును.


More Rasi Phalalu 2017 - 2018