మకరరాశి - ఉ.షా 2,3,4 (బో.జా.జి)

శ్రవణం 1,2,3,4 (బో.జె.జో.ఖ), ధనిష్ట 1,2 (రా,శి) 

ఆదాయం: 14     వ్యయం:  14   రాజపూజ్యం:  3  అవమానం: 1

        ఈ రాశి వారికి గురువు వత్సరాది 12-09-2017 భాద్రపర బ|| సప్తమి మంగళవారం వరకు 9వ స్థానమున సువర్ణమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతం 10వ స్థానమున రజిత మూర్తిగా ఉండును-శని వత్సరాది 20-06-2017 జ్యేష్ఠ బ|| ఏకాదశి మంగళవారం వరకు 12వ స్థానము నందును తదుపరి 26-10-2017 కార్తీక శు|| షష్ఠి గురువారము వరకు వక్రగతుడై 11వ స్థానమున తదుపరి వత్సరాంతము 12వ స్థానమున లోహమూర్తిగా ఉండును. రాహు కేతువులు వత్సరాది 17-08-2017 వరకు రాహువు 8వ స్థానమున - కేతువు 2వ స్థానమున రజిత మూర్తులుగా ఉందురు. తదుపరి వత్సరాంతము రాహువు 7వ స్థానమున కేతువు 1వ స్థానమున సువర్ణ మూర్తులుగా ఉందురు.

        ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి భూ కగా ఈ సంత్సరము పూర్యార్థము కొంత వరకు అనుకూలముగా ఉన్ననూ ప్రతి విషయంలో మితిమీరిన ఆత్మ విశ్వాసము పనికిరాదు. ఏలినాటి శని ఆరంభదశ కనుక ప్రతి పని ప్రయాస చే మిశ్రమ ఫలితము కలుగును- తమ శ్రమకు తగిన ఫలితము పొందటములో సందేహము గలదు. ఏదో ఒక విధంగా తృప్తి పడవలసి వచ్చును. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ఒకానొక సందర్భములో మానసిక నైరాశ్యము, ముర్ఖత్వము ఏర్పడును. శ్రేయోభిలాషుల సలహాలు ఆత్మీయుల ఆదరణ అంగీకరించడం శ్రేయస్కరము. వివాహ ప్రయత్నాలు సెప్టెంబరు లోపలే ప్రయత్నించుట ఉత్తమము. ఉద్యోగ పరమైన ఉన్నత గలదు. ప్రమోషనులు రావచ్చును-ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము కర, పాద బాధలు బాధించవచ్చును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా వైద్యపర్యవేషణము. ఔషద సేవనము తప్పకపోవచ్చును.

        దాంపత్య కలహాలు కలవరపరచవచ్చును. ప్రేమ వివాహాలు వివాదాస్పదం అవడము జరుగవచ్చును. వివాహ నిశ్చయ విషయంలో 2వ ప్రయత్నము సఫలము కావచ్చును. అయిన సంబంధాలు నిశ్చయంలో విసుగు కలుగును. లోకం దృష్టితో  మీకు సమస్యలు అసులు లేవనే భావన ఉంటుంది. కాని మీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటుంది. ధనం ఎంత సంపాధించినా ఉహించని ఖర్చులు ఎదురవుతాయి. కోర్టు వివాదాలు, ఇతరమైన సమస్యలు మధ్యే మార్గంగా పరిష్కరాలు కుదే ప్రయత్నం చేయండి. దుర్శనులను ఎంత దూరంగా ఉంచాలని ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడం మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఏదో తెలియని భయం వేంటాడవచ్చు. వివాదస్పద భూములు, స్థిరాస్తులు కొనుగోలు చేయకండి- అనవసర ప్రలోభాలకు లోంగకండి. వాహనాలు నడుపు నవుదు అశ్రద్ధ-అజాగ్రత్త పనికిరాదు. విదేశాలలో ఉన్నవారు అచటి చట్టపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తాత్కాలిక ప్రయోజనం కొరకు చెప్పుడు మాటలు విని మోసపోకూడదు. ధన విషయంలో కొంత మోసగించే అవకాశం గలదు.  తస్మాత్‌ జాగ్రత్త మధ్యవర్తిత్యము జరుపకండి- జమానతు-స్యూరిటీలు ఇవ్వరాదు. వెనకా ముందు ఆలోచించకుండా సంతకాలు చేయరాదు. ఉద్యోగస్తులు ప్రలోభాలకు లొంగకండి. శాఖపరమైన చరయ్లవీ ఉత్పన్న- కావచ్చును. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. స్త్రీలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. భాగస్వామ్య వ్యాపారులు-తమ భాగస్వాముల ముఖ్య విభేదాలు రాకుండా సహనం వహించాలి ఆత్మీయుల జ్ఞాపకాలు ఆవేదన-ఇవి అన్ని మీరు అనుభవించవలసిందే. రహస్య కార్యకలాపాలు-అసత్యప్రవర్తన మొ|| వాటికి దూరంగా ఉండండి.

        ఉద్యోగంలో మీరు కోరుకున్న స్థాయి, గౌరవం లభిస్తాయి. సంతానం యొక్క విద్యా విషయమై స్థిరమైన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చే విధంగా ఉంటుంది. ద్వితయ సంతానం ఆరోగ్య విషయంలోగాని, విద్యా విషయంలో గాని స్వల్పమైన చికాకు ఏర్పడవచ్చును. కాని ఏ పని అయినా కాస్త ఆలోచించాలి. ఏలినాటి శని ఆరంభ దశ అని గ్రహించండి. చోరభయం కలదు. జాగ్రత్త ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. విదేశాలకు వెళ్ళవలసి రావచ్చును. కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత హృదయ సంబంధిత బాధలు వాటికి గతిన ఔషధ సేవనం తప్పకపోవచ్చును. ఉన్నత చదువులు చదవాలనే ఆశ  ఫలిస్తుంది. ఎంత నియంత్రణగా ఉండాలని ప్రయత్నించినా ఒక రకమైన నిందారోపణలు ఎదురుకొంటారు. విదేశాలలో స్థిరనివాస యోగ్యత ఏర్పడుతుంది. వివాహప్రాప్తి, మీ వాక్‌చాతుర్యంచే కొందరి జీవితంలో చాలా మార్పులు తీసుకువస్తారు. ధార్మిక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి జనాకర్షణ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

ఒకరి జీవితానికి పూర్తిగా సహకారం అందించాలని ప్రయత్నిస్తారు. సఫలమౌతారు. ప్రభుత్వ గౌరవం, రాజలాంఛనములు అనుభవిస్తారు. తన సొమ్ము అయిననూ దాచుకొని అనుభవించవలయును. అగ్ని సంబంధమైన ప్రమాదములు రాకుండా జాగ్రత్త పడాలి. విద్యుత్తుకు దూరంగా ఉండడం చేయాలి. రాజభయం, దేహకాంతి తగ్గుట, గతంలో మీ మాటకు ప్రస్తుత మాటకు వ్యత్యాసం ఉంటుట, తరచూ విమర్శలకు లోనగుట, మొండి ధైర్యం ఏర్పడుట, కోపం,  ఆరోగ్య విషయంలో  మాత్రం వద్ద అవసరం, శని వలన వత్సరాంభంలో పుత్ర సుఖం, మానసిక నిర్మలత్వము, అభీప్సితార్థ సిద్ధి, ద్రవ్యప్రాప్తి, స్త్రీ సౌఖ్యము మొదలగు ఫలితము ఉన్ననూ, వత్సరాంతంలో ఏలినాటి శని ఆరంభం చేత ఒకింత భయం, వృధా ధనవ్యయం, కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకొనలేకపోవుట, మర్యాదహాని, అజీర్తి, గృహశాంతి లోపించుట ఫలితము కనపడచున్నది. పుత్రులు సరిగా ఆదరించకపోవడం, సమాజంలో సంపాదించిన గౌరవాన్ని ఇంటివారు గర్తించలేకపోవడం, చిత్త చాంచల్యం వాగ రోగమును, స్త్రీ మూలక భయం, ప్రయాణమందు విఘ్నములు, శారీరక శ్రమ, వ్యవహార చిక్కులు, శతృ, ఋణ, రోగములు. తీర్థయాత్ర ఫలము దక్కును. తల్లి ఆరోగ్యము జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాజనీతి, ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో సఫలమవుతారు. ఆశలు వదలుకున్న కొన్నపనులు అనూహ్యంగా సఫలమౌతాయి.

        ఆలోచనలు స్థిరముగా నుండక, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక, అర్థంకాని అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగములో ప్రత్యక్షంగా మీకు హితులు అన్నకున్న వారే పరోక్షముగా మీ గురించి వ్యతిరేకముగా మాట్లాడతారు. వెనక గోతులు తీసేవారున్నారని తెలిసి ఆశ్చర్యము, ఆవేదన కలుగుతుంది. ఆలస్యముగా వాస్తవాన్ని గ్రహించామని బాధపడతారు. పై అధికారుల వత్తిడివలన తమ విద్యుక్త ధర్మాన్ని సరిగా నిర్వహించలేక ఎటూ తేల్చుకోలేని స్థితి ఏర్పడుతుంది. ఎండమావులను చూసి ప్రలోభపడకుండా ఒకానొక సందర్భములో ఉద్యోగము మారాలని, రాజీనామా చేయాలనే ఆలోచనలు కూడా రావచ్చును. కాని జాగ్రత్త ఓపికపట్టండి. తరువాత మనోవాంఛ నెరవేరుతుంది. అతిసులభముగా పూర్తి కావలసిన పనులకు ఎక్కువగా శ్రమించ వలసిన పరిస్థితి వృధా భ్రమణము కనపడుచున్నది. ఎంత చాకచక్యముగా ఆలోచనలు చేసినా అవి కార్యరూపం దాల్చకపోవడం మరియు తమ ముందు నిల్చుని మాట్లాడటానికి ధైర్యము చాలనివారు సైతము మీకు సలహాలు ఇవ్వడము ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. కాలమహిమ అంటే ఇదేనని తెలుసుకుంటారు. ఎంత సహనంతో ఉండాలని ప్రయత్నించినా మీ సహనాన్ని, మౌనాన్ని భంగపరచువారు ఎదురవుతారు. అనవసరమైన, అకారణమైన నిందలకు గురి కావాల్సివస్తుంది.

లోకం దృష్టిలో కోటీశ్వరులు కాని వాస్తవానికి ఆర్థిక ఇబ్బందుల గురించి ఎవరికి చెప్పుకున్నా నమ్మె పరిస్థితి ఉండదు. వత్సరారంభంలో 4 నెలల కాస్త సంయమనము పాటించినా ప్రయోజనము లేని విషయాలపై ఆసక్తి చూపిస్తారు. అనాలోచిత నిర్ణయాలు, అకారణ ద్వేషాలు, స్వయంకృతాపరాధము కాగలదు. కొన్ని సందర్భాలలో లేనిది ఊహించుకొని భయపడే అవకాశము గలదు. ఏలినాటి శని ద్వితీయ భ్రమణము వారికి సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే అవకాశము గలవు.  చిన్న పనిని కూడా పెద్దగా ఆలోచించడము, ఆ పని పూర్తి అయ్యేవరకు నమ్మకము లేకపోవుట జరుగును. సహవాసము వలన ప్రతిష్ఠ భంగపడే అవకాశము గలదు. స్నేహాలు అనగా స్త్రీ, పురుషుల స్నేహాల విషయంలో నియంత్రణ అవసరము. మీ వెనక మీ కుటుంబము కూడా ఉన్నదని ఆలోచించాలి. ఒక చిన్న చెడు సలహా చేత వారి మాటలు ఇంపుగా అనిపించుటచేత, ఇంతకాలము సంపాదించిన ప్రతిష్ఠకు భంగము కలుగవచ్చును. ధర్మాధర్మ విచక్షణ చేయండి. చెప్పుడు మాటలు ఆత్మీయతలను దూరం చేస్తాయి. ఆదాయ వనరులు పెంచుకోవాలని విపరీతమైన ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో అశాంతి, దాంపత్య జీవితములో సమస్యలు, మాతా పితరుల ఆరోగ్య సమస్యలు ఉద్యోగములో తీవ్రమైన పని వత్తిడి మొదలగు సమస్యలు బాధించే అవకాశము గలదు. చోరభయం గలదు. ప్రభుత్వము, నివాస స్థలంగాని, ఉద్యోగంలో మార్పుగాని సంభవించవచ్చును.

ఇష్టంలేని ప్రదేశాలకు స్థానచలనం మానసిక వత్తిడి కాని పైకి కనిపించనీయరు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కాలేయము, బిపి,షుగరు సమస్యల విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. విలువైన వస్తువులు జాగ్రత్తగా దాచుకోవాలి. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్త, అనవసర అహంభావము మితిమీరిన అనారోగ్యకరమైన ఆత్మ విశ్వాసము పనికిరాదని తెలుసు కోవాలి. చట్టపరమైన విషయంలో జాగ్రత్తలు అవసరము. కోర్టు గొడవలు, పోలీస్‌ స్టేషనులు వాటి పట్ల దూరంగా ఉండడం ఉత్తమం. ప్రమాద సూచన గలదు. తల్లిదండ్రులకు దూరంగా నివసించం, స్నేహితులతో, బంధువులతో తగిన సహాయ సహకారాలు లభించకపోవచ్చును. అధిక ధనవ్యయము, ఎంత నియంత్రించాలకున్నా సాధ్యము కాకపోవుట, కొందరు ఉద్యోగులకు ప్రభుత్యోగులకు శాఖాపరమైన చర్యలు, వివాదాస్పదమైన ఆస్తులు, భూముల జోలికి వెళ్ళకండి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరము. సోదరుల మధ్య అకారణ కలహాలు, క్రోధము అధిక మగుట చాలా తెలివిగా పనులు చేస్తారు. కాని మానసిక వత్తిడి మాత్రము తప్పదు. ప్రభుత్వ అధికారుల, రాజకీయ నాయకుల పరిచయము హోదా లభించవచ్చును. ఆర్థిక ఇబ్బందులు, ఋణ బాధలు, స్థిరాస్థిని అమ్మకానికి పెట్టుట, తంత్ర విద్యలపై ఆసక్తి పెరుగుట, లాటరీలకు, జూదాలకు దూరంగా ఉండండి. మాతృ ఆరోగ్యము కలవర పరచు అవకాశము, విద్యాపరమైన ఉన్నతి. విద్యార్థులకు అధికంగా శ్రమించిన ఫలితము లభించగలదు. ఊహలు, సోమరితనం దరికి రానివ్వకండి. సం||ర మధ్యకాలంలో జ్ఞాపకశక్తి, పోటీ పరీక్షలలో విజయం సాధించుట, పోయిన గౌరవము తిరిగి పొందుట జరుగవచ్చును. స్థిరాస్థులు వివాదాస్పదమగుట. అగ్ని, విద్యుత్తు మొదలైన విషయాలలో జాగ్రత్తలు అవసరం.

ఉదర సమస్యలు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి, చివరలో వంశపారంపర్య ఆస్తుల విషయమై సమాచారము లభించును. ఆత్మస్థైర్యం పెరుగుట, శతృవులపై క్రమముగా పై చేయి సాధించుట ఆదాయపు మార్గాలు పెరుగుట, వృత్తిపరముగా పేరు, ప్రతిష్టలు పెరుగుట, జనాకర్షణ తీర్థయాత్రా సందర్శన, చర్మ సంబంధమైన సమస్యలు బాధించుట, సమయాన్ని వీలయినంతవరకు ఉపయోగించుకునే ప్రయత్నం. కన్యాదాన ఫలము గలదు. అవివాహితులకు వివాహప్రాప్తి.  పుత్రసంతాన ప్రాప్తి జంతుభయము, ఉద్యోగస్తులు, వ్యాపారులు ప్రభుత్వ అధికారులు అవినీతికి దూరంగా ఉండండి. నేర పరిశోధన వారి దృష్టి మీపై ఉంటుందని మరవకండి. సంవత్సరం చివరలో వ్యాపారస్తులకు కొంత ఉపశమనము లభించగలదు. భాగస్వామ్య వ్యాపారులపై అధిపత్యము క్రమంగా పెరుగగలదు. నష్టపోయిన ప్రతిష్ట, పరపతిని తిరిగిపొందుతారు. ఇతర రాష్ట్రాలలో వ్యాపార అవకాశాలు లభించవచ్చును. కళాకారులు ప్రయాసచే పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్థులు తొందరపడి ప్రస్తుతమున్న వ్యాపారమును మానివేసి నూతన వ్యాపారములు, నూతన ప్రదేశాలకు వెళ్ళాలనే యోచన చేస్తారు. విద్యార్థులకు సం||రం మధ్యనుండి బాగుంటుంది. శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. మేధస్సు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. స్నేహాలు, ఇతర వ్యసనములు వక్రమార్గంలో నడిపిస్తాయి. జాగ్రత్త, స్త్రీలు తరచూ మనస్సు నిరాశ పరచుకుంటారు. జీవిత భాగస్వామి సలహాపాటించిన మేలు జరుగును. ప్రాణమితృలు, మీ శ్రేయోభిలాషులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తపడండి.చివరలో విదేశీయాన అవకాశాలు సఫలం కావచ్చును. విదేశాలలో ఉన్నవారికి శాశ్వత యోగ్యత, వర్క్‌ పర్మిట్‌ లభించవచ్చును. స్త్రీలకు సహజంగా ఏర్పడే కొన్ని ఆరోగ్య సమస్యలు కలవరపరుస్తాయి. నూతన విద్యయోగ్యతా పత్రాలు పొందుతారు. శరీరానికి ముఖకాంతి తగ్గడం, చర్మ సమస్యలు నూతన స్నేహాలు విస్మయానికి గురిచేస్తాయి. అభద్రతా భావం వదలండి. ఇష్టదైవాన్ని, గ్రహదైవాన్ని ఆరాధించండి. తల్లిదండ్రులను ఆదరించండి. వృద్ధులకు సాయం చేయండి. గోసేవ, జీర్ణ దేవాలయాలకు సహాయము, శ్రేయోభిలాషులకు మేలు చేయుట, విద్య ద్వారా మొదలైన అంశాలు గ్రహబాధ నుండి విముక్తడిని చేస్తాయి. ప్రత్యేక శని స్తోత్రపారాయణం శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణం మేలు చేస్తుంది.


More Rasi Phalalu 2017 - 2018