మీ జాతకంలో రాహు దోషం ఉందా..ఈ దేవతలను పూజించండి సమస్య తొలగిపోతుంది!
మనిషి జీవితం మీద గ్రహాల ప్రభావం చాలా ఉంటుందని అంటారు. హిందూ ధర్మం, జ్యోతిష్క శాస్త్రం గ్రహాల ప్రభావాన్ని, అవి జీవితం మీద చూపించే అనుకూలతలు, ప్రతికూలతల గురించి నొక్కి చెబుతుంది. నవగ్రహాలలో రాహువు గ్రహం చాలా భిన్నమైనది. రాహువు హిరణ్యకశిపుని కుమార్తె సింహికకు, విప్రచిత్తికి జన్మించినవాడు. సాగర మధనం సమయంలో అమృతం దేవతలకు దక్కినప్పుడు.. దేవతల వరుసలో కూర్చుని రాహువు అమృతం తాగాడు అంట. ఈ కారణంగా కోపించిన విష్ణువు తన విష్ణుచక్రంతో రాహువు తలను ఖండించాడు అంట. ఇలా విష్ణువు తలను ఖండించడం వల్ల శరీరం రెండు భాగాలు అయినా రెండింటిలోనూ ప్రాణం ఉంది. తలను రాహు అని, మొండెం భాగాన్ని కేతు అని అంటారని పురాణ కథలు చెబుతున్నాయి.
రాహువు అమృతాన్ని దొంగిలించినప్పుడు ఆ దొంగతనం గురించి సూర్య చంద్రులు ఫిర్యాదు చేశారని, అందుకే రాహువుకు సూర్యచంద్రులతో శత్రుత్వం ఉందని అంటారు. రాహు,కేతులు సూర్యచంద్రులను తినడానికి ప్రయత్నిస్తారు అనే విషయం కూడా ఈ కారణంగానే అంటారు. దీనినే గ్రహణం అని అంటారు. అయితే రాహువు కొందరు దేవతలు అంటే భయపడతాడు. జాతకంలో రాహు దోషం ఉన్నవారు ఆయా దేవతలను పూజించడం వల్ల రాహువు ప్రభావం తగ్గుతుంది.
దుర్గా..
మత్స్య పురాణం ప్రకారం రాహువు భూమి నీడలో అంటే భూమి ఛాయలో ప్రయాణిస్తాడు. దుర్గా దేవి కూడా నీడ రూపంలో ఉంటుంది. దుర్గా శప్తశతి పారాయణం వల్ల రాహువు దుష్ప్రభావం నుండి ఉపశమనం పొందుతారట.
సరస్వతి..
రాహువు దోషం జాతకంలో ఉంటే విద్య, వృత్తికి సంబంధించిన విషయాలలో అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు సరస్వతి దేవిని ఆరాధించడం వల్ల సరస్వతి అనుగ్రహం కలగడమే కాకుండా రాహువు ప్రభావం కూడా తగ్గుతుంది.
శివుడు...
శివుడిని ఆరాధించడం లేదా పంచాక్షరీ మంత్రాన్ని జపం చేయడం వల్ల కూడా రాహువు ప్రభావం తగ్గుతుంది. శివుడు గ్రహాలకు అధిపతి. శివారాధన కేవలం రాహువుకే కాదు.. ఏ గ్రహ దోషానికి అయినా పరిష్కారం చూపిస్తుంది. రాహు దోషం ఉన్నవారు శివుడిని ఆరాధిస్తే చాలామంచిది.
ఆంజనేయస్వామి..
రాహు దోషం ఉన్నవారు ఆంజనేయస్వామిని ఆరాధించినా, హనుమాన్ చాలీసా, ఆంజనేయస్వామి అష్టోత్తరం వంటివి పారాయణ చేస్తున్నా రాహు ప్రభావం తగ్గుతుంది. హనుమంతుడు శివుడి అంశ. శివుడు గ్రహాలకు అధిపతి. కాబట్టి హనుమంతుని ఆరాధన కూడా గ్రహ దోషాల నివారణకు మంచిది.
వరాహ రూపం లేదా వారాహి రూపం..
వరాహ రూపంలో ఉన్న విష్ణువును ఆరాధించడం వల్ల కూడా రాహు ప్రభావాన్ని జాతకాలలో తగ్గించుకోవచ్చు.
*రూపశ్రీ.