ఆశ్వయుజ పూర్ణిమ.. ఒకవైపు చంద్రగ్రహణం.. మరొకవైపు అదృష్టం..
సంవత్సరంలో 12మాసాలు ఉన్నట్టే ప్రతి మాసంలో పూర్ణిమ వస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో పూర్ణిమకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది., శ్రావణ పూర్ణిమ అని, మాఘ పూర్ణిమ అని, కార్తీక పూర్ణిమ అని ఇలా చాలా పూర్ణిమలకు ప్రత్యేకత ఉంది. అయితే ఆశ్వయుజ మాసంలో వస్తున్నపూర్ణిమకి పెద్ద ప్రత్యేకతే ఉంది. ఈసారి పూర్ణిమ చంద్రగ్రహణంతో కూడుకుని ఉంది. ఆశ్వయుజ పూర్ణిమ వెనుక కేవలం ఇవి రెండే కాకుండా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చంద్ర గ్రహణం ప్రత్యేకత, దీని వల్ల ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయనే విషయం తెలుసుకుంటే..
చంద్రగ్రహణం..
అక్టోబర్ 28 న పూర్ణిమ తిథి అక్టోబర్ 28వ తేదీ ఉదయం 04:17 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అక్టోబర్ 29వ తేదీన ఉదయం 01:53 గంటలకు ముగుస్తుంది. ఈ పూర్ణిమ తిథి నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారతదేశంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది.
ఆశ్వయుజ పూర్ణిమ ప్రత్యేకత..
పురాణాల ప్రకారం ఆశ్వయుజ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది. నక్షత్రాలలో మొదటిది అశ్వని. అశ్వని నక్షత్రంలో వచ్చే పూర్ణిమను ఆశ్వయుజ పూర్ణిమ అని కూడా పేరు. ఈ పూర్ణిమలో చాలా దైవిక శక్తులు నిండి ఉంటాయి. అందుకే ఈరోజున అమ్మవారి ఆరాధన పెద్ద ఎత్తున జరుగుతుంది. వసంత ఋతువు, శరదృతువులో రోగపీడలు అధికంగా ఉంటాయి. అందుకే ఈ మాసాలలో జరిగే ప్రతి తిథి వీటికి విరుగుడుగా పనిచేస్తుంది. ఇక ఆశ్యయుజ పూర్ణిమ రోజే సాగరమధనం సమయంలో లక్ష్మీదేవి ప్రత్యక్ష్యం అయ్యింది. ఈ రోజునే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని, భూలోక వాసులను అనుగ్రహించిందని, ఆశ్వయుజ పూర్ణిమ లక్ష్మీ దేవి జన్మ తిథి అని పురాణ కథనాలు ఉన్నాయి. దీని ప్రకారం ఆశ్వయుజ పూర్ణిమ లక్ష్మీదేవికి చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ ఆశ్వయుజ పూర్ణిమను కాముని పున్నమి అని కూడా అంటారు. ఇదే రోజున చంద్రుడు తన 16దశలను పూర్తీ చేసుకుంటాడు. ఆ ఆశ్యయుజ పూర్ణిమ రోజు చంద్రుడు తన వెన్నెలలో అమృతాన్ని కురిపిస్తాడనే నమ్మకం కూడా ఉంది. అందుకే చంద్రుని వెన్నెలలో పాలను ఉంచి ఆ పాలను సేవిస్తుంటారు.
పూర్ణిమ రోజు ఏం చేయాలంటే..
ఆశ్వయుజ పూర్ణిమనాడు విష్టువును పూజించడం చాలా శ్రేష్టం. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, పారే నీటిలో లేదా, గంగాదేవి మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. పౌర్ణమిరోజున నువ్వులు సమర్పించడం ఎంతో మంచిది. ఈరోజు పారే నీటిలో నువ్వులను అర్ఘ్యమిస్తే చాలా మంచిది. ఆ తరువాత విష్ణువుకు షోడషోపచార పూజ నిర్వహించాలి. విష్ణువుకు పసుపు రంగంటే ఇష్టం కాబట్టి పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. పండ్లు, పూలు, విష్టుసహస్రనామాల పఠనం మొదలయినవి చేయాలి. అదే విధంగా లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
ఏ రాశులకు మంచిదంటే..
ఈసారి ఆశ్వయుజ పూర్ణిమ కొన్ని రాశులవారికి బోలెడంత అదృష్టాన్ని వెంటబెట్టుకొచ్చింది. ఏ రాశుల వారికి మంచి యోగం ఉందో తెలుసుకుంటే..
వృషభ రాశి..
వృషభరాశి వారికి ఆశ్వయుజ పూర్ణిమ చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ పూర్ణిమ రోజు మంచి లాభాలు చేకూరతాయి. ఆర్థికంగా బలపడతారు. అయితే ఈ పూర్ణిమ రోజు పొరపాటున కూడా ఎలాంటి వ్యాపార పెట్టుబడులు పెట్టకండి.
మిథునం..
మిథునరాశి వారికి ఆశ్వయుజ పూర్ణిమ శుభాలు చేకూరుస్తుంది. ఆరోగ్యపరంగానూ, సమాజంలో గౌరవ మర్యాదల పరంగానూ, వ్యక్తుల మధ్య సంబంధాల పరంగానూ మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు, పెండింగ్ లో ఉన్న పనులు పూర్తీ చేయడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారు పూర్ణిమ రోజున ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు. వ్యాపారం చేసేవారికి ఆర్థికంగా లాభం కలుగుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి..
ఏదైనా పనిని ప్రారంభించాలని అనుకున్నా మాటి మాటికి వాయిదా పడుతున్నట్టైతే అలాంటి పనులు ప్రారంభించి విజయవంతం చేసుకోవడానికి ఆశ్వయుజ పూర్ణిమ మంచి అవకాశం. ఉద్యోగ, వ్యాపారస్తులకు ఈ రోజు చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
*నిశ్శబ్ద.