చాతుర్మాస్యం వ్రతం గురించి తెలుసా..

చాతుర్మాస్యం సాధారణంగా చాలామంది ఆషాడం నుండి ఈ పేరు ఎక్కువ వింటూ ఉంటారు.  చాతుర్మాస్యం అంటే నాలుగు మాసాలు అని అర్థం.  ఈ నాలుగు మాసాలలోనూ నియమానుసారంగా ఉంటూ ఆ విష్ణు భగవానుడిని పూజించడమే చాతుర్మాస్య వ్రతం అనబడుతుంది. ఈ చాతుర్మాస్య వ్రతంలో కొన్ని పనులు చేయకూడదు. కొన్ని పనులు చేయాలి.  ఇట్లా కొన్నినిబంధనలు ఉన్నాయి.  చాతుర్మాస్య ఫలితం రావాలి అంటే కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే..

చాతుర్మాస్య వ్రతం అంటే ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే ఉద్దాన ఏకాదశి వరకు. శుక్లపక్షం,  కృష్ణపక్షం కలిపి మొత్తం 9 ఏకాదశులు ఇందులో ఉంటాయి.

నాలుగు నెలల పాటు భూశయనం,  విష్ణు ఆరాధన, గో సేవ,  ఇష్టమైన ఆహారాలు తినకుండా వాటిని త్యజించడం, ఎవరినీ దూషించకుండా ఉండటం,  చాతుర్మాస్య వ్రతానికి అనుగుణంగా ఆహార నియమాలు పాటించడం. ముఖ్యంగా ఒక పూట ఆహారం తినాలి.  మధ్యమాంసాలను నివారించడం,   ఊరి పొలిమేర దాటకుండా ఉండటం. ఇవన్నీ చాతుర్మాస్య వ్రతంలో భాగం. ఇవీ పాటించాల్సినవి, పాటించకూడనివి.   ఇంకా చాతుర్మాస్య వ్రతంలో ఒక్కొక్క నెలలో ఒక విధమైన ఆహారాలను మానేయాలని కూడా చెబుతారు. వాటిలో ఆకుకూరలు, పప్పు దినుసులు, పాలు, పెరుగు.. ఇట్లా లిస్ట్ ఉంటుంది.

నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్ష చేయలేని వారు నాలుగు నెలలలో వచ్చే 9 ఏకాదశులు అయినా సరే.. ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ఆరాధారించాలి. లేదంటే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉపవాసం ఉంటూ ఆరాధన చేసుకోవాలి.  బిపి, షుగర్, అనారోగ్య సమస్యలు ఉన్నవారు అయితే ఆహార నియమాల దగ్గర కాస్త మినహాయించుకోవచ్చు. అంటే మధ్యమాంసాలు దూరం పెట్టాలి,  ఉల్లి, వెల్లుల్లి నివారించాలి.  సాత్వికాహారం తీసుకోవచ్చు.

ఈ నియమాలను ఉద్దాన ఏకాదశి వరకు ఎవరైతే పాటిస్తారో వారు చాతుర్మాస్య వ్రతం పూర్తి చేసినట్టు. దీని వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం,  వైకుంఠ ప్రాప్తి లభిస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి.

                                *రూపశ్రీ.


More Kala Gnanam