ఓం శ్రీం హ్రీం... బీజాక్షరాల మహిమ

Om Shreem Hreem Beejaksharas

 

పూజా సమయంలో ఓం శ్రీం హ్రీం... తదితర బీజాక్షరాలను వల్లిస్తాం కదా. అవి మహా మహిమాన్వితమైనవి. ప్రతి అక్షరమూ దైవాన్ని ఉచ్చరించడమే. ఈ బీజాక్షరాలను స్మరించడం ద్వారా ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించినట్లవుతుంది. మనో సంకల్పంతో ఈ బీజాక్షరాలను ఉచ్చరిస్తే అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆయా అక్షరాల అర్ధాలు కింది విధంగా ఉన్నాయి.

 

ఓం - మహాకాల, కాలవక్త్ర, పరమాత్మ

శ్రీం - లక్ష్మి, శూలిని, చండీశ

హ్రీం - అద్రిజ, రౌద్రి, భూతేశి, భువనేశ్వరి

క్రీం - కాళి, ద్రావణ, క్లేదన

హుం - నిరంజన

ఐం - వాగ్భవ, బుద్ధివర్ధన, ఉన్మత్త భైరవి

షట్ - షడిత్యస్త్ర

క్రోం - జ్వాలాగ్ని, వ్యాపక, అంకుశ

క్లీం - త్రిమూర్తి, కామ, మన్మధ

హ్రౌం - జ్యోతి

ద్రాం - యమ, చండ, దత్తాత్రేయ

దుం - దుర్గా

ఫ్రేం - దూమిని, ఊర్ధ్వకేశి


Powerful Beejaksharas, hindu puja and beejaksharas, divine Om Shreem Hreem Beejaksharas, Beejaksharas give health and wealth, divine mantraksharas Om Shreem Hreem


More Enduku-Emiti