చెట్లు ప్రేమిస్తాయి తెలుసా?
Plants and feelings
జీవులు అరుస్తాయి, తమ భావాలను వ్యక్తం చేస్తాయి కనుక వాటికి మాత్రమే ప్రాణం ఉంది అనుకుంటాం. కానీ చెట్లకూ ప్రాణం ఉందని, వాటికీ భావాలు ఉంటాయని, స్పందనను, ప్రతిస్పందనలు, అనుభూతులు ఉంటాయని ప్రాచీన గ్రంధాలు తెలియజేస్తున్నాయి.
మొక్కల గురించి ప్రస్తావిస్తూ మనువు ''అంతస్సంజ్ఞా భవంత్యేతే సుఖదుఃఖ సమన్వితః'' అన్నాడు.
అంటే తమకు బాధగా ఉందని లేదా సంతోషంగా ఉందని బయటకు చెప్పకపోవచ్చు కానీ లోపల మాత్రం సుఖదుఃఖాలను అనుభూతి చెందుతాయి అని భావం.
''మనుజానాం బాహ్యాంతరేం ఇంద్రియవతాం
సుఖదుఃఖమనుభవతాం పంచ మహాభూత
వికార సముదయాత్మక శరీరణాం ఇవ వృక్షాణాం
సుఖదుఃఖ జనన మరణంచేతి స్వాభావిక మితిబోద్ధవ్యం''
ఈ శ్లోకం మహాభారతంలో ఉంది. భ్రుగు మహర్షి భరద్వాజునితో మాట్లాడే సందర్భంలో ఈ ప్రసక్తి వస్తుంది. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే -
మొక్కలక్కూడా మనుషుల్లాగే అనుభూతులు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో కష్టనష్టాలను అనుభూతి చెందే మనసు ఉంది. మన శరీరం ఎలా అయితే పంచభూతాలతో నిర్మితం అయిందో మొక్కలు కూడా అలాగే రూపొందాయి. మనలాగే చెట్లకీ కష్టం, సుఖం తెలుస్తుంది.జననం, మరణం ఉంటుంది.
అదీ సంగతి. చిన్న మొక్క, పాకే లత, పెద్ద చెట్టు అనే తేడా లేకుండా తరువులన్నిటికీ సుఖదుఃఖాలు అనుభూతమౌతాయి. ఈ సంగతి మన జగదీష్ చంద్రబోస్ రుజువు చేశారనుకోండి. మరెందరో శాస్త్రవేత్తలు మొక్కలమీద విస్తృత పరిశోధనలు చేసి అనేక సంగతులు చాటిచెప్పారు. కానీ ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే మహర్షులు తమ దార్శనిక దృష్టితో ఇలాంటి అమూల్య విషయాలను అందించారు. మహర్షులు, దార్శనిక కవీంద్రులు చెప్పిన ఈ గొప్ప వాస్తవాలు మన ప్రాచీన గ్రంధాల్లో ఆయా సందర్భాల్లో లిఖితమై ఉన్నాయి.
తమకు నీళ్ళు పోసి సంరక్షించే వారిని, ప్రేమగా స్పృశిస్తూ ఆత్మీయంగా మెలిగేవారిని, చెట్లు స్నేహితులుగా భావించి, పులకిస్తాయి. ఆకులు, పూవులు తుంచి, కొమ్మలు విరిచి, చెట్లు పీకేవారిని శత్రువులుగా భావిస్తాయి. అంతేకాదు, ఒకసారి తమకు దగ్గరగా వచ్చినవారిని మరోసారి, ఇంకోసారి గుర్తుపడతాయి. ఎవరు మేలు చేస్తారో, ఎవరు హాని చేస్తారో గ్రహిస్తాయి. చెట్లు తమకు హాని చేసేవారు ఆ పరిసరాల్లోకి వస్తే చాలు భయపడతాయి. తమ ఆలనాపాలనా చూసేవారు దగ్గరికి రాగానే సంతోషిస్తాయి. ప్రేమ భావాన్ని వ్యక్తపరుస్తూ తేటగా కదలాడుతాయి. అలాగే గిల్లి, తుంచి ఇబ్బంది పెట్టేవారు సమీపానికి వస్తుంటే ఆందోళన చెందుతాయి.
Plants feel and love, plants feel touch, friendly plants, feelings of plants, plants feel happy, trees experience sadness