పత్రీజీ ధ్యాన మహాయాగంలో 7వ రోజు వేద పఠనం
అందిరికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని పంచుతూ కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పత్రీజీ ధ్యాన మహా యాగం అత్యంత వైభవంగా జరుగుతోంది. యాగంలో 7 వ రోజు డిసెంబర్ 27న నిర్వహించిన యోగా, వేదపఠనం, సంగీత నాధ ధ్యానం కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యోగా నిపుణులు వెంకటేశ్ యోగా ఆసనాలు, ప్రాణాయణం, ముద్రలు గురించి ధ్యానులకు చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే చైతన్య, మాస్టర్ తేజాలు వేదపఠనం అధ్బుతంగా నిర్వహించి ధ్యానులకు చక్కటి వేద జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరోవైపు సంగీత నాధ ధ్యానం కార్యక్రమం ధ్యానులను విశేషంగా అలరిస్తుంది.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో అధ్బుతంగా జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం 7 వరోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రతి రోజు బ్రహ్మర్షి పత్రీజీ, స్వర్ణమాల పత్రీ వీడియా సందేశాలు ధ్యానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పత్రీజీ ధ్యానయాగంలో 7వ రోజు డిసెంబర్ 27న బ్రహ్మర్షి పత్రీజీ, స్వర్ణమాల పత్రీ అందించిన వీడియా సందేశాలు, ధ్యానులను అధ్బుతమైన జ్ఞానాన్ని అందించాయి.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో అత్యంత వైభవంగా జరుగుతోంది పత్రీజీ ధ్యాన మహా యాగం. ఈ కార్యక్రమంలో 7 వ రోజు డిసెంబర్ 27 న నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కడ్తాల్ మండలం జెడ్పీటీసీ సభ్యులు ధశరత్ నాయక్ పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు. తాను 1999 సంవత్సరంలో ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాయని జైపాల్ యాదవ్ తెలిపారు. పత్రీజీ తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదలేసి ప్రపంచంలో శాంతి కోసం విశేషంగా కృషి చేస్తూ కడ్తాల్ లో మహేశ్వర మహా పిరమిడ్ ను స్థాపించారని కొనియాడారు. గతంలో మాంసాహారిగా ఉన్న తాను పత్రీజీ బోధనలతో శాకాహారిగా మారానని తెలియజేసారు. ఈ కార్యక్రమాన్నిఅధ్బుతంగా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను ప్రశంసించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో అధ్బుతంగా జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగంలో ట్రాత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని తమ సందేశాల ద్వారా యువతలో మంచి స్పూర్తిని కలిగిస్తున్నారు. పత్రీజీ ధ్యాన మహా యాగంలో 7 వ రోజు డిసెంబర్ 27 న నిర్వహించిన ఈ కార్యక్రమంలో వసుదైక ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేరం నాగేంద్ర పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు అధ్బుతమైన జ్ఞానం లభిస్తుందని తెలిపారు. బుద్దుడు బోధించిన ఆనసానసతి ధ్యానాన్ని పత్రీజీ అందిరికీ అర్ధమయ్యే విధంగా బోధించారని తెలిపారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలియజేసారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పత్రీజీ ధ్యాన మహా యాగం అధ్బుతంగా జరుగుతోంది. యాగంలో 7 రోజు డిసెంబర్ 27న నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల PSSM జిల్లా అధ్యక్షులు పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో PSSM ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చెన్నకేశవరావు, PSSM కృష్ణా జిల్లా అధ్యక్షులు రాజకుమారి, విజయనగరం జిల్లా పిరమిడ్ మాస్టర్లు తమ బృందాలతో కలిసి వచ్చి తమ సందేశాలు ఇచ్చారు. తమ జిల్లాలో ధ్యానం విస్తరణకు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా, మెదక్ జిల్లా, మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా, నారాయణపేట్, నిర్మల్ జిల్లాల PSSM అధ్యక్షులు పాల్గొని తమ జిల్లాలో ధ్యాన విస్తరణకు చేస్తున్న, చేపపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం 7 వరోజు విజయవంతంగా కొనసాగింది. డిసెంబర్ 27న నిర్వహించిన కార్యక్రమంలో పిఠాధీపతి శ్రీరాజరాజేశ్వర నంద స్వామి పాల్గొని తన సందేశాన్ని ఇచ్చారు. విశ్వమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని తెలిపారు. మన గురించి మనం తెలుసుకోవడానికి ధ్యాన మొక్కటే మార్గమని చెప్పారు. ధ్యానం చేసే ప్రతి వ్యక్తి ఆత్మస్వరూపులే అని తెలియజేసారు. ధ్యాన సాధన చేస్తే మనుసు స్థిరత్వం పొందుతుందన్నారు. ధ్యానాన్ని అందిరికి చేరువ చేసి గొప్ప వ్యక్తి ప్రతీజీ అని కొనియాడారు. అనంతరం శ్రీరాజరాజేశ్వర నంద స్వామిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో దిగ్విజయంగా జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం లో వివిధ అంశాలపై నిర్వహిస్తున్న ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమం అధ్బుతంగా కొనసాగుతొంది. పత్రీజీ ధ్యాన మహా యాగం లో 7వరోజు డిసెంబర్ 27న Third Eye అనే అంశంపై నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎం. శ్రీధర్, ధ్వారకానాథ్, రామాచారి, స్వర్ణలత, అల్లాభక్షు, గీతాబాలనీ పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు. Third Eye అంటే ఏమీటి, ధ్యానం ద్వారా Third Eye ని ఎలా జాగృతం చేయాలి, Third Eye తో ఏమీటి ప్రయోజనాలు, అనే విషయాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు అధ్బుతమైన జ్ఞానాన్ని అందించారు.
