ప‌త్రీజీ ధ్యాన మ‌హాయాగంలో జ‌రిగే కార్య‌క్ర‌మాల వివ‌రాలు


కడ్తాల్ మండలం అన్మాస్ పల్లి గ్రామ స‌మీపంలోని  కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ లో ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగం-3 కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగాప్రారంభ‌మైంది. వివిధ ధ్యాన, జ్ఞాన కార్య‌క్ర‌మాల‌తో ఎంతో ఉత్సాహంగా కొన‌సాగుతుంది. డిసెంబ‌ర్ 22న   జ‌రిగే  ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగంలో సంగీత నాధ ధ్యానం, అలాగే ప‌లువురు సీనియ‌ర్ మాస్ట‌ర్లు, ప్ర‌ముఖ‌ల‌  సందేశాల ఉండ‌నున్నాయి. డిసెంబ‌ర్ 22న ఉద‌యం 4 గంట‌ల‌కు యోగా, మెడిటేష‌న్ తో కార్య‌క్ర‌మాలు మొద‌లుకానున్నాయి.  ఉద‌యం 4 గంట‌ల‌కు  యోగా మాస్ట‌ర్ వెంక‌ట‌శ్ చే యోగా కార్య‌క్ర‌మం ఉండ‌గా,  అనంత‌రం 4 గంట‌ల 50 నిమిషాల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు మాస్ట‌ర్లు చైత‌న్య‌, తేజ‌ల‌చే వేదాపఠ‌నం నిర్వ‌హించ‌బ‌డును.

 ఆ త‌ర్వాత 5 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు బ్ర‌హ్మ‌ర్షి ప‌త్రీజీ సందేశం, ఫ్లూట్ మాస్ట‌ర్ గణేష్, సంజ‌య్ కింజిల బృందాల‌చే  సంగీతం నాధ ధ్యానం నిర్వ‌హించ‌బ‌డును. 8 గంట‌ల నుంచి 8 గంట‌ల 10 నిమిషాల వ‌ర‌కు బ్ర‌హ్మ‌ర్షి ప‌త్రీజీ సందేశం, అలాగే 8 గంట‌ల 10 నిమిషాల నుంచి 8 గంట‌ల 15 నిమిషాల వ‌ర‌కు ప‌రిణిత ప‌త్రీ సందేశం ఉండ‌నున్నాయి.  8 గంట‌ల 25 నిమిషాల నుంచి 8 గంట‌ల 30 నిమిషాల వ‌ర‌కు శ్రీహ‌రి శ‌ర్మ సందేశం ఇవ్వ‌నున్నారు. అనంత‌రం 10 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు PSSM నూత‌న జిల్లా అధ్య‌క్షులు ఆనంద్ దాలియా, జ‌గ‌దీశ్ రెడ్డి, కిష‌న్ రెడ్డిల సందేశాలు ఇవ్వ‌నున్నారు. 11 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు సీనియ‌ర్ మాస్ట‌ర్లు, గ్లోబ‌ల్ మాస్ట‌ర్ల సందేశాలు ఉండనున్నాయి. స్వాధ్యాయ యోగా శ్రీనివాస్ రెడ్డి, లీలా లక్ష్మారెడ్డి సందేశాలు ఉంటాయి. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 1. 30 వ‌ర‌కు సీనియ‌ర్ మాస్ట‌ర్ల‌చే డూ ఆర్ డై అనే అంశంపై  ప్యానెల్ డిస్క‌ష‌న్ ఉంటుంది. ఇందులో మారం శివ‌ప్ర‌సాద్, ప‌ల‌మ‌నేరు బాలాజీ, మెగా ముర‌లి, రాయ‌జ‌గ‌ప‌తి రాజ్,  ల‌క్ష్మ‌ణ్, ఆగి భీమ‌య్య లు పాల్గొంటారు.  2.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వ‌ర‌కు PSSM Cultural, PYMA కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. Kottamma thalli kolatam బృందం ప్ర‌ద‌ర్శ‌న‌, అలాగే మ‌నోజ్ఙ చే కూచిపూడి నృత్యం నిర్వ‌హించ‌బ‌డును. 4. 30 నిమిషాల నుంచి 5.30 నిమిషాల వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా గ‌ల PSSM Projects కు సంబంధించిన ప్ర‌జంటేష‌న్ ఉంటుంది. లైట్ వ‌ర్క‌ర్స్ రంజిత‌, ఆర్మూర్ పిర‌మిడ్- గంగారాం రెడ్డి, ఓమేగా పిర‌మిడ్- శ్రీహ‌రి శ‌ర్మ, ప‌త్రీజీ మ‌హిళ మౌనం ధ్యాన‌, జ్ఞాన యాగం రేవ‌తి,  ప్ర‌కృతి వ్యాలి- రాయ్ జ‌గ‌ప‌తి రాజులు ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌నున్నారు. సాయంత్రం 5. 30 నిమిషాల నుంచి 6. 30 వ‌ర‌కు ప‌త్రీజీ సందేశం, హిందూస్తానీ ప్లూట్ మాస్ట‌ర్ Sudhamsu katti చే సంగీ నాద ధ్యానం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌బ‌డును.  6. 30 నిమిషాల నుంచి 7 గంట‌ల వ‌ర‌కు ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగంలో పాల్గొనే ప్ర‌ముఖుల పేర్ల‌ను పిర‌మిడ్ స్పిరుచ్యువ‌ల్ హైద‌రాబాద్  ట్ర‌స్ట్  చైర్మ‌న్ విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి నిర్ణ‌యించ‌నున్నారు. 7 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌రకు ఆధ్మాత్మిక గురువుల ప్రసంగాలు ఉంటాయి. జ్ఞానవ‌త్సల స్వామి త‌న సందేశాన్ని ఇవ్వ‌నున్నారు. 8 గంటల నుంచి 9 గంట‌ల వ‌రకు పిల్ల‌లు, సెల‌బ్రిటీలు, క‌ళాకారుల‌చే సాంస్కృతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బ‌డుతాయి.



 


More Others