హనుమంతుడికి యాలకులు నైవేద్యంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసా!


భారతీయులకు హనుమంతుడు పెద్ద ధైర్యం.  హనుమంతుడిని పూజిస్తే అన్ని భయాలు తొలగిపోతాయి. అలాగే సంతోషం కోసం, విజయం కోసం కూడా హనుమంతుడిని పూజిస్తారు.  బుద్ధిబలం కోసం, దైర్యం కోసం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ హనుమంతుడినే పూజిస్తారు. హనుమంతుడిని పూజించినప్పుడు చాలా మంది తమలపాకుల మాల వేయడం, తమలపాకులను అలంకరించడం చేస్తారు. అలాగే వడమాల సమర్పించడం చూసి ఉంటారు.  అంతేకాకుండా హనుమంతుడికి వివిధ రకాల నైవేద్యాలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు. కానీ హనుమంతుడికి యాలకులను నైవేద్యంగా పెడతారని చాలామందికి తెలియదు. అసలు హనుమంతుడికి యాలకులను నైవేద్యంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

హనుమంతుడికి యాలకులను కూడా నైవేద్యంగా పెడతారట.  యాలకులను నైవేద్యంగా పెట్టడం వల్ల పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయని నమ్ముతారు.  అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు.

హనుమంతుడికి యాలకులను సమర్పించడం వల్ల పేదరికం నశిస్తుందట.  అలాగే ధనవంతులు కావడానికి మార్గం కూడా సుగమం అవుతుందట.

యాలకులను  సమర్పిస్తే జీవితంలో ఆనందం చేకూరుతుందని చెబుతారు.  మరీ ముఖ్యంగా శని దేవుడి వల్ల కష్టాలు,   ప్రభావాలు తొలగిపోతాయని చెబుతారు.

ఉద్యోగాలలో లేదా పని చేస్తున్న ప్రదేశాలలో పురోగతి రావాలంటే ఆకుపచ్చ యాలకులను హనుమంతుడికి సమర్పించాలి.  సమర్పించిన తరువాత ఆ యాలకులను భద్రంగా ఉంచుకోవాలట.  దీని వల్ల జీవితంలో కేరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుందని చెబుతారు.

                                 *రూపశ్రీ.


More Hanuman