ఏ నక్షత్రశాంతికి ... ఏ వృక్షపూజ ?

Plants and Trees of Your Nakshatras Nakshatra Puja, Nakshatra Shanti Puja, Nakshatras Effects, Pujas of Planets

గ్రహ-నక్షత్రాలు అనుకూలంగా లేకపోతే మనిషి జీవితం కష్టాలతో గడుస్తుంది. ఇలా ప్రతికూలమైన నక్షత్రాలను శాంతింప చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రత్నధారణ, పూజ, హవనం, యజ్ఞం వంటివి. నక్షత్రశాంతికి మరొక ప్రత్యామ్నాయం ఉంది. వివిధ చెట్లను పూజించటంవల్ల నక్షత్ర-గ్రహశాంతి జరిగి వ్యక్తి జీవితంలోని సమస్యలు ఒకటొకటిగా తొలగిపోతాయి.
అశ్విని         ఈ నక్షత్ర వృక్షం కుచల. ఈ నక్షత్రంలో జన్మించినవారు కుచల చెట్టును నిత్యం పూజించాలి. చెట్టువేరుకు నీరుపోసి, అక్షతలు చల్లి, ప్రదక్షిణ చేయాలి.
భరణి         ఈ నక్షత్ర జాతకులు ఉసిరిక చెట్టుని నిత్యం జలంతో తడిపి ప్రదక్షిణ చేయాలి. పొరపాటున కూడా ఈ చెట్టు దగ్గర మూత్రవిసర్జన వంటివి చేయకూడదు.
కృత్తిక         ఈ నక్షత్ర జాతకులు మేడివృక్షాన్ని నిత్యం నీళ్ళు, అక్షతలతో ప్రదక్షిణ చేయాలి.

Plants and Trees of Your Nakshatras Nakshatra Puja, Nakshatra Shanti Puja, Nakshatras Effects, Pujas of Planets

రోహిణి             ఈ నక్షత్రంలో జన్మించినవారు నేరేడు చెట్టు మొదట్లో చెక్కర, బియ్యం లేదా గోధుమపిండి వేసి ఒక గ్లాసు నీరుపోసి ప్రదక్షిణ చేయాలి.
మృగశిర         ఈ నక్షత్ర జాతకులు బుధవారంరోజు జలంతో రేగుచెట్టుని పూజించటం వల్ల సుఖ సమృద్ధి లభిస్తుంది.
ఆర్ద్ర         ఈ నక్షత్రంలో జన్మించినవారు కృష్ణకమలాన్ని పూజించటం లేదా దీంతో దేవతారాధన చేయటం వల్ల సుఖం కలుగుతుంది.
పునర్వసు         ఈ నక్షత్ర జాతకులు తుమ్మచెట్టును ఆరాధించాలి. చెట్టు మొదట్లో నీరుపోసి పూజ చేయాలి.

Plants and Trees of Your Nakshatras Nakshatra Puja, Nakshatra Shanti Puja, Nakshatras Effects, Pujas of Planets

పుష్యమి         ఈ నక్షత్రంలో జన్మించినవారు రావిచెట్టుకు నీరుపోసి నిత్యం ప్రదక్షిణం చేయటం శుభకరం.
ఆశ్లేష             ఈ నక్షత్ర జాతకులు చంపా వృక్షానికి ప్రతిరోజూ నీరుపోసి పూజించాలి.
మఖ        ఈ నక్షత్రంలో జన్మించినవారుమర్రిచెట్టును పూజించినట్లయితే విశేష ఫలప్రదం లభిస్తుంది.. మర్రిచెట్టు సహజంగానే పూజనీయ వృక్షం. అందరూ పూజిస్తారు.

Plants and Trees of Your Nakshatras Nakshatra Puja, Nakshatra Shanti Puja, Nakshatras Effects, Pujas of Planets

పూర్వఫల్గుణి     ఈ నక్షత్రంలో జన్మించినవారు అశోకవృక్షం ఆకులు ఇంటి ద్వారానికి కట్టుకోవటం, వృక్షాన్ని పూజించటం వల్ల సుఖం లభిస్తుంది.
హస్త         ఈ నక్షత్ర జాతకులు ఇంట్లో మల్లెచెట్టు నాటి పూజించటం మంచిది. దీనివల్ల వ్యాపారవృద్ధి చెందుతుంది.
చిత్త, మూల     ఈ నక్షత్రాలలో జన్మించినవారు బిల్వవృక్షాన్ని పూజించాలి. ఇది శివునికి అత్యంత ప్రీతికరం.
స్వాతి         మద్దిచెట్టునీ అర్జునవృక్షం అంటారు. ఈ నక్షత్ర జాతకులు మద్ది వృక్షాన్ని సేవించాలి. వీలుకాకపోతే మద్ది బెరడునైనా దగ్గర ఉంచుకోవాలి.

Plants and Trees of Your Nakshatras Nakshatra Puja, Nakshatra Shanti Puja, Nakshatras Effects, Pujas of Planets

జ్యేష్ఠ                  ఈ నక్షత్రంలో జన్మించినవారు వేపచెట్టుని రోజూ నీటితో మొదలు తడిపి సేవించాలి. ఆదివారం నువ్వులు, చెక్కెర మొదట్లో వేయాలి. 
పూర్వాషాడ, శ్రావణ     ఈ రెండు నక్షత్రాల జాతకులు జిల్లేడుచెట్టును సేవించాలి. బుధవారం చేసే పూజ అధిక ఫలప్రదం.
ఉత్తరాషాడ                
ఈ నక్షత్రంలో జన్మించినవారు కదంబ వృక్షానికి ప్రతిరోజూ నీళ్ళు పోయాలి.
ధనిష్ఠ                     ఈ నక్షత్రంలో జన్మించినవారు కొబ్బరిచెట్టును పూజించటం శుభం. కానీ, ఇది అన్నిచోట్లా లభించదు. కాబట్టి వీలులేనివారు పూజాగృహంలో కొబ్బరికాయను ఉంచుకుని పూజించాలి.

Plants and Trees of Your Nakshatras Nakshatra Puja, Nakshatra Shanti Puja, Nakshatras Effects, Pujas of Planets

శతభిష
        ఈ నక్షత్రంలో జన్మించినవారు మామిడిచెట్టును పూజించటం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది.
పూర్వాభాద్ర
             ఈ నక్షత్రంలో జన్మించినవారు కదంబ వృక్షాన్ని అక్షతలతో పూజించాలి.
ఉత్తరాభాద్ర               ఈ నక్షత్రంలో జన్మించినవారు గోరింటచెట్టుని అక్షతలతో పూజించాలి.
రేవతి                      ఈ నక్షత్రంలో జన్మించినవారు రేగుచెట్టుకి నీరుపోసి పూజించాలి.

More Enduku-Emiti