">ఆషాడమాసంలో శుభకార్యాలు చేయకూడదా ?
ఆషాడమాసాన్ని శూన్యమాసం అంటారు. అందువల్లే ఈ మాసంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు చేయరు. ఈ మాసంలో వచ్చే విశేషమైన తిధి ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనిని తొలిఏకాదశి అని కూడా అంటారు. విష్ణు ఆరాధకులకు ప్రముఖమైన రోజు. ఏకాదశి నుంచి పండుగలు మొదలవుతాయి. తొలి ఏకాదశి నుంచే చాతుర్మాస్యవ్రతం ప్రారంభం అవుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటారు.
తెలంగాణలో బోనాల పండుగ కూడా ఆషాఢంలోనే మొదలవుతుంది. పూరిజగన్నాథుడి రథ యాత్రం కూడా ఈ మాసంలోనే జరుగుతుంది. ఈ మాసంలోనే సకల జీవులకు ఆహారం అందించే ఆదిశక్తిని శాకంబరీదేవిగా కొలుస్తారు.
కొత్తగా పెళ్లైన అమ్మాయిలకు ఆషాఢమాసంలో పుట్టింటింకి తీసుకువస్తారు. ఈ నెలలో ఆడవారు తప్పకుండా చేతులకు గోరింటాకు పెట్టుకోవడం ఆచారంగా వస్తోంది.