మండలదీక్షలో గూడార్థం ఏమిటి?

 

So many peoples are taken Mandala Deeksha but do you know why do take Ayyappa Mandala Deeksha.

 

 

అయ్యప్ప మండలదీక్ష, భవానీమాత మండలదీక్ష, హనుమాన్ మండలదీక్ష, శివ మండలదీక్ష ఇలా అనేక రకాల మండల దీక్షలు నేడు ఆచరిస్తున్నారు. ఈ కలియుగంలో మనలను ఉద్దరించడానికి భగవంతుడు ఎన్నో రూపాలను ధరించాడు. అటువంటి అవతారమే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి! ఆ స్వామి కరుణాకటాక్షాలకోసం దీక్ష పూని, ఓ మండలంరోజుల (48 రోజులదీక్ష) పాటు ఆ దీక్షను కొనసాగించి, అనంతరం ఇంట్లో పూజ చేసి, అఖండదీపాన్ని వెలిగించి, ఆత్మదీప దర్శనం కోసం, ఇరుముడిని ధరించి శబరిమలయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కొంతమంది అయ్యప్ప స్వామికి మండలదీక్ష ఎందుకు? ఒకరోజు, ఐదురోజుల దీక్ష కూడ చేయవచ్చుగా అని అడుగుతున్నారు. అడగడమేకాదు, ఆ పద్ధతుల్లో దీక్షలు చేపట్టి  జ్యోతి దర్శనానికి బయలుదేరుతున్నారు. మండలదీక్షలో ఓ గూడార్థం ఉంది. మనిషి పుడుతున్నప్పుడు, అప్పుడున్న నక్షత్రస్థితి, రాశి స్వభావం, ఇంకా అప్పటి గ్రహస్థితులు, ఆ మనిషి భవిష్య జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ దృష్టిలో చూసినపుడు,

నక్షత్రాలు – 27

రాశులు – 12

గ్రహాలు -  09

వీటి ప్రభావం నుంచి తప్పుకుని, భగవానుని పాదపద్మాలను ఆశ్రయించి, ఆత్మసాక్షాత్కారమనే జ్యోతి దర్శనానికే 48 రోజుల దీక్ష చేస్తున్నాం. ఇదే మండలదీక్షలోని అంతరార్థం. అందుకే మండలకాలంపాటు దీక్ష!


More Enduku-Emiti