కునుకు కరువైన తిరుమల వెంకన్న

(Lord Venkateswara in Tirumala)

 

సాధారణంగా దేవాలయాలను ఉదయం అయిదు గంటలకు తెరిచి రాత్రి ఎనిమిది గంటలకు మూస్తారు. ఈ వేళల్లో కొద్దిగా మార్పుచేర్పులు ఉన్నప్పటికీ మొత్తానికి రాత్రివేళ అంతా గుడి ద్వారాలు మూసే ఉంటాయి. కానీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయం మాత్రం అందుకు విరుద్ధం. దేశం నలుమూలల నుండి, ఇతర దేశాల నుండి రోజుకు లక్షన్నరకు పైగా భక్తులు తిరుమల వస్తారు. రాత్రీపగలూ స్వామివారి దర్శనం కోసం భక్తులు పడిగాపులు పడుతూనే ఉంటారు. అందువల్ల తిరుమల వెంకన్న ఆలయాలు దాదాపుగా తెరిచే ఉంటాయి. మరి తిరుమల వెంకన్నకు విశ్రాంతి ఎప్పుడు, కునుకు తీసేదెప్పుడు?

 

వేకువజామున రెండున్నర సమయంలో తిరుమల వెంకన్నను మేల్కొలిపుతూ సుప్రభాత సేవ చేస్తారు. అది మొదలు శుద్ధి, అర్చన, తోమాలసేవ, కొలువు, సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన, నైవేద్య సమర్పణలు, రాత్రి కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి. చివరికి అర్ధరాత్రి రెండు గంటల వేళ పవళింపుసేవ ముగుస్తుంది. రోజులో మొత్తం 22 గంటల పాటు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ వరుసన ఏడుకొండల వెంకన్న కు లభించే ఏకాంతం ఎంతసేపు? స్వామివారు కునుకు తీసి విశ్రాంతి తీసుకునే సమయం ఎంత? పత్తుమని౮ పావుగంట సేపు కూడా ఉండదు.

 

1932లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తర్వాతనే పరిస్థితి ఇలా మారింది. అంతకుముందు దేశంలోని ఇతర దేవాలయాల మాదిరిగానే తిరుమల వెంకన్న ఆలయాన్ని కూడా సూర్యోదయ వేళ తెరిచి, సూర్యాస్తమయ వేళ మూసేవారు.

 

తిరుమలలో స్వామివారి ఆలయ తలుపులు మూసినంత సేపు పట్టదు, మళ్ళీ తెరవడానికి. భక్తుల రద్దీ నానాటికీ పెరుగుతోంది గనుక భవిష్యత్తులో వెంకన్న ఆలయ ద్వారాలు మూసి ఉంచే ఆ పావుగంట సమయాన్ని ఇంకా కుదించినా ఆశ్చర్యం లేదు.

 

Lord Venkateswara in Tirumala, Ekanta Seva before closing doors, Tirumala Temple closing time, Tirumala Temple doors closes at, Tirumala Temple doors opens at


More Venkateswara Swamy