పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం - 24

Kalagnanam - 24

 

“బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్షమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పోగు తాకుతుంది. కంచికామాక్షి నేత్రాల కన్నీరు ఒలుకుతుంది. కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది. బనగాపల్లెలో నా ప్రథమ భక్తురాలు అచ్చమ్మవంశము సర్వనాశనమై, వారి వంశం అంతరించిపోతుంది. నారాయణమ్మ వంశస్తులే మఠాధిపతులవుతారు. నువ్వు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు’’ అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టారు.

 

సమాధికి ముందు కాలజ్ఞానము

“నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలతాయి. ఏడు గ్రామాలకు ఒక గ్రామమవుతుంది. అంటే ప్రాణనష్టం జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి. ధూమకేతువు అనే నక్షత్రం పుడుతుంది. చిన్న చిన్న పాలెగాళ్ళ సామ్రాజ్యాలు అంతమైపోతాయి. ఎర్రబోయీల జీవన విధానాలను వీరు అనుసరిస్తారు.

 

విరోధి నామ సంవత్సరంలో లింగాలపాటిలో ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి ‘అంకమ్మ’ అనే పేరుతో లోకమంతా సంచరించి, దగ్ధం చేసి తిరిగి నందికొండ వస్తుంది.

పింగళనామ సంవత్సరంలో ధూమకేతు పుట్టి అదృశ్యమవుతుంది.

గొప్ప దేశములు, దేవాలయములు నశిస్తాయి. సిద్దాత్రి నామ సంవత్సరాన అద్దంకి సీమలో భూమి వణుకుతుంది.

రౌద్రినామ సంవత్సరాన ఆషాఢమాసంలో, మహా ధ్వని చేస్తూ నక్షత్రాలు రాలుతాయి. అప్పుడు పర్వత గుహల్లో ఉదక పానీయములు తయారు చేస్తారు. బంగాళ దేశంలో కాళి ప్రత్యక్షమై శక్తి రూపియై రక్తం గటగటా తాగుతుంది. బెజవాడ గోలకొండ అంత పట్నమవుతుంది.

మేఘం, అగ్నిసర్పాకారంగా వచ్చి ధ్వనులు చేస్తాయి. పిడుగులు, శ్రీశైలాన నంది చెరువులో ఆరెదొండచెట్టు పుడుతుంది. భ్రమరాంబ గుడిలో మొసళ్ళు చొరబడటంతో గుడి పాడయి పోయెను. ఈశాన్యంలో పాతాళగంగ కృంగి మల్లిఖార్జునుడు అదృశ్యమైపోతాడు.

పాతాళ గంగలో శాపవశాత్తూ వున్న చంద్రగుప్తునికి కలికి అవతార పురుషుని పాదం సోకి, శాప విముక్తుడవుతాడు. ఆకాశాన విషగాలి పుట్టి, ఆ గాలి వల్ల, రోగాల వల్ల జనులు నశిస్తారు.

తిరుపతి వేంకటేశ్వరుని గుళ్ళో మొసళ్ళు ప్రవేశించి, మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి వుంచుతారు. గరుడధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి. తిరువళ్ళువరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి.

 

ఆకాశాన మూడు నక్షత్రములు ఉదయించి, కన్పించకుండానే అదృశ్యమవుతాయి. ఆనంద నామ సంవత్సరంలో శ్రీశైల మల్లిఖార్జునుడు ఉత్తరాన వింధ్య పర్వతాలకు పోయి, నిజ రూపం చూపుతాడు. అప్పుడు ఆ రాజ్యం తల్లడిల్లిపోతోంది. దేశాన కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి. అన్ని కులాలవారు మద్యపాన ప్రియులవుతారు.

 

రాజులకు రాజ్యాలు ఉండవు. వ్యవసాయ వృత్తినే అవలంభిస్తారు. అన్ని జాతుల వారు వింత వింత వస్త్రాలు ధరిస్తారు. బ్రాహ్మణులకు పీటలు, యితరులకు మంచాలు వస్తాయి. బ్రాహ్మణులు విదేశీ విద్యలు, విజ్ఞానానికి భూములను అమ్ముకుంటారు. ప్రభుత్వ బంట్లుగా ఉద్యోగాలు చేస్తూ బతుకుతారు. వానిలో కూడా బ్రాహ్మణులకు ఆధిక్యత లేకపోగా అన్య కులాల వారే ఆధిక్యత పొంది వారి కింద పని చేస్తారు. జీవనోపాధి కోసం ఏ వృత్తినయినా చేసే స్థితికి వస్తారు. పౌరోహిత్యం కూడా కొనసాగక బ్రాహ్మణులు బాధలు పడతారు. విదేశీ విజ్ఞానం విద్యలు నేర్చుకుంటారు. ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు’’

 

Life story of Veerabrahmendra swamy part 24, Potuluri predictions and his autobiography, Potuluri Veerabrahmendra Swamy in history, Brahmamgari Kalagnanam jeevitha charitra part 24, predictions about world by potuluri


More Kala Gnanam