కార్తీక మాసంలో తులసి మొక్క వద్ద ఈ వస్తువులు ఉంటే అరిష్టమే..!

 

భారతీయ హిందూ ధర్మంలో తులసి మొక్కను దైవంతో సమానంగా పూజిస్తారు. కొన్ని ప్రత్యేక రోజులలో తులసి ఆరాధనకు ప్రాముఖ్యం ఇచ్చారు. ముఖ్యంగా వివాహం అయిన స్త్రీలు తులసిని పూజించడం వల్ల వారి దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని,  సుమంగళిగా ఉంటారని అంటారు.  ఇక కార్తీక మాసంలో దీపారాధన,  శివుడి దర్శనం,  విష్టువాలయ దర్శనం,  జపం, దానం,  ఉపవాసం మొదలైన వాటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తులసి దగ్గర దీపారాధన, తులసి పూజకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. తులసి మొక్కలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అంటారు.   అయితే తులసి మొక్క దగ్గర కొన్ని వస్తువులు ఉంచితే మాత్రం ఆ ఇంటికి అరిష్టం అని అంటున్నారు పెద్దలు,  పండితులు.. తులసి దగ్గర ఉంచకూడనివి ఏంటో తెలుసుకుంటే..


పాదరక్షలు..

తులసి మొక్క దగ్గర కానీ తులసి ఉన్న ప్రాంగణంలో కానీ పాద రక్షలు అయిన చెప్పులు, బూట్లు వంటివి ఉండకూడదు.  ఇవి తులసి మొక్కకు దగ్గరా ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయట.  లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలి వెల్లిపోతుందట.  ఈ కారణంగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని అంటున్నారు.  అందుకే తులసి మొక్క ఉన్న ప్రాంతంలో కానీ,  తులసి మొక్క దగ్గర కానీ పాదరక్షలు విడవకండి.

డస్ట్ బిన్..

చాలామంది ఇంటి ప్రాంగణంలో డస్ట్ బిన్ ఉంచుతుంటారు. కొంచెం ఇరుకైన ఇళ్లలో తులసి మొక్క పక్కనే డస్ట్ బిన్ కూడా పెడుతుంటారు.  ఇలా చేయడం చాలా తప్పు.  తులసి ఉన్న ప్రదేశంలో ఎప్పుడూ శుభ్రత ఉండాలి. శుభ్రత ఉన్న చోటే లక్ష్మీ దేవి కూడా నివాసం ఉంటుంది. కాబట్టి తులసి మొక్క దగ్గర డస్ట్ బిన్ ఉంచడం, చెత్త పోగు చేయడం వంటివి చేయరాదు.

శివలింగం..

తులసి మొక్క ఉన్న దగ్గర శివలింగాన్ని ఉంచడం నిషేధించారని అంటున్నారు. తులసి మొక్క దగ్గర శివ లింగం ఉంచితే ఆ ఇంట్లో అశాంతి ఏర్పడుతుందట.  అంతేకాదు శివలింగానికి తులసిని సమర్పించకూడదని కూడా అంటున్నారు.  

పై మూడు పనులు చేసే వారు ఇక మీదట అయినా వాటిని చేయడం మానుకోవాలి.  లేకపోతే ఆ ఇంటికి అరిష్టమని,  ఆ ఇంట్లో అశాంతి,  ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని అంటున్నారు.

                                                 *రూపశ్రీ.


More Karthikamasa Vaibhavam