మహర్షులు మహా శాస్త్రవేత్తలు
(Indian Sages Great Scientists)
చాలామందికి మనదేశంపట్ల చులకనభావం ఉంది. మనవాళ్ళకి ఏమీ తెలీదని, మనం వెనకబడి ఉన్నామని, విదేశీయుల్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలని వ్యాఖ్యానించడం ఎన్నోసార్లు మన చెవిన పడుతుంది. నిజానికి మన మహర్షుల దార్శనికత ముందు ఈనాటి అభివృద్ధి, సాంకేతికత బలాదూరే అంటే అతిశయోక్తి కాదు.
ఇతర దేశాల్లో ఈమధ్యకాలంలోనే సైన్సు టెక్నాలజీ అభివృద్ధి చెందాయి. ప్రతిదానికీ పరికరాలు వచ్చాయి. నిరంతరం ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ మనదేశంలో కొన్ని వేల సంవత్సరాల నాడే ఆయుర్వేద వైద్యం, శస్త్ర చికిత్స ఉన్నాయి. అంతరిక్ష, ఖగోళ శాస్త్రాలకు సంబంధించి కూలంకష వివరాలు ఉన్నాయి. దూరశ్రవణ, దూరదర్శన విద్యలు ఉన్నాయి.
మన మహర్షులు తమ దివ్య దృష్టితో చూసి భూమికి సంబంధించిన అంశాలను అంచనా వేశారు. ఆ లెక్క ప్రకారం భూ పరిమాణం 50 కోట్ల యోజనాలు. ఈ వివరాలు పూరాణాల్లో లిఖితమై ఉన్నాయి.
మన మునీశ్వరులు ఎంత మహానీయులో, మహా మేదావులో మనం గుర్తించడం లేదు. కానీ సంస్కృత గ్రంధాలను అధ్యయనం చేసిన విదేశీయులు వారి గొప్పతనాన్ని చాటిచెప్పి ప్రశంసించారు. ఆర్థర్ హోమ్స్ అనే శాస్త్రవేత్త, తన ''Age of the Earth'' అనే గ్రంధంలో భూమి వయసుకు సంబంధించి ఇప్పటి సైన్సు చెప్పే లెక్కలు ఏనాడో హిందూదేశ పండితులు చెప్పిన లెక్కలు సరిపోతున్నాయి - అంటూ రాశారు.
Indian sages doctors, sages scientists, indian sages and astronautics, sages astronomy, Indian Sages Great Scientists