జీవితంలో పురోగతి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?


చాలా సందర్భాలలో పురోగతి అనేది క్రమంగా జరుగుతుంది. అలా క్రమంగా జరిగేది ఏదైనా సరే గమనించడం కష్టతరమవుతుంది. ఉదాహరణకు చాలా పెద్ద పరిమాణం గల గడియారంలో ఉండే ముల్లు యొక్క కదలిక. చిన్నతనం నుంచి ఒక భాషను మనం నేర్చుకుంటూ ఉన్నప్పటికీ, పురోగతిని గమనించడం కష్టమవుతుంది. కానీ పురోగతి ఎల్లకాలం జరుగుతూనే ఉంటుంది. బల్లపై నిద్రిస్తున్న వ్యక్తిని ఆ బల్లతోపాటే మోసుకుపోయినట్లుగానే ఆధ్యాత్మిక సాధకుడు కూడా తాను ఎరుగనప్పటికీ సదా పురోగమిస్తూనే ఉంటాడని శ్రీ శ్రీశారదాదేవి చెప్పి ఉన్నారు. నిద్రిస్తున్న ఆ వ్యక్తికి తన పురోగతి గురించిన ఎరుకే లేదు. కానీ నిద్ర నుంచి లేచిన తరువాత అప్పటికే తన గమ్యస్థానాన్ని చేరుకుని ఉండడాన్ని అతడు గమనిస్తాడు. తెలియకున్నప్పటికీ కూడా అతడు ఎల్లకాలం దీ ముందుకు సాగుతూనే ఉన్నాడు. అయితే ఇదంతా అతణ్ణి బల్లపై పోతుంటేనే ఆధ్యాత్మిక జీవితం పట్ల మన - దృక్పథం ప్రాపంచిక విషయాలపట్ల ఉన్నట్లు కాకుండా అందుకు భిన్నంగా ఉండాలి.


సంసారిక విషయాలలో మన దృక్పథం పరిమాణాత్మకమైనది. మన పురోగతి లేదా విజయం అనేది వాటి పరిమాణాన్ని బట్టి నిర్ధారిస్తారు. కానీ ఈ విధమైన మనస్తత్త్వాన్ని వీడనంత కాలం మనం ఆధ్యాత్మిక జగత్తులోకి అడుగు పెట్టనట్లే!


సాధకుడనేవాడు నిబద్ధుడై ఉండాలి. అలాంటి సాధకుణ్ణి గాలం వేసి చేపలు పట్టే జాలరితో పోల్చవచ్చు. ఆ జాలరి కొక్కానికి ఎర వేసి, ఎంత సమయం తీసుకున్నప్పటికీ చివరికి ఏదో ఒక చేప దాన్ని మింగకమానదు అనే దృఢవిశ్వాసంతో ఉంటాడు. శ్రీరామకృష్ణులు సాధకుణ్ణి ఒక సాంప్రదాయిక రైతుకూ, వ్యాపార పరంగా వ్యవసాయం చేపట్టినవానికీ మధ్య ఉన్న తేడాతో పోలుస్తారు. అనావృష్టి లేదా ధరల తగ్గుదల లాంటివి మొదలైన వెంటనే ఆ రెండోరకం వ్యక్తి వ్యవసాయాన్ని విడిచిపెట్టి మరో వృత్తి చేపడతాడు. కానీ సాంప్రదాయిక రైతు మాత్రం అలా చేయడు. తనకు వ్యవసాయమే జీవితం అన్నట్టు ఉంటాడు. అందుకే నేటి కాలానికి కూడా వ్యవసాయం ఇంకా బ్రతికే ఉంది. లేకపోతే చదువుకున్న ఏ డిగ్రీకో కష్టపడనవసరం లేకుండా హాయిగా ఏదో ఒక ఉద్యోగం చూసుకునే వెసులుబాటు ఉన్నా అటువైపు వెళ్లకుండా ఉంటున్నారు. వ్యవసాయంతోనే అడుగులు వేస్తున్నారు. 

 నిజమైన సాధకుడు కూడా అంతే..  కేవలం ఆధ్యాత్మిక సాధనే చేయదగిన కార్యంగా భావిస్తాడు. అందువల్ల అతడు లాభనష్టాలను బేరీజు వేసుకోవడం మానుకొని, ఏదో ఒక నాటికి తన సాధనలు తప్పక ఫలిస్తాయనే దృఢచిత్తంతో ముందుకు సాగుతాడు.

మనలోని విశ్వాసం, అభిలాషలు మరింత దృఢతరమవుతున్నట్లు అయితే మనం సాధనలో పురోగమిస్తున్నట్లు ధ్రువపరచుకోవచ్చు. నిరుత్సాహకరమైన, డీలా పడే సందర్భాలు కూడా మనకు అప్పుడప్పుడు తారసపడతాయి. అలాంటప్పుడు చిరు దీపం లాంటి మన అభిలాషలు కూడా మరింత మసకబారతాయి. నిరాశా నిస్పృహలకు లోను కాకుండా కానీ శ్రద్ధగా సాధన చేసే ప్రతి ఒక్కరి విషయంలో యౌవనం ఆదర్శానుసరణకు సరైన సమయం. మనిషి యౌవనంలోలా మరి ఏ ఇతర దశల్లోనూ ఆదర్శం కోసం అన్వేషించడు. ఒక్కోసారి ఈ అన్వేషణ బుద్ధిపూర్వకంగా చేస్తాడు. కొన్నిసార్లు తనకు తెలియకుండానే ఆదర్శాల కోసం అన్వేషిస్తాడు. ఆదర్శాల గురించి యువతకు ఎన్నో గొప్ప విషయాలు చెప్పి, భారతీయ గొప్పదసనం గురించి వివరించి యువతను సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసిన వారిలో స్వామి వివేకానంద ప్రముఖులు. అందుకే ఆయన జన్మదినాన్ని (జనవరి 12) 'జాతీయ యువజనోత్సవం'గా దేశమంతా జరుపుకుంటారు.

                                   ◆ నిశ్శబ్ద.


More Subhashitaalu