అడుగడుగునా ఓటమి ఎదురవుతోందా... భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కారణాలివే!

హిందూ మతంలో భగవద్గీత చాలా పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. గీతను అనుసరించేవారు కేవలం  భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, గీతను చదివే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తారు.   మనిషి తన సమస్యలన్నింటికీ భగవద్గీతలో పరిష్కారం కనుగొనగలడని నమ్ముతారు. ఒక వ్యక్తి జీవితంలో ఓటమిని ఎదుర్కోంటున్నాడంటే తన జీవితంలో  కొన్ని అలవాట్లు తప్పుగా ఉన్నాయని అర్థం. ఈ విషయం  గురించి భగవద్గీతలో  శ్రీ కృష్ణుడు చెప్పాడు. పదే పదే ఓటమి ఎదురవుతోంటే మాత్రం మీకు కూడా ఈ అలవాట్లు ఉన్నాయేమో గమనించుకోవాలి. వెంటనే వాటి వదిలేయాలి. లేకపోతే భవిష్యత్తు విషయంలో చాలా నష్టాలను భరించడానికి సిద్దం కావాల్సి ఉంటుంది. అడుగడుగునా ఓటమి ఎదురవుతున్నవారు వదిలిపెట్టాల్సిన అలవాట్లేంటో తెలుసుకుంటే..  

తమ సంతోషానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు, ఇతరులతో స్వార్థం కోసం మాట్లాడేవారు కొందరుంటారు. అలాంటి వారు జీవితంలో కష్టసమయాలు వచ్చినప్పుడు ఇతరులను ఆదుకోరు. పైపెచ్చు ఇతరులకు నష్టాలు కలిగిస్తారు. కుటుంబ సభ్యులనుండి, స్నేహితులు, ఆప్తుల నుండి దూరంగా ఉండేవారు వైఫల్యాలు ఎదుర్కొంటారు. సుఖంలోనూ, దుఃఖంలోనూ ఆదుకునేవారు, బాధను పంచుకునేవారు ఎవరూ లేకపోవడమే దీనికి కారణం.

సంకోచం అనేది చాలా చెడ్డ అలవాటు. దీనివల్ల చాలా నష్టాలు కలుగుతాయి. కీలకమైన విషయాలు, నిర్ణయాలు సంకోచం కారణంగా తలకిందులైపోతాయి. ఇలా సంకోచం ఉన్నవారు విజయం సాధించలేరు. కేవలం సంకోచమే కాదు, అహం నిండిన వ్యక్తి కూడా జీవితంలో విజయం సాధించలేడు. ఎందుకంటే అహం ఉన్నవాడు తానే గొప్ప అనుకుంటాడు. ఇతరులు చెప్పేది వినడు. జ్ఞానాన్ని ఆర్జించలేడు.

ఆవేశంతో చేసే పనులకన్నా ఆలోచనతో చేసే పనులు విజయానికి చేరువ చేస్తాయి. కాబట్టి ఆవేశం ఉన్నవారు ఎప్పటికీ విజేతలు కాలేరు. ఆలోచన, ముందు వెనుక ఆలోచించే విచక్షణ చాలా ముఖ్యం. పోలికలు పెట్టడం, ఇతరులను చూసి అసూయ పడటం, ఓర్పు లేకపోవడం మనిషి పతనానికి మెట్లు అవుతాయి.

ఆత్మవిమర్మ, స్వీయ అవగాహన లేని వ్యక్తి విజయానికి దూరంగానే ఉంటాడు. స్వీయ బలాలు, బలహీనతల గురించి సరైన స్పష్టత అవసరం. ఆ స్పష్టత లేకపోతే అతని ప్రయత్నం కూడా స్పష్టత లేకుండానే ఉంటుంది. ప్రాణాళికా పరంగా ఎప్పుడూ ఉండదు. ఇలా ఉంటే పొంతన లేని వ్యూహాలు తప్ప అవగాహానతో చేసే పనులు ఏమీ ఉండవు.

                                              *నిశ్శబ్ద.

 


More Subhashitaalu