సనాతన ( హిందు ) ధర్మం లో "ఓం" ను ఎందుకు భగవంతుని

 

చిహ్నము గా స్వీకరించారు?

 

Information about significance of OM Symbol in Hinduism, Hinduism Meaning Om, Om Symbol   Importance Hindu Gods & Goddess

 

శబ్దమే భగవంతుడని చెప్పబడింది. ప్రతిపదము నకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది. శబ్దోచ్చారణ లో మనం కంఠంలోని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి.నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా 'అ 'కార ఉచ్చారణ కు తోడ్పడదు. ఇది ఓంకారానికి బీజం గా ఉంది .చివరిది 'మ 'కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు .నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయములో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా ఓంకారం తెలియజేస్తూంది. అందువలన ఓంకారాన్ని స్వీకరించడము జరిగింది.


More Enduku-Emiti