చైత్ర నవరాత్రులు రేపే ప్రారంభం.. ఎవరు ఉపవాసం ఉండకూడదో తెలుసా...

 

హిందూ మతంలో నవరాత్రులు చాలా గొప్ప వేడుక.  ఈ తొమ్మిది రోజులు అమ్మవారి పూజ,  నైవేద్యాలు,  అమ్మవారి అలంకారాలు, ఉపవాసాలు చేస్తారు. అయితే తెలుగు సంవత్సరంలో నవరాత్రులు కేవలం శరదృతువు లో శరన్నవరాత్రులు మాత్రమే కాకుండా.. చైత్ర మాసంలో చైత్ర నవరాత్రులు కూడా వస్తాయి.  ఈ చైత్ర నవరాత్రులలో అమ్మవారిని పూజించి,  ఉపవాసం ఉంటారు.  అయితే ఈ నవరాత్రులలో ఎవరు ఉపవాసం ఉండకూడదో తెలుసుకుంటే..

చైత్ర నవరాత్రి ఉపవాసం ఎవరు ఉండకూడదు..

 స్త్రీలకు రుతుక్రమం ఉంటే వారు  నవరాత్రి ఉపవాసం పాటించకూడదు. అయితే, ఉపవాసం సమయంలో ఋతుస్రావం ప్రారంభమైతే వారు దానిని కొనసాగించవచ్చు.

గర్భిణీ స్త్రీలు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండకూడదు ఎందుకంటే ఉపవాసం కాలంలో  ధాన్యాలు తినడం నిషేధించబడింది. అటువంటి పరిస్థితిలో కడుపులో పిండానికి సరైన పోషకాహారం లభించకపోతే పిండం  అభివృద్ధి ప్రభావితం కావచ్చు. కాబట్టి గర్భధారణ సమయంలో ఉపవాసం ఉండకుండా ఉండాలి.

ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీలు కూడా నవరాత్రి ఉపవాసం పాటించకూడదు. శిశువుకు తల్లి ఆహారం నుండి మాత్రమే పోషకాహారం పొందుతుంది. కాబట్టి తల్లి సమతుల్య,  పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

రక్తహీనతతో బాధపడేవారు కూడా ఉపవాసం ఉండకూడదు. రక్తం లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఉపవాసం ఆరోగ్యానికి మరింత హానికరం అవుతుంది.

మధుమేహంతో బాధపడేవారు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం  చాలా ముఖ్యం. ఉపవాసం ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా ఉంటాయి. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అటువంటి పరిస్థితిలో ఉపవాసం ఉండే ముందు వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

నవరాత్రి సమయంలో ఉవవాస నియమాలు..

నవరాత్రి సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. ఈ తొమ్మిది రోజులు నల్లని దుస్తులు ధరించకూడదు.

 ఉపవాసం ఉండేవారు పగటిపూట నిద్రపోకూడదు.

పండ్లు పాలు తీసుకోవచ్చు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా, సానుకూల శక్తి లభిస్తుంది మరియు దుర్గాదేవి ఆశీస్సులు  ఉంటాయి. పై సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉంటే వారికి మంచి జరగకపోగా అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని చెబుతారు.

                               *రూపశ్రీ
 


More Enduku-Emiti