మాటల ఉచ్చులో చిక్కుకోవద్దు
కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం
దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న
చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా
బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా!
పందికొక్కు బోనులో ఉన్న ఎరని చూసి ఆశపడి అందులో అడుగుపెడితే దానికి హాని తప్పదు కదా! దుర్మార్గుడు తియ్యతియ్యగా ఎన్ని మాటలు చెప్పినా నమ్మి, వాడిని అనుసరించకూడదు. వాడి మాటలు నమ్మామా.... పోయి పోయి ఉచ్చులో చిక్కుకున్నట్లే!