ఉండాల్సిన లక్షణాలు!
వాంఛా సజ్జనసంగతౌ పరగుణే ప్రీతిర్గురౌ నమ్రతా
విద్యాయాం వ్యసనం స్వ యోషితి రతిర్లోకాపవాదాద్భయమ్ ।
భక్తిః శూలిని శక్తిరాత్మ దమనే సంసర్గ ముక్తిః ఖలైః
యేష్వేతే నివసంతి నిర్మల గుణాస్తేభ్యో నమః కుర్మహే ॥
సదా సజ్జనులతోనే కలిసి ఉండాలనే వాంఛ, ఇతరులలో ఉండే మంచి లక్షణములని చూసి సంతోషించే తత్వం, గురువులయందు వినయము, చదువు పట్ల అభినివేశం, భార్యతోనే కాపురం, లోకులు వేసే అపవాదులకు దూరంగా ఉండే ప్రయత్నం, భగవంతునియందు భక్తి, మనోనిగ్రం, దుర్జనులకు దూరంగా ఉండటం... ఇలాంటి నిర్మలమైన గుణాములు కలిగిన సజ్జనులకు అభివాదం చేస్తున్నాను.