గొప్పవారు ఇలా ఉంటారు!
విపది ధైర్యమథాభ్యుదయే క్షమా
సదసి వాక్పటుతా యుధి విక్రమః ।
యశసి చాభిరుచిర్వ్యసనం శ్రుతౌ
ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనామ్ ॥
ఆపదలు కలిగినప్పుడు ధైర్యం, అభ్యున్నతిలో ఉన్నప్పుడు ఓరిమి, సభలో ఉన్నప్పుడు వాక్చాతుర్యం, యుద్ధంలో వీరత్వం, కీర్తియందు విముఖత, శాస్త్రాల పట్ల అభిరుచి... అనే లక్షణాలు మహాత్ములకు ప్రకృతిసిద్ధంగా లభిస్తాయి.