నిజమైన అలంకారములు
కరే శ్లాఘ్యస్య్తాగః శిరసి గురుపాద ప్రణయితా
ముఖే సత్యా వాణీ విజయి భుజయోర్వీర్యమతులమ్ ।
హృది స్వచ్ఛా వృత్తిః శ్రుతిమధిగతం చ శ్రవణయోః
వినాప్యైశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనమిదమ్ ॥
మహాత్ముల చేతులకు త్యాగమే ఆభరణం, వారి శిరసుకి గురుపాద గురుపాదనమస్కృతే ఆకర్షణ, ముఖానికి సత్యవాక్కే అలంకారము, భుజాలకు పరాక్రమమే భూషణం, హృదయమునందు స్వచ్ఛతే ప్రవృత్తి, చెవులకు శాస్త్ర విషయాలే అందము.