• Next
  • Prema Pandem part 38


    రాంబాబు మెదడంతా గజిబిజిగా వుంది. డైమండ్ నెక్లెస్ కోనేయవచ్చు ... అదేం పెద్ద సమస్యేం కాదు అనుకునేంతలో ఏదో ఒక ఆటంకం ... వూహించని విధంగా వస్తూంది. సర్వోత్తమరావు, ఆత్మానందం మాటలని బట్టి లోన్ శాంక్షన్ అవుతుందనీ ... ఆ డబ్బుకి మిగతా డబ్బు జోడించి డైమండ్ నెక్లెస్ కోనోచ్చని అనుకున్నాడు. కానీ వ్యాఘ్రేశ్వరరావు పుల్ల పెట్టడంతో వ్యవహారం బెడిసికొట్టింది. తరువాత సరోజ క్రితం రోజు వచ్చి తన డబ్బు యాభైవేలు బ్యాంకు నుండి డ్రా చేసి ఆఫీసుకు తెచ్చి యిస్తానంది. అంతే ... రాత్రంతా సరోజతో తన పెళ్ళి అయిపోయినట్టు, తానూ ఆమె ఆనందంగా కాపురం చేస్తున్నట్టు, రంగు రంగుల కళలు కన్నాడు. ఉదయం హుషారుగా ఆఫేసుకు వచ్చాడు. వచ్చిన దగ్గరనుండి సరోజ ఎప్పుడొస్తుందో .. ఎప్పుడొస్తుందో అని ఆతృతగా ఎదురుచూశాడు. ఆమె రాలేదుగానీ ... ఆమె దగ్గరనుండి ఫోన్ వచ్చింది. ఫోన్ లో ఆమె చెప్పిన విషయం వినగానే అతనికి నీరసం ఆవహించింది.

    వ్యాఘ్రేశ్వరరావు కూతురు బ్యాంకు అక్కౌంటు మీద నిఘా వేశాడు. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. “డామిట్!’’ టేబుల్ మీద కసిగా గట్టిగా గుద్దాడు అతను. ఆ దెబ్బకి టేబుల్ మీది పేపర్ వేయిటు ఎగిరి నేలమీద పది ముందుకు దొర్లుకుపోసాగింది. అతను కంగారుగా సీటులోంచి లేచి దాని వెనకాల పరిగెత్తాడు. అది అప్పటికే చాలా ముందుకు దోర్లుకుని పోయింది ... అలా దొర్లుతూ మేనేజర్ క్యాబిన్ సమీపించసాగింది రాంబాబుకు కంగారు పుట్టింది. దాన్ని మేనేజర్ క్యాబిన్ లో కి వెళ్ళకుండా ఎలాగైనా ఆపాలి లేకపోతే చివార్లు తప్పవు. స్పీడ్ గా వెళ్ళి గభాలున మోకాళ్ళమీద పడి పేపర్ వెయిట్ ని పట్టుకోబోయాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపొయింది. అది మేనేజరు నందివర్థనరావు క్యాబిన్ లోకి వెళ్ళిపోయింది. అతను కంగారులో అలాగే మోకాళ్ళమీద గబగబా పాక్కుంటూ స్వింగ్ డోర్స్ క్రిందినుండి మేనేజరు క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు. మరుక్షణం తన పోరాబాటుని గ్రహించి నాలుక కొరుక్కుని తల ఎత్తి చూసిన అతను అక్కడ దృశ్యం చూసి హడలిపోయాడు.

    నందివర్థనరావు కౌగిలిలో టైపిస్టు లీల ... నందివర్థనరావు లీలని ముద్దు పెట్టుకోబోతున్నాడు. అతను ఎవరో అమ్మాయిని హత్య చేస్తున్నంత ఇదిగా కంగారుపడిపోయి “బాబోయ్ ...’’ అంటూ కేక పెట్టాడు రాంబాబు. దెబ్బకి చీర సర్దుకుని క్యాబిన్ లోనుంచి గబగబా బయటికి వెళ్ళిపోయింది. రాంబాబు క్రిందినుంచి లేచి గజగజా వణుకుతూ నిల్చున్నాడు. ‘’సారీ సార్! నా ఉద్దేశ్యం మిమ్మల్ని ఇలా చూడాలని కాద్సార్ ... నేను ఏ మాత్రం వూహించినా అసలు లోపలి వచ్చుండే వాడిని కాద్సార్’’ అన్నాడు కంగారుగా. “మరి లోపలికి ఎందుకు వచ్చావ్? వచ్చిన వాడివి ఏ మాత్రం శబ్దం చేయకుండా ఎందుకొచ్చావ్? లాభంలేదు ... నీ తోక కట్ చేయాల్సిందే’’ అన్నాడు నందివర్థనరావు సీరియస్ గా. ‘’అబ్బే ... నేను శబ్దం చేసుకుంటూనే వచ్చాను సార్ ...’’ “అంతే డప్పు వాయించుకుంటూ వచ్చావా?’’ “లేద్సార్! నేలమీద జరజరా పాక్కుంటూ వచ్చాను సార్’’ వినియంగా చెప్పాడతను. నందివర్థనరావు ఉలిక్కిపడ్డాడు. “నేలమీద పాక్కుంటూ వచ్చావా ...?’’ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు.

    “అవును సార్ ...! స్వింగ్ డోర్స్ క్రిందినుంచి పాక్కుంటూ వచ్చాను కావాలంటే నా మోకాళ్ళ దగ్గర చూడండి ... ఫ్యాంటెలా మట్టికొట్టుకుపోయిందో’’ మోకాళ్ళను చూపిస్తూ అన్నాడు. “లోపలికి మామూలుగా నడుచుకుంటూ రాకుండా క్రిందినుంచి నేలమీద పాక్కుంటూ వచ్చావా? ఎందుకలా వచ్చావ్? నన్ను గమనించమని ఎవరు చెప్పారు నీకు? నా గురించి నీకు ఎందుకు కుతూహలం కలిగింది. ఎందుకు? ఎందుకు?? ఎందుకు ...???’’ ప్రశ్నల వర్షం కురిపిస్తూ అతను రెండడుగులు ముందుకు వేశాడు. అంతే ... అతని కుడికాలు నేలమీద బుల్లెట్ వేగంతో ముందుకు జారి ఇంకా జారే అవకాశం లేక ఆగిపోయింది ... ఫలితం ... కుడి పాదానికి, ఎడమ పాదానికి మధ్యఐదడుగుల దూరం! రెండు కాళ్ళూ దూరంగా సాగిపోయి బ్యాలెన్స్ తప్పి ధనేల్ మని నేలమీద ... సరిగ్గా రాంబాబు పాదాలమీద పడ్డాడతను.

  • Next