• Prev
  • Next
  • Prema Pandem part 36

     

    ఆ రోజు రాత్రి అతనికి నిద్రే పట్టలేదు. రాత్రిపూట.... మంచం మీద పడుకునే... ఓ సారి సరోజ చేతిని పట్టుకున్న చోట ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. “నేను ఫోన్ చెయ్యకపోతే ఆమె ఏమనుకుంటుందో... పొగరు అనుకుంటుందా? అహంకారం అనుకుంటుందా? ఏమనుకుంటుంది... ?! తనలాంటి అందమైన అమ్మయి ఫోన్ నెంబరు ఇచ్చి ఫోన్ చెయ్యమంటే చెయ్యనందుకు నన్ను ఒట్టి చవట సన్యాసి అని అనుకుంటుందేమో!” ఇలాంటి ఎడతెగని ఆలోచనలతో అతనికి నిద్రపట్టలేదు. రెండు రోజులు గడిచిపోయాయి. ఆ రోజు సర్వోత్తమరావు “నీకు ఫోన్ వచ్చిందోయ్” అన్నాడు. తనకి ఫోన్ చేసేవాళ్ళు ఎవరబ్బా అని ఆశ్చర్యపోతూ ఫోన్ అందుకున్నాడు రాంబాబు. “హలో!” “హలో! నన్ను గుర్తు పట్టరా?” అవతలి నుండి తియ్యని కంఠస్వరం. అతడి గుండెకాయ ఒక్కక్షణ ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది భారంగా.

    “మీరూ! సరోజా...?” “నేనే! మీరు నాకు ఫోన్ చెయ్యలేదు కదా... అందుకే నేన డైరెక్టరీలో మీ కంపెనీ ఫోన్ నెంబర్ చూసి చేస్తునా... నాకెందుకు ఫోన్ చెయ్యలేడూ?” అతడి మీద అధికారం వున్నట్టు ప్రశ్నించింది ఆమె. “అదీ! మరీ.... అంటే....” నసగాసాగాడు అతడు. “ఓ అమ్మాయి తనంతట తను ఫోన్ చెయ్యమని అడిగేసరికి కాస్త లెవెల్ చూపిస్తున్నారా?” “అబ్బే! కాదండీ... అసలేమిందంటే...” తను టిక్కెట్ ఎలా పారేసుకున్నదీ, ఆ తర్వాత చిత్తు కాగితాలు ఎరుకునేవాడిలా ఎలా దానికోసం వెతికింది ఆమెకు వివరించి చెప్పాడు రాంబాబు అది విన్తున్నంతసేపూ ఆమె నవ్వుతూనే వుంది. అతడు చెప్పడం పూర్తయిన తర్వాత ఆమె అడిగింది. “సరే గానీ ఈవేళ మనిద్దరం కలుద్దామా? నా అంతట నేను అడుగుతున్నానని మళ్ళీ లెవెల్ చూపిస్తారా?”

    “అదేమిటండీ అలా అంటారు? తప్పకుండా కలుద్దాం.... ఎక్కడ?” ఎంతో సంతోషంగా అడిగాడు రాంబాబు. “లక్డీకాపూల్ లో.... రవీంద్రభారతి దగ్గర...” “ఎప్పుడూ...?” “సాయంత్రం ఆరుగంటలకు” “అలాగే! అలాగాలాగే... చాలా థాంక్స్....” ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు అతను. “నేనిక వుంటాను సాయంత్రం కలుడ్డంమ్మం..... బై” అంది ఆమె. “బై...” అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం! అలా మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. “ఏంటి ఊహాలోకాల్లో విహరిస్తున్నావ్?” ఉలిక్కిపడి చూశాడు రాంబాబు గుమ్మంలో సరోజ నిలబడి ఉంది. అతను చాలా ఆశ్కార్యపోయాడు. కారణం సరోజ ఎప్పుడూ తన గాడికి రాలేదు.... ఇదే మొదటి సారి. ఒకసారి అతను రమ్మంటే “బ్రహ్మచారుల గాడికి ఆడపిల్లలు రావడము అంత మంచిది కాదు” అని నిరాకరించింది. అతను చిన్న బుచ్సుకుంటే “నీ మీద నమ్మకం లేకకాదు చుట్టూ పక్కల వాళ్లు నా గురించి తక్కువగా అనుకోవచ్చు. అది నాకు ఇష్టం లేదు” అని చెప్పింది.

    అటువంటిది ఇప్పుడు తనంతట తనే వచ్చింది! బహుశా పెళ్లి ప్రస్తావన కూడా రావడం చేత రాంబాబు తన మనిషే అనే భావన ఎక్కువ కావడం చేతనేమో. “ఏంటి అలా పిచ్చిపట్టినట్టు చూస్తావ్? లోపలి రమ్మనవా?” అంది ఆమె. అతను తేరుకుని లేచి నిలబడి “రా... రా... లోపలి రా... అయినా నెక్కు నా పర్మిషన్ కావాలా? నేను నీ వాడిని... ఏ గది కూడా నీదే” అన్నాడు. “మొదటిది బాగానే ఉంది గానీ ఏ గది కూడా నాదే అంతే ఇంటి ఓనర్ వచ్చి గొడవ పట్టుకుంటాడు” మంచం మీద కూర్చుంటూ నవ్వుతూ అంది ఆమె.

  • Prev
  • Next