• Prev
  • Next
  • Prema Pandem part 32

    ఇంటికి వెళ్లేముందు పూర్తి చేసిన ఫైళ్ళు తీసుకెళ్ళి మేనేజర్ ముందు పెట్టాడు రాంబాబు. “అయిపోయిందా” అడిగాడు నందివర్థనరావు. “అయిపొయింది సార్!” “ఊ... సరే వెళ్లు” రాంబాబు కదలలేదు అల్లానే నిల్చున్నాడు. “ఏంటి?” కల్లెగారేస్తూ అడిగాడు అతను. “అంటే నన్ను వెళ్ళిపొమ్మంటున్నారా సార్? ఇంకేమీ లేదా?” మెల్లగా అడిగాడు రాంబాబు. “ఏమైనా వుంటే రేపు వుదయం ఇస్తానులే... పని మీద నీకున్న శ్రద్ధ చూస్తుంటే నాకు భలే ముచ్చతెస్తుందోయ్... నీ తోకస్సాలు కట్ చెయ్యాలని అనిపించడం లేదు వెరీ గుడ్.... వెరీ గుడ్....” “థాంక్యూ సార్! నేనిక వస్తాను” రాంబాబు క్యాబిన్ బయటకు వచ్చేసి జుట్టు పీక్కున్నాడు. ఆ మర్నాడు కూడా ఉదయం నుండీ సాయంత్రం దాకా రాంబాబు చాలా ఆతృతగా ఎదురుచూశాడు అతను తనని పిలుస్తాదేమోనని. కానీ ఆ రోజు ఆఫీసు పని గురించి కూడా అతన్ని పిలవలేదు నడివర్ధనరావు. సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు రాంబాబు మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్లాడు.

    “ఆ.... ఏంటోయ్ రాంబాబూ... ఏంటి సంగతి?” అడిగాడు నందివర్ధనరావు. “ఏం లేద్సార్! నాకేమైనా చెప్తారెమోననీ” నసిగాడు రాంబాబు. “అబ్బే! ప్రస్తుతం ఏమీ లేదోయ్... ఇవిగో అర్జంటు ఫైలు వున్నాయి. వీటిని నేను చూసి రేపు నీ దగ్గరికి పంపిస్తాను” “సరే సార్! నేను వస్తాను సార్” రాంబాబు బయటికి వచ్చేశాడు. అప్పుడు సర్వోత్తమరావు ఇంటికి వెళ్ళడానికి సర్దుకుంటున్నాడు. “మనం ఒకసారి ఆత్మానందం ఇంటికి వెళ్ళాలి. ఈ వేళ కూడా నందివర్ధన రావు మీ చెప్పలేదు” అన్నాడు సర్వోత్తమరావు తో రాంబాబు. ఈ వేళ వద్దులే అని అనాలనుకున్న సర్వోత్తమరావు రాంబాబు మొహం చూసి అలా అనలేకపోయాడు. “సరే పద...” ఇద్దరూ ఆత్మానందం ఇంటికి బయలు దేరారు. దారిలో సర్వోత్తమ రావు రాంబాబుని అంత డబ్బు దేనికని అడిగాడు. రాంబాబు సరోజ గురించి, వ్యాఘ్రేశ్వరావు పెట్టిన కండిషన్ గురించీ చెప్పాడు.

    “కండిషన్ చాలా వింతగా ఉండే...” అన్నాడు సర్వోత్తమరావు. ఇద్దరూ ఆత్మానందం ఇల్లు చేరారు. దొర బెల్ నొక్కగానే ఆత్మానందమే తలుపు తీశాడు. “ఏంటి సార్! ఈ వేళ కూడా జనరల్ మేనేజర్ గారి దగ్గర్నుండి మా మేనేజర్ కి విధమైన ఇన్ స్త్రక్షన్స్ రాలేదు. మీరసలు ఆయనతో మాట్లాడారా?” అడిగాడు సర్వోత్తమరావు ఆత్మానందాన్ని. “నేను నిన్ననే మాట్లాడానోయ్” “ఆయనేమన్నారు సార్?” రాంబాబు ఆతృతగా అడిగాడు. అప్పుడు ఆత్మానందం చెప్పిన సమాధానం రాంబాబుని పాతాళంలోకి తోసేసింది. “సారీ బాబూ! నీ పని మాత్రం ఆయన చేయ్యననియా అన్నాడు. నేను ఎప్పుడూ ఏం చెప్పినా చెయ్యనని అనడు. నీ దురదృష్టం” రాంబాబు మొహం పాలిపోయింది

  • Prev
  • Next