• Prev
  • Next
  • Prema Pandem part 33

    ఇంటికి వచ్చిన రాంబాబు మంచం మీద నీరసంగా కూర్చుండి పోయాడు. ఈ రెండు రోజులూ అతను “ఎన్నో కళలు కన్నాడు. లోన్ శాంక్షన్ అయినట్టూ, డబ్బు చేతికి అందినట్టూ, మిగతా డబ్బు స్నేహితుల దగ్గర తీసుకున్నట్టూ, డైమండ్ నెక్లెస్ కోనేసిఅనట్టూ, దానిని సరోజ పుట్టిన రోజున ఆమె మేడలో తనే స్వయంగా అలంకరించినట్టూ, తరువాత సరోజతో తన పెళ్లి జరిగినట్టూ! ఆత్మానందం అరచేతిలో వైకుంఠం చూపించియా చివరికి పాతాళంలోకి నేట్టేశాడు. అనవసరంగా వాడి గురించి రెస్టారెంట్లో ఆరువందల రూపాయలు ఖర్చు చేశాను అసలు నిజంగా జనరల్ మేనేజర్ తో మాట్లాడాడో, లేక పొతే వూరికే అలా అన్నాడో! ఏమో... ఇలాంటి వాళ్ళను నమ్మటానికి వీల్లేదు. అందరికీ ఏవేవో ఆశలు పెట్టి రేస్తారెంట్లకీ తీసుకెళ్ళి ఇలా కోళ్ళూ, కుక్కలూ మింగుతుంటారు అనుకున్నాడు రాంబాబు. రెండు రోజుల క్రితం “సర్వోత్తమరావు ఆత్మానందం గురించి చెప్పినప్పుడు తన సమస్య తీరిపోయిందని అనుకున్నాడు. కానీ ఇప్పుడు సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.

    యాభై వేలు... ఎక్కడినుంచి తేవాలి? ఎలా తేవాలి? అదీ నెల లోపల. నేలేమిటి...? అప్పుడే నాలుగు రోజులు అయిపొయింది. అంతే ఇరవై ఆరు రోజులలోగా! పోనీ బయట ఎక్కడైనా అప్పు చేద్దాం అంతే ఈ సెక్యూరిటీ లేకుండా యాభై వేలు అప్పు ఎవడిస్తాడు? “అసలు సరోజని నేను దక్కించుకోగలనా?” నిస్పృహగా అనుకున్నాడు అతను. అతనికి సరోజతో పరిచయం ఆరునెలల్ క్రితం గమ్మతుగ్గా జరిగింది. ఆ రోజు ఆఫీసుకి వెళ్ళటానికి సిటీ బస్ ఎక్కాడు రాంబాబు. ఆ రోజు స్టేట్ గర్నమెంట్ హాలిడే! కానీ ప్రైవేటు కంపెనీలు మాత్రం పని చేస్తున్నాయి. అందుచేత బస్సు అంత రద్దీగా లేదు సగానికి సగం సీట్లు ఖాళీగానే వున్నాయి. అతను ఖాళీగా ఉన్న ఒక సీట్లో కూర్చున్నాడు. బస్సు కదిలింది. రాంబాబు కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తున్నాడు. బస్సు రెండు స్టాపుల్లో ఆగింది. రెండో స్టాపు నుండి బస్సు కడలి కదలగానే ఎవరో తన ప్రక్కన కూర్చున్నట్టు అనిపించింది రాంబాబుకి. తల త్రిప్పి పక్కకు చూశాడు. ఓ అందమైన అమ్మాయ్...

    అతను ఆ ఆమయిని చూడగానే చాల కన్ ప్యూజ్ అయిపోయాడు. “ఎవరీ అమ్మాయి? ఎందుకు నా ప్రక్కన కూర్చింది? అయినా ప్రక్కన కూర్చోవాలని ఎందుకు కూర్చుంతుందీ? కొంపదీసి ఇది ఆడవాళ్ళ సీటేమో...! అన్ని సీట్లూ ఖాళీగానే వున్నాయ్ గదా అని చూసుకోకుండా కూర్చున్నాను” అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే రాంబాబు ఆమె వంక చూసి “సారీ అండీ వెరీ వెరీ సారీ! చూసుకోకుండా కూర్చున్నాను” అన్నాడు కంగారుగా. “ఇప్పుడు మీ ప్రక్కన కూర్చున్నదినేను నా ప్రక్కన మీరేం కూర్చోలేదు” అందామె నవ్వుతూ. “అది కాదండీ! నేను చూసుకోకుండా ఆడాళ్ళ సీటులో కూర్చున్నానని అంటున్నాను సారీ” సీతులోంచి లేవబోయాడతాను. ఆమె చటుక్కున అతని చెయ్యి పట్టుకుంది. “ఇది ఆడవాళ్ళ సీటు కాదు. జనరల్ సీటే... మీరు లేవకండి... కూర్చోండి. రాంబాబు ఏమీ అర్థం కాక ఒక్క క్షణం పాటు తెల్లబోయి చూశాడు.

    "సారీ” ఆమె రాంబాబు చేయి వదిలిపెట్టింది. “మీరు కూర్చోండి చెబుతాను” నించోడానికీ, కుర్చోడానికీ మధ్య స్థితిలో ఉన్న అతను అయోమయంగా మొహం పెట్టి కూర్చున్నాడు. “మీకు ఇబ్బంది కలిగిస్తే సారీ అండీ! ఏమీ లేదు ఒక రోడ్ సైడ్ రోమియో నా వెంటపడ్డాడు” చెప్పిందామె. “ఓ... అలాగా! హయ్యో అన్నాడతను ఎంత ఘోరం అజ్రిగిపోయింది అన్తున్నాతూ. “వాడు మన సీటుకి నాలుగు సీట్లు వెనకాల కూర్చున్నాడు డుబ్బు జుట్టుతో, నీలరంగు గళ్ళ చొక్కాతో ఉన్నాడు” అతను వెనక్కి తిరిగి చూశాడు.

  • Prev
  • Next